|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శివయ్య, కార్తికేయ ఆశీస్సులు! ఆది సాయికుమార్ కొడుకు పేరు ఇషాన్ కార్తీక్.. ఇంతకీ అర్థమేమిటో?

Published: 28-03-2026, 10:05 AM
శివయ్య, కార్తికేయ ఆశీస్సులు! ఆది సాయికుమార్ కొడుకు పేరు ఇషాన్ కార్తీక్.. ఇంతకీ అర్థమేమిటో?
  • ఆది సాయికుమార్, అరుణ దంపతులకు కుమారుడు జన్మించాడు.
  • శివుడు, కార్తికేయ స్వామి ఆశీస్సులతో కుమారుడికి ఇషాన్ కార్తీక్ అని నామకరణం చేశారు.
  • కొడుకు పేరును సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్న ఆది సాయికుమార్.
  • శంభాల విజయం తర్వాత ఈగో రాజా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఆది.

టాలీవుడ్ నటుడు ఆది సాయికుమార్ తన కుమారుడికి ఇషాన్ కార్తీక్ అని నామకరణం చేశారు. శివుడు మరియు కార్తికేయ స్వామి ఆశీస్సులతో ఈ పేరు పెట్టినట్లు ఆయన తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. శంభాల విజయం తర్వాత, ఆది ఈగో రాజా సినిమాలో నటిస్తున్నారు.

కొడుకు పేరును ప్రకటించిన ఆది సాయికుమార్

Aadi Sai Kumar: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న నటుడు ఆది సాయికుమార్ (Aadi Sai Kumar)గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీనియర్ నటుడు సాయికుమార్ వారుసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆది వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో తన వ్యక్తిగత కారణాల వల్ల ఇండస్ట్రీకి కొంత గ్యాప్ ఇచ్చిన ఆది తాజాగా శంభాల (Shambhala)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో తిరిగి అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు.

ఇక ఆది సాయికుమార్ కెరియర్ పక్కన పెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన అరుణ అనే అమ్మాయిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉన్నారు. అయితే కుమార్తె పుట్టిన చాలా సంవత్సరాల తర్వాత ఇటీవల ఈ దంపతులు కొడుకుకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇలా అరుణ ఆది దంపతులకు కొడుకు పుట్టడంతో వీరి కుటుంబంలో సంతోషాలు వెల్లువిరిసాయి. ఇప్పటివరకు తన కొడుకు ఎలా ఉంటారనే విషయాన్ని మాత్రం ఆది సాయికుమార్ రివీల్ చేయలేదు. ఇకపోతే నేడు ఈ చిన్నారికి నామకరణం చేసినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఆది సాయికుమార్ తన కొడుకు పేరును సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఈరోజు తన కొడుకుకు పేరు పెట్టామని తెలిపారు. ఆ శివుడి ఆశీస్సులతో అలాగే కార్తికేయ స్వామి ఆశీస్సులతో తన కొడుకుకు ఇషాన్ కార్తీక్ (Ishan Karthik)అనే పేరు పెట్టినట్లు ఈ సందర్భంగా ఆది సాయికుమార్ తన కొడుకు పేరును రివిల్ చేయడంతో అభిమానులు పేరు చాలా అద్భుతంగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈరోజు నామకరణ వేడుకను నిర్వహించినప్పటికీ ఇషాన్ కార్తీక్ ఎలా ఉంటారనే విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు.

ఇషాన్ కార్తీక్ పేరు వెనుక అర్థం ఏమిటి?

Today, we named our son Ishan Karthik, with the blessings of Lord Shiva and Lord Karthikeya. 🙏✨ pic.twitter.com/CPOHY7DfEA

— Aadi Saikumar (@iamaadisaikumar) March 28, 2026

ఆది సాయికుమార్ తదుపరి చిత్రం ‘ఈగో రాజా’

ఇక ఆది సాయికుమార్ సినిమాల విషయానికి వస్తే.. శంభాల సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ఆది తన తదుపరి చిత్రం ఈగో రాజా (Ego Raja)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఉగాది పండుగను పురస్కరించుకొని ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్లో ఆది సాయికుమార్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సినిమా పట్ల అంచనాలను పెంచేసింది.ఈ సినిమాను ఎస్‌జిఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి. సురేష్ నిర్మించగా ఈ చిత్రానికి గురు శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. శంభాల మంచి సక్సెస్ కావడంతో ఆది విభిన్నమైన కంటెంట్ ఉన్న చిత్రాలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

మొత్తానికి ఆది సాయికుమార్ తన కొడుకు పేరును అభిమానులతో పంచుకోవడం సంతోషంగా ఉంది. త్వరలోనే ఇషాన్ కార్తీక్ ఫోటోలను కూడా షేర్ చేస్తారని ఎదురుచూద్దాం. ఆయన తదుపరి సినిమా ఈగో రాజా కోసం ఆల్ ది బెస్ట్.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.