|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటి షెఫాలీ జరీవాలా మృతి.. కారణమిదే..!!

Published: 28-06-2025, 2:12 PM
ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటి షెఫాలీ జరీవాలా మృతి.. కారణమిదే..!!

యువ నటి షెఫాలీ జరీవాలా గుండెపోటుతో మృతి చెందడం సినీ ప్రియులను కలచివేసింది. ఫిట్‌నెస్‌పై ఆమెకున్న అభిరుచిని బట్టి ఈ మరణం అందరినీ ఆశ్చర్యపరిచింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Key Points

1

ప్రముఖ నటి షెఫాలీ జరీవాలా గుండెపోటుతో మృతి.

2

యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ గుండెపోటుకు కారణమో అనుమానం.

4

పోలీసులు కేసును అనుమానాస్పదంగా దర్యాప్తు చేస్తున్నారు.

షెఫాలీ జరీవాలా అకాల మృతి

కాంటా లాగా గర్ల్ షెఫాలీ జరీవాలా మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. ఫిట్‌నెస్ ఫ్రీక్ అయిన ఆమె గుండెపోటుతో చనిపోవడం ఏంటనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రికి చేరేలోగానే మరణించిన ఆమె అంత్యక్రియలకు భారీగా తరలివచ్చారు. అయితే వ్యాయామం, యోగా, పర్ఫెక్ట్ డైట్ మెయింటెన్ చేసే షెఫాలీ మరణానికి అసలు కారణం ఇదేనని అనుమానిస్తున్నారు వైద్యులు. ఆరేళ్లుగా యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆమె.. ప్రతి రోజు ఇందుకు సంబంధించిన మెడిసిన్ తీసుకుంటుందని.. ఈ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్‌తోనే గుండెపోటు వచ్చి ఉంటుందని తెలిపారు. ఈ చికిత్సలో వినియోగించే గ్లూటాథియోన్ గుండె సమస్యలకు దోహదపడవచ్చని ఒక న్యూరాలజిస్ట్ సూచించారు. ఇక15 ఏళ్ల వయసు నుంచి జెరీవాలాకు మూర్ఛవ్యాధి (ఎపిలెప్సీ) ఉంది. ఇది కొన్ని సందర్భాల్లో ఆకస్మిక మరణానికి కారణం కావచ్చని చెప్తున్నారు వైద్యులు.

ఆమె మరణానికి ఖచ్చితమైన కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు, ఫోరెన్సిక్ నివేదిక మరియు పోస్ట్‌మార్టం పరీక్ష ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాలి. పోలీసులు ఈ కేసును అనుమానాస్పదంగా భావిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆమె భర్త పరాగ్ త్యాగి, ఇంటి సిబ్బంది నుంచి వాంగ్మూలాలు నమోదు చేశారు. కా గా బిగ్ బాస్ 13తో మరింత పాపులారిటీ దక్కించుకున్న షెఫాలీ.. మోడల్‌గా, నటిగా సత్తా చాటింది. రీసెంట్‌గా 75 ఏళ్ల వయసున్న తన తండ్రికి హార్ట్ సర్జరీ చేయించిన ఆమె.. ‘నాన్న నీ ఏజ్ జస్ట్ 75.. నువ్వు నీ లైఫ్‌ను ఫుల్ టు ఎంజాయ్ చేయాలి’ అని చెప్పిందట. ఇలాంటి అమ్మాయి 40ఏళ్లలోనే చనిపోవడాన్ని ఇండస్ట్రీ, ఫ్రెండ్స్, ఫ్యామిలీ తట్టుకోలేకపోతుంది.

గుండెపోటుకు కారణాలపై అనుమానాలు

పోలీసుల దర్యాప్తు

షెఫాలీ జరీవాలా అకాల మృతితో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. పోస్ట్‌మార్టం నివేదికతో మరణానికి నిజ కారణం తేలనుంది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.