|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆమె అందం వెనుక ఓ ఎక్స్‌ట్రార్డినరి కోపం దాగి ఉంది.. 8 వసంతాలు నుంచి బిగ్ అప్‌డేట్ ఇస్తూ పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్

Published: 13-06-2025, 5:08 AM
ఆమె అందం వెనుక ఓ ఎక్స్‌ట్రార్డినరి కోపం దాగి ఉంది.. 8 వసంతాలు నుంచి బిగ్ అప్‌డేట్ ఇస్తూ పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్

‘మ్యాడ్’ సినిమా నటి అనంతిక ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘8 వసంతాలు’ చిత్రం నుంచి కొత్త పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్‌లో అనంతిక అందం వెనుక దాగి ఉన్న కోపాన్ని చూపిస్తుంది. జూన్ 20న విడుదల కానున్న ఈ సినిమాకు ప్రమోషన్స్ జోరందుకున్నాయి.

పవర్‌ఫుల్ పోస్టర్ విడుదల

మ్యాడ్(Mad) సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్(Ananthika Sanilkumar) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘8 వసంతాలు’(8 Vasanthalu). ఫణీంద్ర నర్సెట్టి(Phanindra Narsetti) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) నిర్మించారు. ఈ చిత్రంలో రవితేజ దుగ్గిరాల, హను రెడ్డి, కన్న పసునూరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కాగా జూన్ 20 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

అనంతిక సీరియస్ లుక్

అయితే రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ వరుసగా అప్‌డేట్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ అప్డేట్ ఇస్తూ హీరోయిన్ పవర్‌ఫుల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా .. ఆమె అందం వెనుక, అసాధారణమైన కోపం & కోరిక దాగి ఉంది.. భావోద్వేగ తుఫానుకు సిద్ధంగా ఉండండి. జూన్ 15న 8 వసంతాలు ట్రైలర్ విడుదల కాబోతుంది’ అని రాసుకొచ్చారు.

ట్రైలర్ రిలీజ్ డేట్

ఇక పోస్టర్‌లో అనంతిక గ్రే కలర్ ప్యాంట్ అండ్ షర్ట్ వేసుకుని పోనిటెల్ వేసుకుంది. అలాగే ఓ చేతిలో బ్యాగ్ పట్టుకుని ముఖం మీద గాయాలతో, చేతిపై రక్తపు మరకలతో చూడటానికి చాలా సీరియస్ లుక్‌లో కనిపించింది. ఇక ఆమెకు రైట్ సైడ్‌లో కాళిక అమ్మవారు చాలా కోపంగా నాలుక బయటపెట్టి చూస్తుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేసింది.

అనంతిక నటనతో పాటు, సినిమాలోని భావోద్వేగం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఈ పోస్టర్ సూచిస్తోంది. జూన్ 15న విడుదలయ్యే ట్రైలర్‌తో మరిన్ని వివరాలు తెలుస్తాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.