|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హేమ సంచలన వ్యాఖ్యలు! చిరంజీవి అండగా నిలిచారు, దాసరి లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది!

Published: 30-03-2026, 3:05 PM
హేమ సంచలన వ్యాఖ్యలు! చిరంజీవి అండగా నిలిచారు, దాసరి లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది!
  • హేమకు చిరంజీవి సహాయం చేశారని, తన మనుషులను పంపి అండగా నిలిచారని హేమ తెలిపారు.
  • సినీ పరిశ్రమ తనకు 101 శాతం మద్దతు ఇచ్చిందని, ఎవరూ లేరనడం అవాస్తవం అని హేమ స్పష్టం చేశారు.
  • ఆంధ్రప్రదేశ్‌లో సినిమాలు తీస్తే రాయితీలు ఇవ్వాలని, పరిశ్రమను ప్రోత్సహించాలని హేమ కోరారు.
  • రెండు తెలుగు రాష్ట్రాల్లో కళాకారులను గౌరవించాలని చిరంజీవి చేసిన వ్యాఖ్యలను హేమ సమర్థించారు.

నటి హేమ ఇటీవల తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. ఈ సందర్భంగా చిరంజీవి తనకెలా సహాయం చేశారో వివరించారు. అంతేకాకుండా దాసరి నారాయణరావు లేని లోటును ఆమె గుర్తు చేసుకున్నారు. సినీ పరిశ్రమ తనకు అండగా నిలిచిందని ఆమె అన్నారు.

హేమకు అండగా నిలిచిన చిరంజీవి

Actress Hema: నాపై రేవ్ పార్టీ అంటూ, డ్రగ్స్ అంటూ వార్తలు వచ్చినప్పుడు ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్లు వార్తలు పుట్టించేశారు. నాకు అందులో క్లీన్ చిట్ వచ్చిన తర్వాత మాత్రం మీడియా సైడ్ నుంచి నాకు రావాల్సిన విధంగా సపోర్ట్ రాలేదంటే హేమ (Actress Hema) ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆమె, తన మనసులోని భావాలన్నింటినీ చెప్పేశారు. మరీ ముఖ్యంగా చిరంజీవి (Mega Star Chiranjeevi) గురించి, దాసరి నారాయణరావు (Dasri Narayana Rao) గురించి మాట్లాడుతూ.. మరోసారి ఇండస్ట్రీ పెద్ద విషయం హైలెట్ అయ్యేలా చేసింది. ఇంత జరుగుతున్నప్పుడు ఇండస్ట్రీ నుంచి మీకు సపోర్ట్ ఎవరూ రాలేదా? అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ..

సినీ పరిశ్రమ మద్దతుపై హేమ స్పష్టీకరణ

‘‘ఎందుకు రాలేదు? మెగాస్టార్ చిరంజీవి తన మనుషుల్ని పంపించారు.. తనకేం కావాలో హెల్ప్ చేయండి అన్నారు. తర్వాత మా హీరోలు, ఇంకో ఇద్దరు ముగ్గురు హీరోలు, డైరెక్టర్లు అందరూ సపోర్ట్ చేశారు. నా ఇండస్ట్రీ నాకు సపోర్ట్ లేదు అని అనకండి.. విష్ణు బాబు కూడా సపోర్ట్ చేశారు సార్, ట్వీట్ కూడా చేశారు. తర్వాత మా అసోసియేషన్‌లో ఉంటారు కదా ఇంకా మిగతా వాళ్ళు.. మనకు నచ్చినోడు ఉండొచ్చు, నచ్చనోడు ఉండొచ్చు కదా. సో అది ఏదో జరిగిన మిస్టేక్, కానీ ఇమీడియట్‌గా సర్దుకున్నారు. ఇండస్ట్రీ సపోర్ట్ నాకు 101 శాతం వచ్చింది. రాలేదనకండి. చిరంజీవి నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇప్పుడు నెక్స్ట్ మూవీలో ఇస్తానని ప్రామిస్ కూడా చేశారు. ఆయన పర్సనల్‌గా రాకపోయి ఉండొచ్చు నా దగ్గరికి, ఆయన మనుషులతో ఫోన్ చేయించి, అన్ని కనుక్కుంటూనే ఉన్నారు’’ అని చెప్పిన హేమ.. మెగాస్టార్ రీసెంట్‌గా చేసిన వ్యాఖ్యల విషయం గురించి మాట్లాడుతూ.. దాసరి ప్రస్తావన తెచ్చారు.

రెండు రాష్ట్రాల్లో కళాకారుల ప్రోత్సాహంపై హేమ అభిప్రాయం

‘‘ఆంధ్రాలో అవార్డ్స్ ఇచ్చి చాలా రోజులు అయిపోయిందండి. ఆంధ్రాలో సినిమాలు తీస్తే మేము సబ్సిడీ ఇస్తామనో, లేకపోతే ఇంకొకటనో ఇండస్ట్రీని పిలిస్తే ఆంధ్రాలో ఎందుకు చేయరండి? మేమందరం అక్కడికి వెళ్ళడానికి కూడా రెడీగానే ఉన్నామండి. అది మాదే.. ఇది మాదే.. రెండు రాష్ట్రాలు మావేనండి. చిరంజీవి అన్న ఒక మంచి మాట ఏంటంటే.. ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయండి, ఇప్పుడు రెండు స్టేట్స్ అయిపోయినాయి కదా, ఆ స్టేట్‌లో కూడా మమ్మల్ని గౌరవిస్తే బాగుంటుంది అని ఒక మంచి ఉద్దేశంతో ఆయన చెప్పారు. దాన్ని కూడా చిలువలు పలువలు చేసేసి, ఇష్టం వచ్చినట్టు థంబ్‌నైల్స్ పెట్టేసి మాట్లాడుతున్నారు. ఇలాంటి సమయంలోనే దాసరి వంటి వారు ఉంటే బాగుండేది అనిపిస్తుంది’’ అని హేమ అనడంతో.. మరోసారి అందరినీ కన్ఫ్యూజ్ చేశారు. ఇండస్ట్రీ నుంచి పెద్దగా చిరంజీవి సపోర్ట్ చేశారని చెబుతూనే, మళ్లీ దాసరి ఉంటే బాగుండేది, పెద్దరికంగా ఉండేది అనడంతో.. అసలు హేమ ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? అని నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటం విశేషం.

చిరంజీవి చేసిన సూచనను హేమ సమర్ధించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి, కళాకారుల ప్రోత్సాహానికి ప్రభుత్వాలు కృషి చేయాలని ఆమె ఆకాంక్షించారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.