|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మహేశ్‌తో సందీప్‌ సినిమా?

Published: 31-10-2025, 3:23 PM
మహేశ్‌తో సందీప్‌ సినిమా?

మహేష్ బాబు రాజమౌళి ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29’ తర్వాత ఎవరితో సినిమా చేస్తారనే ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పేరు మరోసారి ప్రముఖంగా వినిపిస్తోంది. వీరి కాంబినేషన్‌లో సినిమా రాబోతుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది.

Key Points

1

మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29' సినిమా చేస్తున్నారు.

2

'ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29' తర్వాత మహేష్ తదుపరి సినిమాపై చర్చ జరుగుతోంది.

4

ప్రస్తుత ప్రాజెక్టులు పూర్తయ్యాక మహేష్-సందీప్ రెడ్డి సినిమాపై స్పష్టత రానుంది.

ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29 తర్వాత మహేష్ బాబు నెక్స్ట్ ప్రాజెక్ట్?

మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం 2027లో విడుదల కావొచ్చనే టాక్‌ వినిపిస్తోంది. ఈ చిత్రం తర్వాత మహేశ్‌బాబు ఏ దర్శకుడితో సినిమా చేయనున్నారనే చర్చ కొంత కాలంగా తెలుగు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పటికే కొంతమంది దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా ‘అర్జున్‌ రెడ్డి, యానిమల్‌’ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా పేరు మరోసారి తెరపైకి వచ్చింది.

‘అర్జున్‌ రెడ్డి’ తర్వాత మహేశ్‌బాబుతో ఓ సినిమా చేయాలని సందీప్‌ రెడ్డి ప్రయత్నాలు చేశారనే వార్త అప్పట్లో ప్రచారమైంది. ఇప్పుడు ఆ సమయం వచ్చిందని, మహేశ్‌బాబు–సందీప్‌ రెడ్డిల కాంబినేషన్‌లో ఓ సినిమా రూపోందేందుకు సన్నా హాలు మొదలయ్యాయని భోగట్టా. ఇక ప్రస్తుతం ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29’తో మహేశ్‌బాబు బిజీగా ఉన్నారు. మరోవైపు ప్రభాస్‌తో ‘స్పిరిట్‌’ సినిమా చేయనున్నారు సందీప్‌ రెడ్డి. ఇలా మహేశ్, సందీప్‌ తమ ప్రస్తుత ్రపాజెక్ట్‌లను పూర్తి చేసిన తర్వాత వీరి కాంబినేషన్‌లోని సినిమా పై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

సందీప్ రెడ్డి వంగాతో మహేష్ కాంబినేషన్ చర్చలు

ప్రస్తుత ప్రాజెక్టులు: మహేష్, సందీప్ షెడ్యూల్స్

మహేష్, సందీప్ తమ ప్రస్తుత చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతే వీరి కలయికలో సినిమాపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అభిమానుల ఎదురుచూపులు కొనసాగుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.