
టాలీవుడ్‌లో కొత్త అందాలు వస్తున్నా కొందరు హీరోయిన్లు త్వరగా మాయమవుతున్నారు. అలాంటి వారిలో కృతి శెట్టి ఒకరు. ‘ఉప్పెన’ విజయంతో కెరీర్ ప్రారంభించిన ఆమెకు వరుస ప్లాప్‌లు వచ్చాయి. అందం ఉన్నా, అదృష్టం లేక అవకాశాలు తగ్గిన ఈ భామ ప్రస్థానం ఆసక్తికరంగా మారింది.
Key Points
కృతి శెట్టి నటించిన 8 సినిమాల్లో కేవలం 3 మాత్రమే హిట్స్ అయ్యాయి.
'ఉప్పెన' చిత్రంతో బేబమ్మగా టాలీవుడ్‌లో పరిచయమై మంచి పేరు తెచ్చుకుంది.
వరుస పరాజయాలతో తెలుగులో ఆమె మార్కెట్ తగ్గుతూ అవకాశాలు సన్నగిల్లాయి.
ప్రస్తుతం కృతి శెట్టి మలయాళం, తమిళంలో పలు కొత్త ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది.
కృతి శెట్టి కెరీర్ గ్రాఫ్
టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త అందాలకు కొదవలేదు. ప్రతీ రెండు చిత్రాలకు ఓ అందం పరిచయమవుతోంది. అయితే ఆ హీరోయిన్ మాత్రం ఫేమస్ అవ్వట్లేదు గానీ.. ఒకట్రెండు చిత్రాలకే మాయమవుతోంది. స్క్రిప్ట్ సెలక్షనో లేక ఆఫర్స్ అందిపుచ్చుకోవాలనే తొందరో తెలియదు గానీ.. వరుసగా అట్టర్ ప్లాప్స్ అందుకుని ఇండస్ట్రీకి దూరమవుతున్నారు. ఆ కోవకు చెందినది ఈ భామ. ఆమె మరెవరో కాదు కృతి శెట్టి.
మెగా హీరో సరసన తెలుగులోకి పరిచయమైంది హీరోయిన్ కృతి శెట్టి. బుచ్చిబాబు సన దర్శకత్వం వహించిన ‘ఉప్పెన’ సినిమాలో బేబమ్మగా ప్రేక్షకులను తన నటనతో మెప్పించింది. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ కావడంతో కృతి శెట్టికి వరుసగా ఆఫర్స్ తలుపు తట్టాయి.
వరుస పరాజయాలు: మార్కెట్ డౌన్
శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్, కస్టడీ, మనమే వంటి చిత్రాల్లో నటించింది కృతి శెట్టి. అయితే ఈ చిత్రాల్లో ఒకట్రెండు మినహా మిగిలినవన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గ ఘోరంగా ఫెయిల్ అయ్యాయి. అంతకముందు హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన సూపర్ 30 చిత్రంలో ఓ చిన్న రోల్ చేసింది కృతి.
వరుసగా ఫ్లాప్స్ రావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో కృతి శెట్టి మార్కెట్ డల్ అయిపోయింది. ఆమె ఎంచుకున్న వీక్ స్క్రిప్ట్ సెలక్షన్.. తెలుగులో మరే ఆఫర్స్ రాకుండా చేశాయి. దీంతో గతేడాది మలయాళంలో డెబ్యూ ఇచ్చి ‘ఆర్మ్’ అనే చిత్రంలో నటించింది.
ఇతర భాషల్లో అవకాశాలు
ఇక ఇప్పుడు తమిళనాట కృతి శెట్టి వరుసగా మూడు సినిమాల్లో నటిస్తోంది. కార్తి సరసన ‘వా వాథియార్’, ప్రదీప్ రంగనాథన్ సరసన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’, రవి మోహన్ సరసన ‘జీని’ చిత్రాల్లో నటిస్తోంది. అటు ఇటీవల జీనీ నుంచి విడుదలైన ఓ పాట ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ పాటలో కృతి శెట్టి తన డ్యాన్స్ మూవ్స్‌తో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.
తెలుగులో వరుస పరాజయాలు ఎదుర్కొన్న కృతి శెట్టి ఇప్పుడు మలయాళం, తమిళంలో కొత్త సినిమాలతో దూసుకుపోతోంది. అందం, నటన ఉన్నా అదృష్టం కలసిరాని ఈ నటి, ఇతర భాషల్లోనైనా విజయాలు సాధించి తన స్థానాన్ని నిలబెట్టుకుంటుందో వేచి చూడాలి.


