
మలయాళ సీనియర్ నటుడు జనార్ధనన్ తన జీవితంలోని ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. 18 ఏళ్లపాటు ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించానని, ఈ విషయం తన భార్యకు కూడా తెలుసని ఆయన తెలిపారు. తన కుటుంబానికి దీనివల్ల ఎలాంటి ఇబ్బందీ రాలేదన్నారు.
Key Points
నటుడు జనార్ధనన్ 18 ఏళ్లపాటు ఓ మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించినట్లు వెల్లడించారు.
ఈ ఎఫైర్ గురించి తన భార్యకు కూడా తెలుసని, ఆమెకు కొన్ని విషయాల్లో ఆసక్తి తగ్గడంతో జరిగిందని తెలిపారు.
ఈ బంధం వల్ల తన కుటుంబంలోని ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు రానివ్వలేదని జనార్ధనన్ పేర్కొన్నారు.
సమాజానికి భయపడి ఆ మహిళ దూరమైందని, అది తన జీవితంలో ఒక చేదు మరకగా మిగిలిందని చెప్పారు.
వివాహేతర బంధంపై జనార్ధనన్ సంచలన వ్యాఖ్యలు
పెళ్లయ్యాక కూడా ఓ మహిళతో సంబంధం పెట్టుకున్నా.. 18 ఏళ్లపాటు ఆ ఎఫైర్ నడిపాను అంటున్నాడు మలయాళ సీనియర్ నటుడు జనార్ధనన్. అంతేకాదు, ఈ ఎఫైర్ గురించి తన భార్యక్కూడా తెలుసని చెప్తున్నాడు. మలయాళంలో ఎక్కువగా కామెడీ, విలన్ పాత్రలతో గుర్తింపు పొందిన జనార్ధనన్ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు.
18 ఏళ్లపాటు మరో మహిళతో ఎఫైర్ ఈ సందర్భంగా జనార్ధనన్ ( Actor Janardhanan ) మాట్లాడుతూ.. నేను వివాహేతర సంబంధం పెట్టుకున్నాను. 18 ఏళ్ల క్రితం ఓ మహిళతో రిలేషన్ కొనసాగించాను. తనకోసం నేను చాలా చేశాను. ఇవన్నీ నా భార్యకూ తెలుసు. తనకు కొన్ని విషయాల్లో ఆసక్తి తగ్గిపోయింది. అందుకే నేను ఇంకో అమ్మాయిని చూసుకున్నాను. నేనూ మనిషినే కదా! 18 ఏళ్లపాటు తనతో సంబంధం కొనసాగించాను.
భార్యకు తెలిసినా ఇబ్బంది లేదన్న నటుడు
ఏ తప్పూ చేయలేదు కానీ, ఆమె ఈ సమాజానికి భయపడి సడన్‌గా నన్ను దూరం పెట్టేసింది. నా జీవితంలో ఇదొక్కటే చెడుమరకగా మిగిలిపోయింది. ఇది కాకుండా నేనింకే తప్పూ చేయలేదు. పైగా దీనివల్ల నా కుటుంబంలోని ఎవరూ ఇబ్బందులకు గురికాలేదు. ఈ వయసులో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నేను కోల్పోవడానికంటూ ఏమీ లేదు. నా భార్య విషయానికి వస్తే తను చాలా మంచిది. చాలా బాగా వండిపెట్టేది అని చెప్పుకొచ్చాడు.
సినిమా జనార్ధనన్ బంధువులమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. చిన్నప్పటి నుంచి తనకు తెలిసిన విజయలక్ష్మి అనే అమ్మాయిని వివాహం చేసుకోగా వీరికి ఇద్దరు కూతుర్లు జన్మించారు. ఒరు సీబీఐ డైరీ కురిప్పు, మెలపరంబిల్ ఆన్వీడు, మన్నార్ మఠై, 2018 వంటి పలు మలయాళ సినిమాల్లో నటించాడు. నాగేంద్రాస్ హనీమూన్ వెబ్ సిరీస్‌లోనూ యాక్ట్ చేశాడు. చివరగా మోహన్‌లాల్ హృదయపూర్వంలో కనిపించాడు.
కుటుంబంపై ఎలాంటి ప్రభావం రాలేదు
మొత్తంగా జనార్ధనన్ తన వ్యక్తిగత జీవితంపై చేసిన ఈ వ్యాఖ్యలు మలయాళ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కుటుంబానికి ఎలాంటి హాని లేకుండా 18 ఏళ్ల బంధాన్ని కొనసాగించిన ఆయన ధైర్యాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.


