|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శివాజీ సంచలన ప్రకటన: కోకాపేటలో 18 ఎకరాలు వదులుకున్నానన్న హీరో!

Published: 03-03-2026, 8:35 AM
శివాజీ సంచలన ప్రకటన: కోకాపేటలో 18 ఎకరాలు వదులుకున్నానన్న హీరో!
  • హీరోగా ఒక వెలుగు వెలిగిన శివాజీ, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగు పెట్టారు.
  • కోకాపేటలో 18 ఎకరాల భూమిని కొనుగోలు చేసి అమ్మినట్లు శివాజీ వెల్లడించారు.
  • ఒక్క ఎకరా మిగిల్చుకొని ఉంటే రూ.1800 కోట్లు సంపాదించే వాడినని శివాజీ అన్నారు.
  • సెకండ్ ఇన్నింగ్స్‌లో వెబ్ సిరీస్‌లు, సినిమాలతో బిజీగా ఉన్నారు శివాజీ.

ప్రముఖ నటుడు శివాజీ ఒకప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన విషయం తెలిసిందే. కోకాపేటలో 18 ఎకరాల భూమిని కొనుగోలు చేసి అమ్మినట్లు ఆయన స్వయంగా వెల్లడించారు. ఆ వివరాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

రియల్ ఎస్టేట్ వ్యాపారంలో శివాజీ

Actor Sivaji: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటుడు శివాజీ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఒకానొక సమయంలో హీరోగా వరుస సినిమాలలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చిన శివాజీ ఇండస్ట్రీకి కొంత విరామం ప్రకటించారు. ఆ తర్వాత బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని అందుకున్నారు. ఇక ఈ కార్యక్రమం తర్వాత ఈయన వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. త్వరలోనే శివాజీ లయ జంటగా నటించిన సాంప్రదాయని సుప్పిని సుద్ధపూసని(SSS Film) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా మార్చి 6 వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శివాజీ(Sivaji) తన కెరీర్ కి సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. అయితే ఈయన ఒకానొక సమయంలో రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేశారని తెలియజేశారు .అయితే ఆ సమయంలో సినిమా అవకాశాలు లేకపోవడంతో తాను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశానని తెలిపారు. ఇలా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసినప్పటికీ తనకంటూ ఎలాంటి ఫ్లాట్లు మిగిలించుకోలేదని అప్పుడు డబ్బు అవసరం కావడంతో అమ్మేశానని తెలిపారు.

కోకాపేట భూముల గురించి శివాజీ వ్యాఖ్యలు

తాను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసిన సమయంలో ఫైనాన్షియల్ సిటీగా పేరుగాంచిన కోకాపేటలో తాను 18 ఎకరాలు కొనుగోలు చేసి అమ్మేశానని తెలిపారు. కనీసం ఒక్క ఎకరా మిగిల్చుకొని ఉంటే తాను ఈపాటికి బాగా సెటిల్ అయ్యే వాడినని అలా 1800 కోట్లు వదులుకున్నానని శివాజీ ఈ సందర్భంగా తన రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తాను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసిన కొద్దిగా మాత్రమే తన సొంతూరులో పొలం సంపాదించుకున్నాను తప్ప పెద్దగా ఆస్తులు ఏమి లేవని తెలిపారు.

డబ్బింగ్ ఆర్టిస్టుగా శివాజీ..

సెకండ్ ఇన్నింగ్స్‌లో శివాజీ బిజీ

ఇక ఈయన కెరియర్ మొదట్లో హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలలో నటించారు అదేవిధంగా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పలు సినిమాలకు ఈయన డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా శివాజీ వెబ్ సిరీస్ లతో పాటు సినిమాలలో కూడా నటిస్తున్నారు. 90s సిరీస్ శివాజీకి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చిందని చెప్పాలి. ఈ సినిమా తర్వాత మంగపతి పాత్రలో ఈయన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇటీవల దండోరా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ కొట్టిన శివాజీ సాంప్రదాయిని సుప్పిని సుద్ధ పూసిన అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చాలా రోజుల తర్వాత సూపర్ హిట్ జోడి వెండితెరపై సందడి చేయబోతున్న నేపథ్యంలో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

ఒకప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రాణించిన శివాజీ, ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. కోకాపేట భూముల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.