
📌 Key Points
- ‘జెంటిల్‌మెన్’ చిత్రం మొదట శరత్‌కుమార్‌కు ఆఫర్ చేయబడింది, ఫోటోషూట్ కూడా పూర్తయింది.
- అర్జున్ కెరీర్‌లో ‘జెంటిల్‌మెన్’ చిత్రం ఒక మైలురాయిగా నిలిచింది, ఇది ఆయనకు స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది.
- సినిమా పరిశ్రమపై అసంతృప్తితో ఉన్న అర్జున్ మొదట ఈ సినిమాను తిరస్కరించాలని అనుకున్నారు.
- శంకర్ విజన్, కథలోని కంటెంట్ అర్జున్‌ను కట్టిపడేయడంతో ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.
యాక్షన్ కింగ్ అర్జున్ కెరీర్‌ను మార్చిన ‘జెంటిల్‌మెన్’ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రానికి మొదట అర్జున్‌ను అనుకోలేదట. అసలు ఆ హీరో ఎవరు? అర్జున్ ఎందుకు తిరస్కరించాలనుకున్నారో తెలుసుకోండి.
‘జెంటిల్‌మెన్’కు మొదట ఎవరిని అనుకున్నారంటే?
Action King Arjun: యాక్షన్ కింగ్ అర్జున్ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా అంటే అది ఖచ్చితంగా ‘జెంటిల్‌మెన్’ చిత్రమనే చెప్పాలి. అంతకు ముందు వరకు వరసగా ప్లాపుల్లో ఉన్న అర్జున్‌ని ఒక్కసారిగా స్టార్‌ని చేసిందీ చిత్రం. దర్శకుడు శంకర్ సృష్టించిన ఈ వండర్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడమే కాకుండా, అర్జున్ ఇమేజ్‌ను అమాంతం పెంచేసింది. అయితే ఈ సినిమా గురించి తాజాగా అర్జున్ ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై రాబోతోన్న చిత్రం ‘సీతా పయనం’. ఈ మూవీతో యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. ఫిబ్రవరి 14న ఈ సినిమా నాలుగు భాషల్లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఆయన మీడియాకు స్పెషల్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో అర్జున్ ఈ సినిమా హీరో వెనుక ఉన్న సీక్రెట్‌ను రివీల్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..
మొదట అనుకున్న హీరో ఎవరంటే?
అర్జున్ ఈ సినిమాను ఎందుకు తిరస్కరించాలనుకున్నారు?
ఈ ప్రాజెక్ట్ కోసం మొదట హీరోగా అర్జున్ కాకుండా, శరత్‌కుమార్‌ను అనుకున్నారట. అంతేకాకుండా శరత్‌కుమార్‌తో ఫోటోషూట్ కూడా పూర్తయిందని, కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ సినిమా తన దగ్గరకు వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఒక్క సినిమాతోనే అప్పట్లో సౌత్ ఇండియాలో అర్జున్ మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయారు. అయితే చిత్రమేంటంటే, ఈ సినిమాను అర్జున్ మొదట తిరస్కరించాలని అనుకున్నారట. ఆ సమయంలో చిత్ర పరిశ్రమపై ఆయనకు తీవ్రమైన అసంతృప్తి, కోపం ఉండేదని తెలిపారు. తను కష్టాల్లో ఉన్నప్పుడు పరిశ్రమలో ఎవరూ ఆదుకోలేదని, అందుకే సినిమాలకు స్వస్తి చెప్పాలనే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. కేవలం ఒక టెక్నీషియన్ పదే పదే అడుగుతున్నాడనే కారణంతో, కనీసం కథ విని ‘చేయను’ అని మొహం మీద చెప్పేద్దామని ఫిక్స్ అయ్యారట.
సినిమా పరిశ్రమపై అర్జున్ అసంతృప్తికి కారణం ఏంటి?
కానీ కథ విన్నాక ఆ నిర్ణయాన్ని మార్చుకోక తప్పలేదని అర్జున్ తెలిపారు. ఆ కథలోని కంటెంట్, శంకర్ విజన్ అర్జున్‌ని ఎంతగానో కట్టిపడేశాయట. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ‘జెంటిల్‌మెన్’ బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా, అర్జున్‌ని ‘యాక్షన్ కింగ్’గా స్థిరపరిచింది. ఒకవేళ ఆరోజు ఆయన కోపంతో ఆ సినిమాను వదులుకుని ఉంటే, టాలీవుడ్, కోలీవుడ్ ఒక అద్భుతమైన యాక్షన్ స్టార్‌ను మిస్ అయ్యేవి. తన జీవితంలో అత్యంత క్లిష్ట సమయంలో వచ్చిన ఈ సినిమా, మళ్ళీ తనను వెండితెరపై నిలబెట్టిందని అర్జున్ గుర్తుచేసుకున్నారు. ఒక అద్భుతమైన కథ నటుడిని ఎలా మారుస్తుందో చెప్పడానికి ఈ ఇన్సిడెంట్ ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు.
చివరికి, అర్జున్ ‘జెంటిల్‌మెన్’లో నటించడం ఆయన కెరీర్‌కు ఒక గొప్ప మలుపు. శంకర్ విజన్, కథ యొక్క బలం ఆయనను ఒప్పించాయి. ఈ సినిమా యాక్షన్ కింగ్ ఇమేజ్‌ను మరింత పెంచింది.


