
జీ5 ఓటీటీలో తమిళ సూపర్ హిట్ సిరీస్ ‘సత్తముమ్ నీతియుమ్’ తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సిరీస్ గురించి నటుడు శరవణన్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. 15 ఏళ్ళ తర్వాత ఇలాంటి శక్తివంతమైన పాత్ర పోషించినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
Key Points
జీ5 ఓటీటీలో 'సత్తముమ్ నీతియుమ్' తెలుగు, హిందీ వెర్షన్ రిలీజ్.
నటుడు శరవణన్ 15 ఏళ్ల తర్వాత శక్తివంతమైన పాత్రలో నటించారు.
సామాన్యుడి బలాన్ని చూపించే కథాంశం.
కోర్టు డ్రామా కాదు, సామాజికంగా ముఖ్యమైన కథ.
‘సత్తముమ్ నీతియుమ్’ ఓటీటీ విడుదల
జీ5 ఓటీటీ ఎప్పుడూ కూడా డిఫరెంట్ కంటెంట్, విభిన్న చిత్రాల్ని, సిరీస్‌లను అందిస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూనే ఉంటుంది. ఇక తాజాగా తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘సత్తముమ్ నీతియుమ్’ సినిమాను ఇప్పుడు తెలుగు, హిందీ భాషల్లోకి తీసుకురానున్నారు.
ఇదివరకే జూలై 18 నుంచి జీ5 లో తమిళ వెర్షన్‌లో సత్తముమ్ నీతియుమ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఇప్పుడు తెలుగు, హిందీ భాషల్లో సత్తముమ్ నీతియుమ్ వెబ్ సిరీస్‌ను ఓటీటీ రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని రీసెంట్‌గా మేకర్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా నటుడు శరవణన్ మాట్లాడుతూ .. “సత్తముమ్ నీతియుమ్ కథ విన్న వెంటనే అది నా మనసును తాకింది. ఇది రెగ్యులర్ కోర్ట్ డ్రామా కాదు. ఈ కథ సామాన్యుడి బలం గురించి మాట్లాడుతుంది. ధైర్యంగా నిలబడి పోరాడే ఓ కామన్ మెన్‌ను చూపిస్తుంది” అని చెప్పారు.
శరవణన్ పాత్ర గురించి
“ఇలాంటి ప్రాజెక్టులో నేను భాగం అవ్వాలని కథ విన్నవెంటనే నిర్ణయించుకున్నాను. 15 ఏళ్ల తరువాత మళ్లీ ఇలాంటి ఓ శక్తివంతమైన పాత్రను పోషించాను. నన్ను నమ్మి ఈ పాత్రను ఇచ్చిన దర్శకుడు బాలాజీ సెల్వరాజ్‌కు, జీ5 ఓటీటీ టీంకి నేను కృతజ్ఞుడను. ఈ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటుంది” అని యాక్టర్ శరవణన్ తెలిపారు.
జీ5 తమిళ్ తెలుగు మలయాళం బిజినెస్ హెడ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సౌత్ మార్కెటింగ్ లాయిడ్ జేవియర్ మాట్లాడుతూ .. “జీ5 ఓటీటీ లో మేము నిరంతరం వినోదాత్మకంగానే కాకుండా సామాజికంగా ముఖ్యమైన కథలను కూడా అందించడానికి ప్రయత్నిస్తాము ” అని అన్నారు.
“సత్తముమ్ నీతియుమ్‌తో న్యాయం, సత్యం వంటి అంశాలతో సామాజిక కథను అందించాం. ఆల్రెడీ తమిళంలో మా సిరీస్‌కు మంచి ఆదరణ దక్కింది. ఇప్పుడు తెలుగు, హిందీ ప్రేక్షకుల ముందుకు మా సిరీస్ రాబోతోంది. అందరినీ మెప్పించేలా మా సిరీస్ ఉంటుంది” అని జేవియర్ తెలిపారు.
సిరీస్ ప్రత్యేకతలు
తమిళంలో సూపర్ హిట్ అయిన సత్తముమ్ నీతియుమ్ ఆగస్ట్ 1 అంటే రేపటి నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ రెండు భాషల్లో జీ5లో సత్తముమ్ నీతియుమ్ ఓటీటీ రిలీజ్ కానుంది.
కాగా, శక్తివంతమైన ప్రదర్శనలు, ఉత్కంఠభరితమైన కోర్టు సన్నివేశాలు, భావోద్వేగాలతో కూడిన ఘర్షణలతో నిండిన సత్తముమ్ నీతియుమ్ ఓటీటీ సిరీస్‌ను బాలాజీ సెల్వరాజ్ తెరకెక్కించారు. 18 క్రియేటర్స్ బ్యానర్‌పై శశికళ ప్రభాకరన్ ఈ సిరీస్‌ను నిర్మించారు.
తమిళంలో విజయవంతమైన ‘సత్తముమ్ నీతియుమ్’ ఓటీటీ సిరీస్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. నటుడు శరవణన్ పాత్ర, కథానకం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ఆశిద్దాం.


