
📌 Key Points
- నటి ప్రగతి వెయిట్ లిఫ్టింగ్ లో పథకాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచారు.
- సినిమా అవకాశాలు తగ్గడంతోనే వెయిట్ లిఫ్టింగ్ పై దృష్టి పెట్టినట్లు ప్రగతి తెలిపారు.
- వేణు స్వామి పూజలు చేసినప్పటికీ తన కష్టంతోనే సక్సెస్ వచ్చిందని ప్రగతి స్పష్టం చేశారు.
- తన సక్సెస్ వెనుక ఎవరి ప్రోత్సాహం లేదని, కేవలం తన శ్రమ మాత్రమే ఉందని ఆమె అన్నారు.
టాలీవుడ్ నటి ప్రగతి వేణు స్వామి చేసిన పూజల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పూజల వల్ల తనకు సక్సెస్ రాలేదని, తన కష్టంతోనే తాను ఈ స్థాయికి వచ్చానని ఆమె స్పష్టం చేశారు. అంతేకాకుండా వెయిట్ లిఫ్టింగ్ లో తాను సాధించిన విజయాల గురించి కూడా తెలిపారు.
ప్రగతి వెయిట్ లిఫ్టింగ్ ప్రస్థానం
Actress Pragathi: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటి ప్రగతి (Pragathi)ఒకరు. ఒకానొక సమయంలో ఏదైనా ఒక స్టార్ హీరో సినిమా వస్తుంది అంటే అందులో కచ్చితంగా ప్రగతి కీలక పాత్రలో నటించేవారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ప్రగతి సినిమాలను పూర్తిగా పక్కన పెట్టి వర్కౌట్స్ పై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే వెయిట్ లిఫ్టింగ్ లో ఈమె ఎన్నో పథకాలను సాధించి భారతదేశానికి గర్వకారణంగా నిలిచారు. ఇక ప్రస్తుతం ఈమెకు సినిమాలలో పలు అవకాశాలు వస్తున్నాయని తెలుస్తోంది.
ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రగతి తన కెరీయర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. అసలు వెయిట్ లిఫ్టింగ్ ఆలోచన ఎలా వచ్చిందనే విషయంపై ప్రశ్న ఎదురు కావడంతో ఈమె మాట్లాడుతూ తాను ఒకానొక సమయంలో తను చేస్తున్న సినిమాలపై పూర్తిగా నమ్మకం కోల్పోయాను. నాకు ప్రాధాన్యత లేని పాత్రలు రావడంతో ఎందుకు ఇలా జరుగుతుంది. నేను చిన్న చిన్న పాత్రలకు కూడా ఓకే చేయటం వల్లే సినిమా అవకాశాలు రాలేదని గ్రహించాను. అందుకే కాస్త గ్యాప్ ఇచ్చానని ప్రగతి తెలిపారు. ఆ సమయంలో ఖాళీగా ఉంటే డిప్రెషన్ లోకి వెళ్లిపోతానని తెలుసు అందుకే ఈ దారిని ఎంచుకున్నానని, వర్కౌట్ చేయడం గురించి వెయిట్ లిఫ్టింగ్ గురించి ఈమె క్లారిటీ ఇచ్చారు.
వేణు స్వామి పూజలపై ప్రగతి వ్యాఖ్యలు
ఇకపోతే వేణు స్వామి చేసిన పూజల కారణంగానే మీకు సక్సెస్ వచ్చింది నిజమేనా? అనే ప్రశ్న కూడా ఎదురయింది. ఈ నేపథ్యంలోనే వేణు స్వామి గురించి ప్రగతి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఒకానొక సమయంలో తాను చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నానని ఆ సమయంలో కనిపించిన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి పూజలు చేయించానని ఈమె తెలిపారు. అందులో భాగంగానే చాలామంది వేణు స్వామిని కలవమని సలహా ఇస్తే ఆయనని కలిసి పూజ చేయించుకున్నానని ప్రగతి తెలిపారు. వేణు స్వామి గారు చాలా అద్భుతంగా పూజ చేశారని తెలిపారు.
నా కష్టాన్ని వేరే వాళ్ల గుర్తింపు కాదు..
సక్సెస్ వెనుక నా కష్టం మాత్రమే: ప్రగతి
ఇక ఆయన పూజ చేయటం వల్లే నాకు సక్సెస్ వచ్చింది అంటే నేను ఒప్పుకోనని ప్రగతి తెలిపారు. నేను ఏదైనా ఒక సక్సెస్ అందుకున్నాను అంటే అందులో పూర్తిగా నా కష్టం మాత్రమే ఉంది. ఆ కష్టం కారణంగానే సక్సెస్ అందుకున్నాను. నా కష్టాన్ని వేరే వాళ్లకు గుర్తింపుగా ఇవ్వలేనని ప్రగతి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలా బ్యాడ్ స్టేజ్ లో ఉన్నప్పుడే నమ్మకంతోనే తాను వేణు స్వామి వద్దకు వెళ్లాను. ఇలాంటివి మీరు నమ్ముతారా ?అనే ప్రశ్న కూడా ప్రగతికి ఎదురవడంతో ఈమె సమాధానం చెబుతూ మనం ఉన్న ఆ పరిస్థితులు నమ్మేలాగా చేస్తాయని ఆ నమ్మకంతోనే తాను చాలామందిని కలిసి ఎన్నో పూజలు చేసాను, దిష్టి కూడా తీయించుకున్నాను, హోమాలు కూడా చేశానని అప్పుడు పరిస్థితులను బట్టి నమ్మాల్సి వచ్చేదని ఈమె తెలియజేశారు.
ప్రగతి తన జీవితంలో ఎదురైన కష్టాలను, వాటిని అధిగమించిన విధానాన్ని వివరించారు. తన సక్సెస్ లో ఎవరి ప్రమేయం లేదని, కేవలం తన శ్రమ మాత్రమే ఉందని ఆమె గట్టిగా చెప్పారు.


