|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పెళ్ళైన 6 నెలలకే ఎలా బిడ్డని కన్నావు ? తీవ్ర విమర్శలకు నటి సమాధానం.. వివాదంలోకి స్టార్ హీరోయిన్ ని లాగింది

Published: 27-08-2025, 2:50 PM
పెళ్ళైన 6 నెలలకే ఎలా బిడ్డని కన్నావు ? తీవ్ర విమర్శలకు నటి సమాధానం.. వివాదంలోకి స్టార్ హీరోయిన్ ని లాగింది

బాలీవుడ్ నటి నేహా ధూపియా పెళ్ళైన ఆరు నెలలకే తల్లి అయినందుకు తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ విమర్శలకు ఆమె ఎలా స్పందించిందో తెలుసుకుందాం.

Key Points

1

నేహా ధూపియా పెళ్లికి ముందు గర్భవతి అయింది.

2

పెళ్ళైన ఆరు నెలలకే ఆమె బిడ్డకు జన్మనిచ్చింది.

4

అలియా భట్, నీనా గుప్తా లాంటి నటీమణులు కూడా ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్నారు.

నేహా ధూపియాపై విమర్శల వర్షం

బాలీవుడ్ లో పెళ్ళికి ముందే గర్భం దాల్చిన నటీమణులు కొందరు ఉన్నారు. బాలీవుడ్ నటి నేహా ధూపియా కూడా గర్భవతి అయ్యాక వివాహం చేసుకున్నారు. పెళ్ళికి ముందు తన బాయ్ ఫ్రెండ్ అంగద్ బేడీతో నేహా ధూపియా రిలేషన్ లో ఉండేది. ఆ సమయంలోనే ఆమె గర్భవతి అయింది. దీనితో ఈ జంట వివాహం చేసుకున్నారు. పెళ్ళైన 6 నెలలకి నేహా ధూపియా బిడ్డకి జన్మనిచ్చింది.

దీనితో తరచుగా నేహా ధూపియా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతూనే ఉన్నారు. ఆమె పెళ్లి జరిగి చాలా ఏళ్ళు గడుస్తున్నప్పటికీ పెళ్ళికి ముందే గర్భవతి అయిన విషయాన్ని బయటకి తీసి విమర్శిస్తుంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నేహా ధూపియా తనపై వస్తున్న విమర్శల గురించి స్పందించింది.

పెళ్లికి ముందు గర్భం: నేహా వివరణ

ఈమె పెళ్ళైన ఆరు నెలలకే ఎలా బిడ్డకి జన్మనిచ్చింది అని చాలా మంది విమర్శిస్తుంటారు. నిజమే నేను పెళ్ళికి ముందే గర్భవతిని అయ్యాను. అదేమీ చెడ్డ విషయం అని నేను అనుకోవడం లేదు. నాలాగే అలియా భట్, నీనా గుప్తా లాంటి నటీమణులు కూడా పెళ్ళికి ముందు గర్భవతులు అయ్యారు. కానీ నెటిజన్లు ఎక్కువగా నన్నే ట్రోల్ చేస్తున్నారు.

అంగద్ తో డేటింగ్ ప్రారంభించిన కొంత కాలానికే నేను గర్భవతిని అయ్యాను. పెళ్లి కాకుండా, డేటింగ్ చేసిన కొద్ది రోజులకే గర్భవతిని కావడం అనేది ఇతరులకు వింతగా ఉంటుంది. క్లోజ్ ఫ్రెండ్స్ కి తప్ప ఇంకెవరికీ చెప్పుకోలేము. సాంప్రదాయ కుటుంబం అయినప్పటికీ, సంప్రదాయేతర కుటుంబం అయినప్పటికీ ఈ విషయాన్ని బయటకి చెప్పలేం. ఆ సిచ్యుయేషన్ తనకు చాలా కష్టంగా అనిపించింది అని నేహా ధూపియా అన్నారు.

ఇతర నటీమణులతో పోలిక

పెళ్ళికి తన క్లోజ్ ఫ్రెండ్స్ ని కూడా ఇన్వైట్ చేయలేదు అని నేహా పేర్కొంది. తనకంటే మూడేళ్లు చిన్నవాడైన అంగద్ ని ప్రేమించి వివాహం చేసుకుంది. ప్రస్తుతం నేహా ధూపియాకి 45 ఏళ్ళు.

నేహా ధూపియా తన అనుభవాన్ని పంచుకోవడం ద్వారా, ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్న ఇతర మహిళలకు మద్దతు ఇచ్చింది. ఈ విషయంపై సమాజంలో చర్చ జరగడం అవసరం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.