|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మరో ఓటీటీలోకి ఇవాళ తెలుగులో వచ్చిన 5 వేల కోట్ల సూపర్ హిట్ మూవీ- అదిరిపోయే యాక్షన్ అడ్వెంచర్ మూవీ- 4 భాషల్లో స్ట్రీమింగ్!

Published: 13-10-2025, 9:10 AM
మరో ఓటీటీలోకి ఇవాళ తెలుగులో వచ్చిన 5 వేల కోట్ల సూపర్ హిట్ మూవీ- అదిరిపోయే యాక్షన్ అడ్వెంచర్ మూవీ- 4 భాషల్లో స్ట్రీమింగ్!

హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ లైవ్ యాక్షన్ మూవీ నేడు డిస్నీ+ హాట్‌స్టార్‌లో తెలుగుతో సహా 4 భాషల్లో స్ట్రీమింగ్ ప్రారంభించింది. రూ. 5,340 కోట్లు వసూలు చేసిన ఈ అదిరిపోయే యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ఇప్పుడు ఇంట్లోనే వీక్షించండి.

Key Points

1

హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ లైవ్ యాక్షన్ మూవీ నేడు డిస్నీ+ హాట్‌స్టార్‌లో విడుదల.

2

ప్రపంచవ్యాప్తంగా రూ. 5,340 కోట్ల భారీ వసూళ్లు సాధించిన సూపర్ హిట్ చిత్రం.

4

ఇది పిల్లలు, పెద్దలు ఇద్దరినీ ఆకట్టుకునే అద్భుతమైన యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్.

డ్రాగన్ మూవీ వసూళ్లు, రేటింగ్ వివరాలు

ఓటీటీలోకి ఇటీవల కాలంలో కుప్పలుతెప్పలుగా సినిమా స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. ఇతర భాషా సినిమాలు కూడా తెలుగులో ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. అలా ఇవాళ (అక్టోబర్ 13) ఓ సినిమా తెలుగులో ఓటీటీ ప్రీమియర్‌కు వచ్చింది. ఆ సినిమానే హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్.

హాలీవుడ్‌లో లైవ్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్. అయితే, ఇదివరకు యానిమేషన్ రూపంలో నాలుగైదు పార్ట్స్‌గా ఈ సినిమా వచ్చి ఆడియెన్స్‌ను అమితంగా ఆకట్టుకుంది. ఈ సినిమాకు ఉన్న క్రేజ్‌తో ఈ ఏడాది లైవ్ యాక్షన్ మూవీగా హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్‌ను తీసుకొచ్చారు.

అదిరిపోయే యాక్షన్, అడ్వెంచర్ థ్రిల్లర్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అమెరికాలో జూన్ 13న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు రొట్టెన్ టోమాటోస్ నుంచి 99 శాతం ఫ్రెష్ కంటెంట్ అని పేరు వచ్చింది. అలాగే ఐఎమ్‌డీబీ నుంచి పదికి 7.8 రేటింగ్ సాధించుకుంది.

ఇప్పటికే ప్రైమ్ వీడియోలో అద్దెకు..

150 మిలియన్ డాలర్స్ అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 1260 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. ఏకంగా 635.7 మిలియన్ డాలర్స్ కొల్లగొట్టింది. భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 5,340 కోట్లు. అంటే, పెట్టిన బడ్జెట్‌కు నాలుగు రెట్ల కలెక్షన్స్ వచ్చాయి.

అలాంటి హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ సినిమా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ ప్రీమియర్ అవుతోంది. అయితే, ప్రైమ్ వీడియోలో రెంటల్ విధానంలో హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ ఓటీటీ స్ట్రీమింగ్ అయింది. అది కూడా కేవలం ఇంగ్లీష్, హిందీ భాషల్లో మాత్రమే డిజిటల్ స్ట్రీమింగ్ అయింది.

డిస్నీ+ హాట్‌స్టార్‌లో తెలుగులో స్ట్రీమింగ్

ఇక తాజాగా ఇవాళ (అక్టోబర్ 13) మరో ఓటీటీలోకి వచ్చేసింది హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ మూవీ. జియో హాట్‌స్టార్ (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్)లో నేటి నుంచి హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. హాట్‌స్టార్‌లో ఇంగ్లీష్, హిందీతోపాటు తెలుగు, తమిళం వంటి నాలుగు భాషల్లో హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ ఓటీటీ రిలీజ్ అయింది.

యానిమేషన్ జీవులతోపాటు మనుషులను చూపించే ఈ లైవ్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ పిల్లలు చూసేందుకు బెస్ట్. పిల్లలు మాత్రమే కాకుండా పెద్దలు కూడా ఈ సినిమాను చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు.

హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ మూవీ పిల్లలు, పెద్దలు ఇద్దరినీ ఆకట్టుకునే అద్భుతమైన యాక్షన్ అడ్వెంచర్. తెలుగులో హాట్‌స్టార్‌లో అందుబాటులోకి రావడంతో, ఈ సెలవుల్లో కుటుంబంతో కలిసి చూసేందుకు ఇది సరైన ఎంపిక.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.