|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: రోడ్డు ప్రమాదంలో యువ నటి హఠాన్మరణం! విషాదంలో చిత్ర పరిశ్రమ!!

Published: 25-03-2026, 6:35 AM
షాకింగ్: రోడ్డు ప్రమాదంలో యువ నటి హఠాన్మరణం! విషాదంలో చిత్ర పరిశ్రమ!!
  • ప్రముఖ నటి హర్షిల్ కాలియా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
  • మార్చి 23న కారు ప్రమాదంలో కాలియా అక్కడికక్కడే మరణించారు.
  • హర్షిల్ ‘క్రైమ్ నెక్స్ట్ డోర్’ వెబ్ సిరీస్‌లో నటించారు.
  • కారు డివైడర్‌ను ఢీకొనడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి.

సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ నటి హర్షిల్ కాలియా రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ దుర్ఘటన మార్చి 23న జరగగా, ఆమె మృతితో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

హర్షిల్ కాలియా మృతి: ఎలా జరిగిందంటే?

Film industry: గత కొన్ని రోజులుగా చిత్ర పరిశ్రమలో సెలబ్రిటీల మరణాలు అభిమానులను మరింత దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ఒకవైపు వయసు రీత్యా సెలబ్రిటీలు తుదిశ్వాస విడిస్తే.. మరొకవైపు వృద్ధాప్య కారణాలవల్ల సెలబ్రిటీల కుటుంబ సభ్యులు మరణించడం అభిమానులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది . కొంతమంది ఆత్మహత్య చేసుకొని మరణిస్తుంటే.. మరికొంతమంది అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడుస్తున్నారు. ఇంకొంతమంది ఇలా రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోవడం నిజంగా బాధాకరం అనే చెప్పాలి. సినిమా ఇండస్ట్రీలో ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక యువ నటి రోడ్డు ప్రమాదంలో 30 ఏళ్లకే తుది శ్వాస విడవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ఆమె ఎవరు? ఈ రోడ్డు ప్రమాదం ఎప్పుడు? ఎక్కడ? ఎలా జరిగింది ?అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..

అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ నటిగా, మోడల్ గా మంచి పేరు దక్కించుకున్న హర్షిల్ కాలియా (Harshil Kalia).. సోమవారం రాత్రి (మార్చి 23) తన కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టి బోల్తాపడడంతో హర్షిల్ కాలియా అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో కారు ఎడమవైపుకి బోల్తా కొట్టినట్లు కనిపించింది. దీంతో 30 ఏళ్ల ఆ నటి తలకు తీవ్ర గాయాలయ్యాయి.అది గమనించిన స్థానికులు ఆమెను సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించగా.. గాయాలతో ఆమె తుది శ్వాస విడిచినట్లు వైద్యులు నిర్ధారించారు.

కాలియా సినీ ప్రస్థానం గురించి…

హర్షిల్ కాలియా ‘క్రైమ్ నెక్స్ట్ డోర్’ అనే వెబ్ సిరీస్ లో, పలు రాజస్థానీ మ్యూజిక్ వీడియోలలో నటించింది. ఈమె రాత్రి ఆలస్యంగా పని ముగించుకొని తిరిగి వస్తుండగా ఆమె కారు అకస్మాత్తుగా అదుపు తప్పింది. ఆ తర్వాత అది డివైడర్ను ఢీకొని బోల్తా కొట్టడంతో ఆమె తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఇక హాస్పిటల్ కి చేర్చినా ఫలితం లేకుండా పోయింది. అయితే ఆమె కారు సడన్గా అదుపు తప్పడానికి గల కారణం ఏమిటి? అనే విషయం మాత్రం తెలియరాలేదు. తలకు తీవ్రంగా గాయాలవడం వల్లే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఏది ఏమైనా బంగారు భవిష్యత్తు ఉన్న ఒక యువ నటి ఇలా రోడ్డు ప్రమాదంలో మరణించడాన్ని ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ప్రమాదానికి గల కారణాలు ఏమిటి?

హర్షిల్ కాలియా కెరియర్ విషయానికొస్తే.. వెబ్ సిరీస్ లు, రాజస్థానీ మ్యూజిక్ వీడియోలతో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. అటు మోడలింగ్ లో కూడా తన కెరీర్ను ప్రారంభించింది. ఇక ఇంస్టాగ్రామ్ లో గణనీయమైన ఫాలోవర్స్ ను సంపాదించుకొని పేరు ప్రఖ్యాతలు పొందింది. ఇక అలాంటి ఈమె ఆకస్మిక మరణం ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ప్రస్తుతం కేసు దర్యాప్తు చేసుకున్న పోలీసులు తదుపరి విచారణను వేగవంతం చేశారు

హర్షిల్ కాలియా మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.