
📌 Key Points
- నటి మాల్టీ చాహర్ తన కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని ధైర్యంగా వెల్లడించింది.
- ఓ దక్షిణాది నిర్మాత హోటల్ రూమ్‌కి రమ్మని బలవంతం చేసి ముద్దుపెట్టాలని ప్రయత్నించాడు.
- ఆమె ప్రతిఘటించి, అతన్ని నిలదీసి అన్ని సంబంధాలను తెంచుకున్నట్లు తెలిపింది.
- అవకాశాల కోసం మహిళలు రాజీపడకూడదని, ఆత్మనియంత్రణ కలిగి ఉండాలని ఆమె సందేశం.
సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనుభవాలు చర్చనీయాంశంగా మారాయి. తాజాగా బాలీవుడ్ నటి మాల్టీ చాహర్ తన చేదు అనుభవాన్ని వెల్లడించింది. ఓ నిర్మాత తనను హోటల్ రూమ్‌కి రమ్మని బలవంతం చేసిన షాకింగ్ విషయాలను బయటపెట్టి, అందరినీ ఆశ్చర్యపరిచింది.
నటి మాల్టీ చాహర్ సంచలన కాస్టింగ్ కౌచ్ నిజాలు
గత కొద్ది కాలంగా సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పదం మార్మోగిపోతుంది. సినీ తారలు తమకు ఎదురైన అనుభవాలను ధైర్యంగా చెబుతూ వార్తల్లో నిలుస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. గతంలో చాలామంది హీరోయిన్లు తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్న విషయం తెలిసిందే. తాజాగా, మరో నటి తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని వివరించింది. బాలీవుడ్ బ్యూటీ మాల్టీ చాహర్ (Malti Chahar)ఇటీవల సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ సీజన్-19లో కనిపించిన ఆమె ఓ పాడ్‌కాస్ట్‌కు హాజరై.. షాకింగ్ విషయాలు చెప్పింది. ‘‘ఒక ఆఫీస్ మీటింగ్‌లో వీడ్కోలు సమయంలో నాకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఓ దక్షిణాది నిర్మాతతో సమావేశమైనప్పుడు అతను హోటల్ గది నంబర్ నాకు ఇచ్చాడు. నేను సాధారణంగా పిలిచాడని వెళితే.. నన్ను ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నించాడు. అది నాకు చాలా అసౌకర్యంగా అనిపించింది.
వెంటనే అతన్ని నేను అడ్డుకున్నాను. కానీ అతను నన్ను బలవంతం చేశాడు. అయినా అక్కడి నుంచి తప్పించుకున్నాను. ఆ తర్వాత అతనితో అన్ని సంబంధాలను తెంచుకున్నా. అక్కడే అతన్ని నిలదీశా. నువ్వు నా తండ్రిలా అనుకున్నానని చెప్పా ఆ సంఘటన నాకు ఒక గుణపాఠం నేర్పింది. ఎవరినీ కూడా ఉన్నత స్థానంలో ఉంచొద్దని నిర్ణయానికి వచ్చాను. మహిళలు అవకాశాలు కోసం ఇలాంటి వాటికి అంగీకరించవద్దు. మీపై మీకు నియంత్రణ ఉండాలి’’ అని చెప్పింది. కాగా.. మాల్లీ చాహర్ సినిమాల విషయానికొస్తే.. 2018లో అనిల్ శర్మ దర్శకత్వంలో వచ్చి ‘జీనియస్’ (Genius)మూవీలో రూబీనా పాత్రలో కనిపించింది. అలాగే ‘ఇష్క్ పాష్మినా’ చిత్రంలో కూడా నటించిన ఆమె సోషల్ మీడియాలోనూ తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ప్రస్తుతం పెద్దగా సినిమా అవకాశాల ఎక్కువగా రాకపోవడంతో.. అనేక బ్రాండ్లకు ప్రచారకర్తగా పనిచేస్తోంది.
ఆ నిర్మాతతో ఎదురైన చేదు అనుభవం ఏమిటి?
మాల్టీ చాహర్ కెరీర్, ఆమె సందేశం
నటి మాల్టీ చాహర్ అనుభవం సినీ పరిశ్రమలో మహిళలకు గుణపాఠం నేర్పింది. అవకాశాల కోసం రాజీ పడకుండా, ఆత్మనియంత్రణతో ఉండాలని ఆమె ఇచ్చిన సందేశం అందరికీ స్ఫూర్తినిస్తోంది.


