
📌 Key Points
- యూట్యూబ్, బిగ్ బాస్ ద్వారా గుర్తింపు పొందిన నటుడు మహేష్ విట్టా.
- సినిమా ఇండస్ట్రీలో కుల వివక్ష కారణంగా అవకాశాలు కోల్పోయానని వెల్లడి.
- ఆడిషన్లలో ఎంపికైన తర్వాత కూడా చివరి నిమిషంలో తప్పించారని ఆవేదన.
- తన స్థానంలో తమ కులస్తులకు అవకాశాలు ఇచ్చారని మహేష్ వ్యాఖ్యలు.
యూట్యూబ్, బిగ్ బాస్ ద్వారా గుర్తింపు పొందిన నటుడు మహేష్ విట్టా సినిమా ఇండస్ట్రీలో కుల వివక్షపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడిషన్లలో ఎంపికైనా, కులం కారణంగా అవకాశాలు కోల్పోయానని, తన స్థానంలో ఇతరులకు అవకాశం ఇచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
మహేష్ విట్టా సినీ ప్రస్థానం
Mahesh Vitta: సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది సోషల్ మీడియా ద్వారా గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం నటీనటులుగా కొనసాగుతున్న వారు ఉన్నారు. యూట్యూబ్ ద్వారా కెరియర్ ప్రారంభించి ప్రస్తుతం ఇండస్ట్రీలో నటుడిగా సినిమాలు వెబ్ సిరీస్లలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్న వారిలో మహేష్ విట్టా(Mahesh Vitta) ఒకరు. చాయ్ బిస్కెట్ అనే ఛానల్ ద్వారా ఎన్నో వెబ్ సిరీస్ లను చేసి తనలో ఉన్న టాలెంట్ బయట పెడుతూ ఎంతో మందిని తన నటనతో మెప్పించిన మహేష్ విట్టా ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు. తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కూడా పార్టిసిపేట్ చేసిన సంగతి తెలిసిందే.
నటన పరంగా ఇండస్ట్రీలో బిజీగా ఉన్న ఈయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో తనకు ఎదురైన చేదు సంఘటనల గురించి అలాగే తనకు అవకాశాలు రావడం, క్యాస్ట్ కారణంగా అవకాశాలను కోల్పోవడం వంటి అంశాల గురించి ఈ సందర్భంగా ప్రస్తావించారు. యూట్యూబ్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న మహేష్ విట్టా ఇండస్ట్రీలోకి రావడంతోనే అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారట. ఇలా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయడం కోసం ఈయన 2016వ సంవత్సరంలో తేజ గారి ఆఫీస్ కి వెళ్లి తనని కలిసినట్టు గుర్తు చేసుకున్నారు.
కుల వివక్షపై సంచలన ఆరోపణలు
ఆ సమయంలో తేజ గారు తనకు ఒక సలహా ఇచ్చారని డైరెక్షన్ కంటే కూడా యాక్టింగ్ పట్ల దృష్టి సారించాలని చెప్పడంతో తను కూడా అటువైపు గానే ప్రయత్నాలు చేశానని తెలిపారు. ఇలా నటుడిగా అవకాశాలు కోసం ప్రయత్నిస్తున్న తనకు పలు సినిమాలలో అవకాశాలు వచ్చాయి అయితే కొన్ని సినిమాలు చేసిన తర్వాత కూడా తనకు ఇప్పటికీ రెమ్యూనరేషన్ ఇవ్వలేదని ఈయన గుర్తు చేసుకున్నారు. అలాగే మరికొన్ని సినిమా అవకాశాలను కూడా తాను కోల్పోయానని తెలిపారు.
ఆడిషన్ లో సెలెక్ట్ అయిన తర్వాత తప్పించేవారు..
అవకాశాలు ఎలా కోల్పోయారు?
ఏదైనా ఒక పాత్రకు తనని ఆడిషన్స్ చేసి పాత్రకు ఎంపిక చేసిన తర్వాత షూటింగ్ జరిగే ముందు నన్ను తప్పించి నా స్థానంలో వేరే వారిని తీసుకొని షూటింగ్ పూర్తి చేశారని తెలిపారు. అలా ఎందుకు జరుగుతుందో నాకు మొదట తెలుసేది కాదు కానీ తర్వాత క్యాస్ట్ కారణంగానే తనని తప్పించారని నా స్థానంలో వారి కులపు వారికి అవకాశాలు ఇచ్చుకున్నారు అంటూ ఈ సందర్భంగా మహేష్ విట్టా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కుల వివక్షత గురించి అలాగే కుల వివక్షత కారణంగా సినిమా అవకాశాలను కోల్పోవడం గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలా ఎన్నో ఎత్తు పల్లాలను చూసి ఇండస్ట్రీలో తాను ఈ స్థాయికి వచ్చానని మహేష్ విట్టా ఈ సందర్భంగా తెలియజేశారు.
మహేష్ విట్టా చేసిన ఈ వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీలో కుల వివక్షపై మరోసారి చర్చకు దారితీశాయి. అవకాశాల కోసం ఎదురుచూసే వారికి ఇది పెద్ద ప్రశ్నగా మారింది. ఈ సమస్యపై ఇండస్ట్రీ ఎలా స్పందిస్తుందో చూడాలి.


