
‘రావణాసుర’ చిత్ర నటి ఈడెన్ రోజ్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. పెళ్లికి అంగీకరించని ఆమె, క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్‌తో పిల్లలు కావాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ఆమె వ్యాఖ్యలు నెటిజన్లను విభజించాయి.
Key Points
ఈడెన్ రోజ్ 'రావణాసుర' చిత్రంలో ఐటెం సాంగ్‌తో ఆకట్టుకుంది.
శ్రేయాస్ అయ్యర్‌ను ప్రేమిస్తున్నానని, అతనితో పిల్లలు కావాలని చెప్పింది.
పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి లేదని, ఎగ్ ఫ్రీజ్ పద్ధతిని అనుసరిస్తున్నానని తెలిపింది.
ఈడెన్ రోజ్ కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
ఈడెన్ రోజ్ షాకింగ్ కామెంట్స్
‘రావణాసుర’(Ravanasura) మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన హీరోయిన్ ఈడెన్ రోజ్(Edin Rose) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. మాస్ మహరాజా రవితేజ(Raviteja) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఈ బ్యూటీ ఐటెం సాంగ్‌తో అలరించింది. తన అందంతో మెప్పించినప్పటికీ అంతగా అవకాశాలు రాలేదు. అయితే ఈ చిన్నది హీరోయిన్‌గా కంటే ఎక్కువ స్పెషల్ సాంగ్స్‌లోనే మెరిసింది. అయినప్పటికీ అంతగా ఫేమ్ కాలేకపోయింది. కానీ గత ఏడాది ‘బిగ్‌బాస్-18’లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ అడుగుపెట్టి అక్కడ ఫుల్ ఫేమస్ అయింది.
ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ భామ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘ఇండియా క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్‌ను పిచ్చిగా ప్రేమిస్తున్నాను. అతడిని మనసులో నా భర్తగా అంగీకరించాను. అంతేకాకుండా అతడితో ఇద్దరు పిల్లలను కూడా ఊహించుకున్నాను. అయితే నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. కానీ, పిల్లలను మాత్రం కనాలని ఉంది. అందుకే ఎగ్ ఫ్రీజ్ పద్దతి ఫాలో కావాలనుకుంటున్నాను’ అని బోల్డ్ కామెంట్స్ చేసింది. దీంతో ఈడెన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఇదేం చండాలం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
శ్రేయాస్ అయ్యర్ పై ప్రేమ వ్యక్తీకరణ
నెటిజన్ల విమర్శలు
ఈడెన్ రోజ్ చేసిన బోల్డ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారాయి. ఆమె నిర్ణయంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి?


