
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ సంచలన పోస్ట్ పెట్టాడు. ఐశ్వర్య రాయ్ తో విడాకుల వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఈ పోస్ట్ ప్రజలను ఆశ్చర్యపరుతోంది.
Key Points
అభిషేక్ బచ్చన్ ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలన పోస్ట్
ఐశ్వర్యతో విడాకుల ప్రచారాల నేపథ్యంలో పోస్ట్
‘నా సొంతం అయిన వాళ్లకు అన్ని ఇచ్చేశాన’ని అభిషేక్
సమాజానికి దూరంగా ఉంటానని ప్రకటన
అభిషేక్ బచ్చన్ సంచలన పోస్ట్
బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) తనయుడు అభిషేక్(Abhishek) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఈక్రమంలోనే.. స్టార్ బ్యూటీ ఐశ్వర్య రాయ్(Aishwarya Rai)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే వీరికి ఓ కూతురు కూడా ఉంది. వీరిద్దరు సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇక ఇటీవల ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ గత కొద్ది కాలంగా విడాకులు తీసుకోబోతున్నారంటూ పలు వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే వీరిద్దరు అధికారికంగా స్పందించకపోవడంతో ఆ పుకార్లు కాస్త ఎక్కువయ్యాయి.
ఇద్దరు కలిసి బయట కూడా ఎక్కువగా కనిపించడం లేదు. దీంతో అంతా వీరి విడాకులు నిజమే అని నమ్ముతున్నారు. ఈనేపథ్యంలోనే.. తాజాగా, అభిషేక్ బచ్చన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ సంచలన పోస్ట్ పెట్టాడు. అది కాస్త నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ‘‘నాకు ఇష్టమైన వాళ్లకోసం అన్నీ ఇచ్చేశా. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవు. కొన్ని రోజులు ఈ సమాజానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నా కోసం టైమ్ కేటాయిస్తాను. నన్ను నేను చాలా కోల్పొయా.. నా కోసం అన్నీ తెలుసుకుంటా. నన్ను నేను ప్రేమించుకోవడానికి ఇదే సరైన సమయం అనిపిస్తుంది. ఈ బ్రేక్ చాలా ముఖ్యం’’ అని రాసి ఉన్న కొటేషన్‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశాడు. ఇక అది చూసిన నెటిజన్లు ఐశ్వర్య రాయ్‌తో విడాకుల గురించే ఈ పోస్ట్ పెట్టాడని చర్చించుకుంటున్నారు. ఆమెకే అన్ని ఇచ్చినట్లు చెప్తున్నాడని అంటున్నారు.
విడాకుల ప్రచారాలు
నెటిజన్ల చర్చ
అభిషేక్ బచ్చన్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఐశ్వర్య రాయ్ తో విడాకుల వార్తల నేపథ్యంలో ఈ పోస్ట్ ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.


