
📌 Key Points
- దండోరా ప్రెస్ మీట్ లో శివాజీ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.
- అనసూయను ఉద్దేశించి ‘నీ రుణం తీర్చుకుంటా’ అంటూ శివాజీ ఘాటు కౌంటర్ ఇచ్చారు.
- తప్పుపట్టిన పదాలకు క్షమాపణ చెప్పినా, తన స్టేట్‌మెంట్ సరైనదే అన్నారు.
- మహిళా కమిషన్ నుండి నోటీసు అందిందని, విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు.
నటుడు శివాజీ ఇటీవల మహిళల డ్రెస్సింగ్ పై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. అనసూయ తనపై చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించిన శివాజీ, త్వరలోనే ఆమె రుణం తీర్చుకుంటానని పరోక్ష హెచ్చరిక చేశారు. మహిళా కమిషన్ నోటీసు గురించి కూడా మాట్లాడారు.
అనసూయకు శివాజీ ఘాటు కౌంటర్
Shivaji Counter to Anasuya: దండోరా ప్రెస్ మీట్ లో పాల్గొన్న నటుడు శివాజీ .. హీరోయిన్లపై , ఆడవాళ్ల డ్రెస్సింగ్ పై చేసిన కామెంట్స్ కి వివరణ ఇచ్చారు . తన వ్యాఖ్యల పట్ల తాను బాధపడుతున్నాని , అయితే తన స్టేట్ మెంట్ మాత్రం తప్పలేదన్నారు . అనంతరం తన వ్యాఖ్యలపై అనసూయ చేసిన కామెంట్స్ పై కూడా ఆయన స్పందించారు . అనసూయ తనని ఇన్ సెక్యూర్ అనడంపై శివాజీ ఘాటుగా రియాక్ట్ అయ్యారు . అందరు నన్ను ఇష్టం వచ్చినట్టు అంటున్నారు .
ముఖ్యంగా యాంకర్ అనసూయ అసలు ఈ వివాదంలోకి ఎందుకు వచ్చారో అర్థం కావడం లేదు . నేను తనని ఏమైనా అన్నానా ? మీరు నా ఇన్‌సెక్యూరిటీ గురించి మాట్లాడారు. అవును నాకు ఇన్‌సెక్యూరిటీ ఉంది. అలా వెళ్లినప్పుడు మా హీరోయిన్లను అలా ఇబ్బంది పెట్టడం, దాడులు చేయడం వల్ల వారు బాధపడతారు. జరగరానిది జరిగితే.. వారు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వస్తాయని నేను ఇన్‌సెక్యూరిటీగానే ఫిల్ అవుతూనే ఉన్నా. ఇక నా మీద జాలీ చూపించిన మీ విశాల హృదయానికి చాలా థ్యాంక్స్. మీకు ఇంతటి విశాల హృదయం ఇచ్చిన దేవుడికి ధన్యవాదాలు చెబుతున్నా. ఇక తొందరలోనే మీ రుణం తీర్చుకునే అవకాశం కూడా నాకు ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా” అంటూ అనసూయకు సైలెంట్ కౌంటర్ ఇచ్చారు .
మహిళల డ్రెస్సింగ్ వ్యాఖ్యలపై వివరణ
అనంతరం తాను వాడిన రెండు పదాలపై మరోసారి క్షమాపణలు కోరారు . ‘ పదాలు మినహా తన స్టేట్‌మెంట్ కరెక్ట్ అని సమర్థించుకున్నారు. ఈ వీడియో బయటకు వచ్చాక తాను తప్పు చేశానని బాధపడ్డానని, నా కుటుంబ సభ్యులు కూడా బాధపడుతున్నారు. నా వ్యాఖ్యలను వైరల్ చేస్తూ అంతా అనసూయ, చిన్మయి లాంటి వారికి ట్యాగ్ చేస్తున్నారు. వాళ్లమో.. ఉమెన్ కమిషన్‌కి ఫిర్యాదు చేయడం.. 27వ తారీఖు విచారణకు రావాలని ఉమెన్ కమిషన్ నాకు మెసేజ్ చేశారు. నేను వస్తానని, ఖచ్చితంగా క్షమాపణల లేటర్ ఇస్తానని దానికి తానేమి సిగ్గపడటం లేదన్నారు. కోతి నుంచి రూపాంతరం చెందిన ఆది మానవుడికి ఇంగీతం ఎక్కడ మొదలైంది.
ఉమెన్ కమిషన్ నోటీసు, శివాజీ స్పందన
శరీర భాగాలు కనపడటం కరెక్ట్ కాదని, ఏదోకటి కట్టుకోవాలని జ్ఞానం వచ్చింది. మరి నేను అన్నదాంట్లో తప్పేముందో తెలియడం లేదు. ఇష్టం ఉన్నట్టు తిడుతున్నారు. మంచి బట్టలు వేసుకోవాలని చెప్పడం తప్పా. ఆ రోజు ఆ అమ్మాయి అంత ఇబ్బంది పడుతుంటే తట్టుకోలేక అలా మాట్లాడాను. పోనీ ఆమెకు ఎవరన్న అండగ ఉన్నారా? ఆమె తరపున మాట్లాడారా? ఆ ఆడబిడ్డ కోసం నేను నిలబడి మాట్లాడాను ‘ అని అన్నారు . ఆ తర్వాత మన తెలుగు యాంకర్లు సుమ, జాన్సీలు ఎంత బాగా డ్రెస్ వేసుకుంటారని , వాళ్లపై ఎప్పుడైన ఇలాంటి సంఘటనలు జరిగాయా. అయినా నాకేవసరమని ఇలా మాట్లాడటం . ఆడబిడ్డల క్షమం కోరడం తన తప్పా అని ప్రశ్నించారు .
మొత్తంగా, శివాజీ తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పినప్పటికీ, మహిళల డ్రెస్సింగ్ పై తన అభిప్రాయాన్ని సమర్థించుకున్నారు. అనసూయకు ఆయన ఇచ్చిన పరోక్ష కౌంటర్ ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది.


