|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Abdi Abdi Song: అటు కల్యాణి ఇటు కృతిశెట్టి.. లేటెస్ట్ వైరల్ పాట

Published: 08-10-2025, 3:29 AM
Abdi Abdi Song: అటు కల్యాణి ఇటు కృతిశెట్టి.. లేటెస్ట్ వైరల్ పాట

‘లోక’ బ్లాక్ బస్టర్ హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్, ‘ఉప్పెన’ బ్యూటీ కృతిశెట్టి.. ‘జీనీ’ సినిమాలోని ‘అబ్దీ అబ్దీ’ పాటతో నెట్టింట దుమ్ము రేపుతున్నారు. ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ పాటలో వీరి స్టెప్పులు క్షణాల్లో వైరల్ అయ్యాయి.

Key Points

1

కల్యాణి ప్రియదర్శన్, కృతిశెట్టిల బెల్లీ డ్యాన్స్ 'అబ్దీ అబ్దీ' పాటలో హైలైట్.

2

రవి మోహన్ హీరోగా నటిస్తున్న 'జీనీ' తమిళ సినిమాలోని పాట ఇది.

4

అర్జునన్ దర్శకత్వంలో రూపొందిన 'జీనీ' చిత్రం ఈ ఏడాది థియేటర్లలోకి రానుంది.

వైరల్ అవుతున్న ‘అబ్దీ అబ్దీ’ పాట డ్యాన్స్

రీసెంట్‌గా ‘లోక’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కల్యాణి ప్రియదర్శన్, అలానే ‘ఉప్పెన’ బ్యూటీ కృతిశెట్టి.. బెల్లీ డ్యాన్స్‌తో అదరగొట్టేశారు. రవి మోహన్ (జయం రవి) హీరోగా చేస్తున్న లేటెస్ట్ తమిళ సినిమా ‘జీనీ’. దీని నుంచి అబ్దీ అబ్దీ అంటూ సాగే వీడియో సాంగ్‌ని తాజాగా రిలీజ్ చేశారు. అయితే ఇందులో కల్యాణి-కృతి స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి.

కల్యాణి, కృతిశెట్టిల అదిరిపోయే స్టెప్పులు

ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఈ పాటలో హీరో రవి మోహన్ కూడా ఉన్నప్పటికీ కృతి శెట్టి, కల్యాణి ప్రియదర్శన్ తమ డ్యాన్స్ మూమెంట్స్‌తో తెగ హైలెట్ అయిపోతున్నారు. గతంలో ఇలాంటి పాట ఎక్కడో చూశామే అన్నట్లు అనిపిస్తుంది కానీ చూస్తున్నంతసేపు డ్యాన్‌ మాత్రం భలే చేశారు కదా అనిపిస్తుంది. ‘జీనీ’ అర్జునన్ చిత్రానికి అర్జునన్ దర్శకుడు కాగా.. ఈ ఏడాది థియేటర్లలోకి తీసుకురానున్నారు.

‘జీనీ’ చిత్రం విశేషాలు, విడుదల వివరాలు

మొత్తానికి ‘జీనీ’ చిత్రంలోని ‘అబ్దీ అబ్దీ’ పాట కల్యాణి, కృతిశెట్టిల డ్యాన్స్‌తో ఓ సంచలనంగా మారింది. ఏఆర్ రెహమాన్ సంగీతం, వారి అద్భుతమైన స్టెప్పులు ప్రేక్షకుల మనసులను దోచుకుంటున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.