
Key Points
విజయ్ సేతుపతి 'ఏస్' మూవీకి మిశ్రమ స్పందనలు లభించాయి.
మొదటి రోజు వసూళ్లు 'మహారాజా'తో పోలిస్తే తక్కువగా ఉన్నాయి.
సూరి నటించిన 'మామన్' మూవీ మంచి వసూళ్లు సాధిస్తోంది.
'ఏస్' కంటే 'మామన్' బాక్సాఫీస్ వద్ద ఆధిపత్యం చెలాయిస్తోంది.
‘ఏస్’ మూవీకి మిశ్రమ స్పందనలు
విజయ్ సేతుపతి నటించిన గత మూవీ `మహారాజా` పెద్ద హిట్ అయ్యింది. దీంతో ఆయన్నుంచి వచ్చిన `ఏస్` మూవీ పై అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ మూవీకి పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు. దీంతో ఇది వస్తుందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో శుక్రవారం విడుదలైంది `ఏస్.
క్రైమ్ కామెడీగా రూపొందిన `ఏస్` మూవీలో కన్నడ నటి రుక్మిణి హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీతో ఆమె కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో యోగిబాబు ముఖ్య పాత్ర పోషించారు. శుక్రవారం విడుదలైన మూవీకి మిశ్రమ స్పందన లభిస్తుంది. యోగిబాబు పాత్ర వల్లే ఈ మూవీ అంతో ఇంతో ఆకట్టుకునేలా ఉందని అంటున్నారు.
‘మామన్’ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది
విజయ్ సేతుపతి గత చిత్రాలతో పోల్చితే `ఏస్` ఫస్ట్ డే కలెక్షన్లలో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. విజయ్ గత మూవీని `ఏస్` టచ్ చేయలేకపోయింది. ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 1.8 కోట్లు వసూలు చేసింది. ఇది చాలా పూర్ ఓపెనింగ్స్ కావడం గమనార్హం.
‘ఏస్’ మరియు ‘మామన్’ మధ్య పోటీ
గత వారం విడుదలైన సూరి నటించిన ‘మామన్’ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. కోలీవుడ్‌లో ఈ మూవీ శుక్రవారం ఒక్క రోజే రూ. 1.54 కోట్లు వసూలు చేసింది. ఇది విజయ్ సేతుపతి సినిమాకి దారుణమైన అవమానమనే చెప్పాలి. ఈ వారం కూడా `మామన్` సత్తా చాటే అవకాశం ఉంది. విజయ్ సేతుపతి మూవీకి వస్తున్న టాక్ చూస్తుంటే ఇది నిలబడటం కష్టమే అనిపిస్తుంది. దీంతో ఇది సూరి సినిమాకి కలిసి వస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.


