
📌 Key Points
- 2026 జనవరి 9న విజయ్ ‘జననాయగన్’ vs కపిల్ శర్మ ‘కిస్ కిస్కో ప్యార్ కరూ 2’ విడుదల.
- మార్చి 9న రణవీర్ ‘ధురంధర్ 2’తో యశ్ ‘టాక్సిక్’, అడివి శేష్ ‘డకాయిట్’ ఢీ.
- జూన్ 12న రజనీకాంత్ ‘జైలర్ 2’తో షాహిద్ కపూర్ ‘కాక్‌టెయిల్ 2’ పోటీ పడనున్నాయి.
- అక్టోబర్ 2న అజయ్ దేవగన్, మోహన్‌లాల్ ల ‘దృశ్యం 3’లు ఒకేసారి విడుదల కానున్నాయి.
2026లో బాక్సాఫీస్ రణరంగం ఖాయం. సౌత్, బాలీవుడ్ అగ్ర తారలు భారీ సినిమాలతో తలపడనున్నారు. విజయ్, యష్, రజనీకాంత్, ప్రభాస్ వంటి సౌత్ స్టార్స్… రణవీర్, షాహిద్, అజయ్ దేవగన్ వంటి బాలీవుడ్ హీరోలతో ఢీ కొట్టనున్నారు. ఈ ఏడాది సినిమా అభిమానులకు పెద్ద వినోదం పంచుతుంది.
జనవరి-మార్చిలో భారీ పోటీలు
ఈ రెండు సినిమాలు జనవరి 9న రిలీజ్ అవుతున్నాయి. ‘జననాయగన్ ‘ తలపతి విజయ్ పాన్ ఇండియా తమిళ యాక్షన్ సినిమా. ‘కిస్ కిస్కో ప్యార్ కరూ 2’ కపిల్ శర్మ నటించిన బాలీవుడ్ కామెడీ సినిమా. ఈరెండు సినిమాలలో విజయ్ సినిమానే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఇది 2026లో అతిపెద్ద పోటీ. రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’ మార్చి 9న వస్తోంది. అదే రోజు యశ్ ‘టాక్సిక్’, అడివి శేష్ ‘డకాయిట్: ఎ లవ్ స్టోరీ’ కూడా రిలీజ్ అవుతున్నాయి. ఈసినిమాల మధ్య కాస్త టఫ్ కాంపిటేషన్ కనిపించేలా ఉంది. మరీ ముఖ్యంగా రణ్ వీర్ సింగ్ , యష్ మధ్య ప్రధానంగా పోటీ నెలకొనబోతుంది.
రజనీకాంత్, ప్రభాస్ తో బాలీవుడ్ క్లాష్
మే 1న రితేష్ దేశ్‌ముఖ్ ‘రాజా శివాజీ’ రిలీజ్ అవుతుంది. అదే రోజు అడివి శేష్ నటించిన తెలుగు పాన్ ఇండియా స్పై యాక్షన్ డ్రామా గూఢచారి 2 కూడా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలలో గూఢచారి సినిమా ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది.
సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో తలపడటానికి షాహిద్ కపూర్ రెడీ అవుతున్నాడు. ఈ ఏడాది జూన్ 11 న షాహిద్ కపూర్ ‘కాక్‌టెయిల్ 2’ రిలీజ్ కాబోతుండగా.. ఆ తర్వాతి రోజే, జూన్ 12న రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రెండు సినిమాలలో జైలర్ ప్రభావం బాక్సాఫీస్ దగ్గర ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
ఒకే పేరుతో రెండు దృశ్యం 3
ఆగస్టు 14, 2026న ‘లవ్ అండ్ వార్’, ‘నాగ్‌జిలా’ వస్తున్నాయి. వీటికి పోటీగా ఆగస్టు 15న పాన్ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన తెలుగు యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ వస్తోంది. ప్రభాస్ ప్రభంజనం ముందు ఆ రెండు సినిమాలు నిలబడటం కష్టమనే చెప్పాలి.
అక్టోబర్ 2, 2026న చరిత్రలో తొలిసారిగా ఒకే పేరుతో రెండు సినిమాలు పోటీ పడనున్నాయి. ఒకటి అజయ్ దేవగన్ బాలీవుడ్ ‘దృశ్యం 3’, రెండోది మోహన్‌లాల్ మలయాళ ‘దృశ్యం 3’. ఈ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ కాబోతున్నాయి. మరి ఇందులో ఎవరిసినిమాకు ఎక్కువ స్పందన వస్తుందో చూడాలి.
మొత్తంగా, 2026 సంవత్సరం సినిమా ప్రియులకు అనేక భారీ క్లాష్‌లను అందించనుంది. సౌత్, బాలీవుడ్ హీరోల మధ్య జరిగే ఈ పోటీ, బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. ఏ సినిమా విజయం సాధిస్తుందో చూడాలి.


