
📌 Key Points
- అమీర్ ఖాన్ త్వరలో అష్నీర్ గ్రోవర్ బయోపిక్‌లో నటించనున్నట్లు సమాచారం.
- భారత్ పే సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది.
- అష్నీర్ గ్రోవర్ తన జీవిత అనుభవాలను ‘Doglapan’ పేరుతో పుస్తకంగా రాశారు.
- భారత్ పేలో అష్నీర్ గ్రోవర్ వివాదాలు, ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ త్వరలో భారత్ పే కో-ఫౌండర్ అష్నీర్ గ్రోవర్ జీవితం ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్‌లో నటించే అవకాశం ఉంది. అష్నీర్ గ్రోవర్ జీవితంలో జరిగిన సంఘటనల సమాహారమే ఈ సినిమా కథాంశం కానుంది.
అమీర్ ఖాన్ కొత్త సినిమా?
Aamir Khan : అమీర్ ఖాన్.. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌గా పేరొందిన ఈ బాలీవుడ్ టాప్ స్టార్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. అయితే గత కొంత కాలంగా సక్సెస్ అడ్రస్ పట్టుకోలేకపోతున్న అమీర్ ఎలాగైనా హిట్టు కొట్టాలంటూ ఓ క్రేజీ పర్సన్ బయోపిక్ చేసేందుకు రెడీ అయిపోతున్నాడట. యస్.. ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ ఫేమ్, భారత్ పే కో ఫౌండర్ అష్నీర్ గ్రోవర్ లైఫ్ స్టోరీని సిల్వర్ స్క్రీన్ పై పండించేందుకు సిద్ధమైపోతున్నాడని బీ టౌన్లో వినిపిస్తున్న టాక్.
2018లో శాశ్వత్ నక్రానీతో కలిసి భారత్ పే సంస్థ
ఇక అష్నీర్ గ్రోవర్ విషయానికి వస్తే.. ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ షోతో బాగా పాపులర్ అయిన అష్నీర్ 2018లో శాశ్వత్ నక్రానీతో కలిసి భారత్ పే సంస్థను స్థాపించారు. ఇది ప్రవేశపెట్టింది ఇంటరోపెరబుల్ QR కోడ్ .అంటే GPay, PhonePe, Paytm ఇలా ఏ యాప్ వాడుతున్నా ఒకే ఒక్క QR కోడ్ ద్వారా పేమెంట్ చేసెయ్యొచ్చు. అప్పట్లో ఒక్కో యాప్ కి ఒక్కో కోడ్ ఉన్న సమయంలో ఇలా ఒక్కటే కోడ్ తో పేమెంట్ చేసే అవకాశం రావడం, దానికి భారత్ పే ఎలాంటి కమీషన్ తీసుకోకపోవడంతో చిన్న చిన్న బిజినెస్‌లు చేసే వాళ్లకి ఒక వరంలా మారిందనే చెప్పాలి. అయితే దీని ద్వారా ఎలాంటి రిటర్న్స్ ఆశించకుండా, కోడ్ ద్వారా జరిగే ట్రాన్సాక్షన్ ద్వారా వ్యాపారులకి లోన్స్ ఇవ్వడంతో భారత్ పే మంచి లాభాలనే చూసింది.
కంపెనీలో 2022 ప్రారంభం నుండి అల్లకల్లోలం
అష్నీర్ గ్రోవర్ బయోపిక్ విశేషాలు
అయితే బాగా దూసుకుపోతున్న ఈ కంపెనీలో 2022 ప్రారంభం నుండి అల్లకల్లోలం మొదలైంది. అష్నీర్ గ్రోవర్ మరియు ఆయన భార్య మాధురీ జైన్ గ్రోవర్ కంపెనీ మనీని స్వంత ప్రయోజనాలకి వాడుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా కోటక్ మహీంద్రా బ్యాంక్ ఉద్యోగిని అష్నీర్ దూషించారన్న ఆడియో క్లిప్ వైరల్ అవ్వడంతో వివాదం మరింత ముదిరింది. ఎట్టకేలకి ఇన్వెస్టిగేషన్ తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అష్నీర్‌ను కంపెనీ నుండి సాగనంపారు. ఇక అప్పటి నుండి అవమాన భారంతో బయటికి వచ్చిన ఆయనకి, భారత్ పే మేనేజ్‌మెంట్‌కు మధ్య లీగల్ వార్ కంటిన్యూ అవుతూనే ఉంది.
అమీర్ అదే పుస్తకం ఆధారంగా సినిమా
ఈ క్రమంలోనే అష్నీర్ గ్రోవర్ ‘Doglapan: The Hard Truth about Life and Start-Ups’ అంటూ తన లైఫ్ స్టోరీని రాయగా, ఇప్పుడు అమీర్ అదే పుస్తకం ఆధారంగా సినిమా చేయాలని భావిస్తున్నాడట. అష్నీర్ లైఫ్ లో ఎలా ఎదిగాడు, ఎలా పడిపోయాడు వంటి అంశాల చుట్టూ కథని నడపబోతున్నాడని సమాచారం. అయితే ఇంకా ఎలాంటి పర్మిషన్ లేనటువంటి ఈ బయోపిక్ కి త్వరలో పర్మిషన్ తీసుకొని స్క్రిప్ట్ ని త్వరగా కంప్లీట్ చేసి ఈ ఏడాదిలోనే సెట్స్ పైకి తీసుకువెళ్తారని తెలుస్తోంది.
వివాదాల్లో అష్నీర్ గ్రోవర్
దంగల్’ తర్వాత ఆ స్థాయి హిట్ చూడని అమీర్
అమీర్ విషయానికే వస్తే.. 2016లో వచ్చిన ‘దంగల్’ తర్వాత ఆ స్థాయి హిట్ చూడలేదు అమీర్. 2018లో వచ్చిన ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ నుంచి 2022 నాటి ‘లాల్ సింగ్ చడ్డా’ వరకు అన్నీ ప్లాపులే. అయితే ‘తారే జమీన్ పర్’ కి సీక్వెల్ గా వచ్చిన సినిమా టాక్ బాగున్నా వసూళ్ల దగ్గర బోల్తా పడటంతో అమీర్ ఖాన్ మార్కెట్ క్లోజ్ అయిందని సోషల్ మీడియాలో దారుణంగా రోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు. మరో వైపు కాంపిటీటర్ అయిన షారుక్ ‘జవాన్’, ‘పటాన్’ అంటూ వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న పరిస్థితి.
సో ఈసారి ఎట్టిపరిస్థితుల్లో సాలిడ్ హిట్ కొట్టాలని ఇలా క్రేజీ బయోపిక్ ప్లాన్ చేశాడన్న మాట. చూడాలి మరి సెన్సేషన్ కి కేరాఫ్ అయిన ఈ బయోపిక్ బరువుని ఏ డైరెక్టర్ భుజాన వేసుకుంటాడో!
అమీర్ ఖాన్ ఈ బయోపిక్‌తో మళ్లీ ఫామ్ లోకి వస్తారా లేదా అనేది చూడాలి. ఒకవేళ ఈ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోతే ఆయన కెరీర్ ముగిసినట్టేనా అనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా ఉంది.


