
📌 Key Points
- తొలి భార్య రీనా దత్ దూరం కావడంతో అమీర్ ఖాన్ తీవ్ర మనోవేదనకు గురయ్యారట!
- బాధను తట్టుకోలేక పోవడంతో మద్యానికి బానిసయ్యానని స్వయంగా వెల్లడించిన అమీర్.
- మద్యం అలవాటు తన పిల్లల జీవితాలను నాశనం చేస్తుందని గ్రహించి వెంటనే మానేశారట!
- వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్టాల గురించి అమీర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు.
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ జీవితంలో ఊహించని విషాదం! తన భార్య దూరం కావడంతో ఆయన పడిన వేదన గురించి స్వయంగా వెల్లడించారు. ఆ సమయంలో ఆయన ఎలా మందుకు బానిసయ్యారో తెలుసుకోండి.
మొదటి భార్యతో విడాకులు.. అమీర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్!
సాధారణంగా చాలామంది స్టార్ హీరోలకు పెద్దగా కష్టాలు ఉండవు, వారికి కావాల్సినంత డబ్బు ఉంటుంది. దాంతో వారి జీవితం ఎంతో ఆనందంగా ముందుకు సాగుతుందని భావిస్తూ ఉంటారు. కానీ ఎవరి కష్టాలు వారికి ఉంటాయి. స్టార్ హీరోలు కూడా కొన్నిసార్లు వ్యక్తిగత జీవితంలో తీవ్ర బాధలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న వారిలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్‌గా పేరుపొందిన అమీర్ ఖాన్ ఒకరు. ఈయన కూడా ఒకానొక సమయంలో వ్యక్తిగత జీవితంలో ఎదురైన బాధను తట్టుకోలేక మద్యంకు బానిస అయినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
మద్యానికి బానిసైన అమీర్.. కారణం ఇదేనా?
అమీర్ ఖాన్ మాట్లాడుతూ… నా మొదటి భార్య రీనా దత్ నా ఇంటి నుండి వెళ్లిపోయినప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఆమె అలా వెళ్లిపోవడంతో నా గుండె ముక్కలు అయినట్లు అనిపించింది. ఆ బాధను తట్టుకోలేక నేను మద్యంకు బానిసనయ్యాను. అయినా కూడా నా బాధ తగ్గలేదు. పిల్లల జీవితం ఎలా ఉంటుంది అనే ఆలోచన నన్ను మరింత కలవరపరిచింది. నేను పూర్తిగా మద్యంకు బానిసనైతే వారి జీవితం కూడా అస్తవ్యస్తం అవుతుందని అనిపించింది. దాంతో వెంటనే మద్యం మానేయాలని నిర్ణయం తీసుకున్నాను, అనుకున్నట్లే ఆ అలవాటుకి దూరం అయ్యాను. ఆ తర్వాత కొంతకాలానికి ఆ బాధ నుండి బయటపడ్డానని ఈ నటుడు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
పిల్లల కోసమే ఆ అలవాటుకు దూరం: అమీర్ ఖాన్
బటన్స్ మొత్తం విప్పేసి అరాచకం సృష్టించిన ప్రభాస్ బ్యూటీ
అమీర్ ఖాన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ సంచలన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


