|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

9 ఏళ్ల కష్టం.. మంచి పాయింట్‌తో సినిమా తీసిన దర్శకుడు

Published: 11-09-2025, 3:13 AM
9 ఏళ్ల కష్టం.. మంచి పాయింట్‌తో సినిమా తీసిన దర్శకుడు

తొలి సినిమాతోనే జాతీయ అవార్డు అందుకున్న రామ్ రెడ్డి తన కొత్త చిత్రం ‘జుగ్నుమా’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తొమ్మిది ఏళ్ల కష్టపడి, హిమాలయాల్లోని అనుభవం నుండి స్ఫూర్తి పొందిన ఈ సినిమా..

Key Points

1

రామ్ రెడ్డి దర్శకత్వం వహించిన 'జుగ్నుమా' సినిమా సెప్టెంబర్ 12న విడుదలవుతోంది.

2

హిమాలయాల్లోని అగ్నిప్రమాదం ఆయనకు ఈ కథకు స్ఫూర్తినిచ్చింది.

4

బెర్లిన్ మరియు లీడ్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అవార్డులు గెలుచుకుంది.

జుగ్నుమా: 9 ఏళ్ల కష్టం ఫలితం

తొలి సినిమా ‘తిథి’ (కన్నడ మూవీ)తోనే జాతీయ అవార్డు అందుకున్న రామ్‌ రెడ్డి మరో కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆయన దర్శకత్వం వహించిన లేటెస్ట్‌ మూవీ జుగ్నుమా ( Jugnuma – The Fable film ). ఈ మూవీ ద ఫేబుల్‌ పేరిట అంతర్జాతీయ స్థాయిలో విడుదలైంది. ఇప్పుడు దేశీయ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్‌ 12న ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద అలరించనుంది. జుగ్నుమా కథ ఇప్పటిది కాదు! తొమ్మిదేళ్ల క్రితం హిమాలయాల్లో అగ్నిప్రమాదం జరిగినప్పుడు వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక దళాలకు తనవంతు సాయం చేశాడు రామ్‌ రెడ్డి.

ఆ సమయంలో ఈ కథ పురుడు పోసుకుంది. భారత్‌- నేపాల్‌ సరిహద్దులోని హిమాలయ ప్రాంతాల్లో ఈ మూవీ షూటింగ్‌ చేశారు. ఇందులో అడవిలో చెట్లను పరిరక్షించాల్సిన ఆవశ్యకత గురించి నొక్కి చెప్పారు. మనోజ్‌ బాజ్‌పాయ్‌, ప్రియాంక బోస్‌ ప్రధాన పాత్రలు పోషించారు. బెర్లిన్‌ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుకలో జుగ్నుమా ప్రదర్శితమైంది. లీడ్స్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రం అవార్డు దక్కించుకుంది. సినిమా ప్రదర్శితమైన ప్రతి చోటా దర్శకుడి ప్రతిభకు ప్రశంసలు దక్కాయి. దర్శకనటుడు అనురాగ్‌ కశ్యప్‌, నిర్మాత గునీత్‌ మోంగా సైతం సినిమా చూసి అభినందించారు.

హిమాలయాల నుండి స్ఫూర్తి

అంతర్జాతీయ ప్రశంసలు

జుగ్నుమా సినిమా అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన విషయం ఆనందదాయకం. రామ్ రెడ్డి కృషికి ఇది నిదర్శనం. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.