|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Aarti Ravi: జయం రవి విడాకుల కేసు.. భరణం కోరుతూ ఆర్తి పిటిషన్‌

Published: 21-05-2025, 6:28 AM
Aarti Ravi: జయం రవి విడాకుల కేసు.. భరణం కోరుతూ ఆర్తి పిటిషన్‌

కోలీవుడ్ నటుడు జయం రవి మరియు ఆయన భార్య ఆర్తి మధ్య విడాకుల వ్యవహారం కొనసాగుతోంది. తాజాగా ఆర్తి, నెలకు రూ.40 లక్షల భరణం కోరుతూ కోర్టును ఆశ్రయించింది. మూడో వ్యక్తి ప్రమేయం ఉందని ఆమె ఆరోపించింది.

Key Points

1

జయం రవి, ఆర్తి విడాకుల వ్యవహారం కోర్టులో కొనసాగుతోంది.

2

మూడో వ్యక్తి ప్రమేయం ఉందని ఆర్తి ఆరోపణ.

4

కోలీవుడ్‌లో ఈ విడాకుల వ్యవహారం చర్చనీయాంశం.

జయం రవి-ఆర్తి విడాకుల కేసు

కోలీవుడ్ స్టార్ జయం రవి, ఆయన భార్య ఆర్తి విడాకుల వ్యవహారం రోజుకో మలుపు తిరుతుతోంది. ప్రస్తుతం వీరిద్దరి పంచాయతీ కోర్టులో ఉన్నప్పటికీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మాత్రం ఆగడం లేదు. ఇటీవల ఓ పెళ్లిలో జయంరవి.. ఆయన గర్ల్‌ఫ్రెండ్‌గా భావిస్తోన్న సింగర్‌ కెన్నీషా హాజరు కావడంతో వీరి వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. జయం రవి తాను ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నానని.. పంజరం నుంచి బయటపడ్డానని చెబుతూ ఓ లేఖ విడుదల చేశారు.

ఆర్తి భరణం కోసం పిటిషన్

తాజాగా ఆయన భార్య సైతం తామిద్దరం మూడో వ్యక్తి వల్లే విడిపోవాల్సి వచ్చిందని మూడు పేజీల లేఖను విడుదల చేసింది. మా ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి ప్రమేయం ఉందనడానికి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపింది.

మూడో వ్యక్తి ఆరోపణలు

ఒకవైపు వీరిద్దరు విడాకుల కోసం కోర్టుకు తిరుగుతూనే ఉన్నారు. అంతలోనే ఆర్తి మరో కీలక నిర్ణయం తీసుకుంది. తనకు నెలకు రూ.40 లక్షల భరణం చెల్లించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఆమె పిటిషన్‌ దాఖలు చేసింది. ఇప్పటికే వీరిద్దరు ఇటీవల విడాకుల కేసులో కోర్టుకు కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆర్తి భరణం కోరుతూ పిటిషన్‌ వేయడంతో కోలీవుడ్‌లో మరోసారి చర్చనీయాంశంగా మారింది

జయం రవి మరియు ఆర్తి విడాకుల కేసు కోర్టులో కొనసాగుతూనే ఉంది. ఆర్తి దాఖలు చేసిన భరణం పిటిషన్‌తో ఈ వివాదం మరింత తీవ్రమైంది. ఈ కేసు తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.