|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

2025లో హీరోలను మించిపోయిన విలన్లు: బాలీవుడ్‌ను షేక్ చేసిన పవర్‌ఫుల్ క్యారెక్టర్లు!

Published: 01-01-2026, 4:30 AM
2025లో హీరోలను మించిపోయిన విలన్లు: బాలీవుడ్‌ను షేక్ చేసిన పవర్‌ఫుల్ క్యారెక్టర్లు!
  • 2025లో బాలీవుడ్‌లో విలన్ పాత్రలు ప్రేక్షకులపై బలమైన ముద్ర వేశాయి.
  • అక్షయ్ ఖన్నా ‘దురంధర్’ సినిమాలో విలన్‌గా సోషల్ మీడియాను షేక్ చేశారు.
  • నవాజుద్దీన్ సిద్ధిఖీ, రణదీప్ హుడా నటనతో హీరోలకు దీటుగా నిలిచారు.
  • బలమైన నెగటివ్ క్యారెక్టర్లు సినిమా విజయానికి కీలకంగా మారాయని రుజువైంది.

2025 బాలీవుడ్‌లో విలన్ పాత్రలు అద్భుతమైన ప్రభావాన్ని చూపాయి. హీరోలను మించి వీరు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అక్షయ్ ఖన్నా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, రణదీప్ హుడా వంటి నటులు తమ నటనతో సినిమా స్థాయిని పెంచారు. ఈ ఏడాది విలన్ల పవర్‌కు నిదర్శనం.

‘దురంధర్’లో అక్షయ్ ఖన్నా అదరహో!

2025 Villains: 2025 సంవత్సరం బాలీవుడ్ సినిమాలకు.. చాలా ప్రత్యేకమైన సంవత్సరంగా నిలిచింది. ఈ ఏడాది భారీ బడ్జెట్ సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి..మరికొన్ని ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ ఒక విషయం మాత్రం ఈ సంవత్సరం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. అదేంటంటే.. ఈ ఏడాది విలన్ పాత్రలు ప్రేక్షకులపై గట్టి ప్రభావం చూపాయి.

సాధారణంగా సినిమాల్లో హీరో గెలుపే కథగా ఉంటుంది. కానీ 2025లో వచ్చిన కొన్ని సినిమాల్లో విలన్ల నటన హీరోలను కూడా మించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. మంచి కథతో పాటు బలమైన నెగటివ్ క్యారెక్టర్ ఉంటే సినిమా స్థాయి ఎలా పెరుగుతుందో ఈ ఏడాది రుజువు చేసింది.

ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు మొదటి పేరు.. అక్షయ్ కన్నా. ఆయన నటించిన దురంధర్.. సినిమాలో విలన్ పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. చాలా కాలం తర్వాత అక్షయ్ ఖన్నా చేసిన ఈ పాత్ర సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చగా మారింది. సినిమాలోని ఇతర పాత్రల కంటే ఆయన నటన ఎక్కువగా గుర్తుండిపోయిందని.. చాలామంది అభిప్రాయం. అంతేకాదు ఇంస్టాగ్రామ్ మొత్తం కూడా.. ఆయన ఎంట్రీ వీడియో తెగ వైరల్ అవుతూ వచ్చింది.

నవాజుద్దీన్, రణదీప్ హుడా నటనకు ఫిదా!

అదే సినిమాలో మరో ముఖ్యమైన పాత్రలో అర్జున్ రాంపాల్.. కనిపించారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయనకు ఈ సినిమా.. మంచి కంబ్యాక్‌గా మారిందని అభిమానులు అంటున్నారు. ఆయన పాత్రకు మంచి స్పందన వచ్చింది.

ఇక మరోపక్క..మాడాక్ ఫిల్మ్స్ హారర్-కామెడీ యూనివర్స్ నుంచి వచ్చిన తమ్మ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేదు. కానీ అందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ చేసిన విలన్ పాత్ర మాత్రం ప్రేక్షకులను.. బాగా ఆకట్టుకుంది. భవిష్యత్తులో ఈ ఫ్రాంచైజీలో ఆయన మళ్లీ కనిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఇక జాట్.. సినిమాలో రణదీప్.. నటన మరో స్థాయిలో నిలిచింది. హర్యానా బ్యాక్‌డ్రాప్‌లో ఆయన చూపించిన రఫ్ అండ్ పవర్‌ఫుల్ క్యారెక్టర్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. కొంతమంది అభిమానులు ఆయన నటన హీరో సన్నీ డియోల్‌కు సమానంగా ఉందని కూడా అన్నారు.

హీరోలను మించిపోయిన విలన్ల క్రేజ్

మొత్తంగా చూస్తే..2025లో విలన్ పాత్రలకు ప్రేక్షకులు జై జైలు పలికారు. బలమైన నెగటివ్ క్యారెక్టర్లు సినిమాలకు ప్రాణంగా మారుతాయని ఈ సంవత్సరం రుజువు చేసింది. 2026లో కూడా ఇలాంటి గుర్తుండిపోయే విలన్లు మరింతగా రావాలని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.

మొత్తంగా, 2025 బాలీవుడ్‌లో విలన్ పాత్రలు కేంద్ర బిందువుగా నిలిచాయి. బలమైన నెగటివ్ క్యారెక్టర్లు కథకు ప్రాణం పోశాయి. ప్రేక్షకులు విలన్లను ఆదరించడం చూస్తుంటే, భవిష్యత్తులోనూ ఇలాంటి మరుపురాని పాత్రలు మరింతగా వస్తాయని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.