|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ఎప్పటికీ నిన్ను వీడను.. త్రిష సంచలన ప్రకటన! అసలేం జరిగింది?

Published: 17-02-2026, 1:35 AM
షాకింగ్: ఎప్పటికీ నిన్ను వీడను.. త్రిష సంచలన ప్రకటన! అసలేం జరిగింది?
  • త్రిష గతంలో చిరంజీవి, ప్రభాస్ వంటి స్టార్ హీరోల సరసన నటించారు.
  • విజయ్ దళపతితో త్రిష ప్రేమలో ఉన్నట్లు వస్తున్న వార్తలపై బిజెపి ఎంపీ వ్యాఖ్యలు చేశారు.
  • తాజాగా త్రిష తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది.
  • త్రిష పోస్ట్ వైరల్ కావడంతో, దానిని వెంటనే డిలీట్ చేసింది.

ప్రముఖ నటి త్రిష ఒక ఆసక్తికరమైన పోస్ట్ ద్వారా వార్తల్లో నిలిచారు. విజయ్ దళపతితో ఆమె ప్రేమ వ్యవహారం గురించి వస్తున్న పుకార్ల నడుమ, ఆమె చేసిన ఒక పోస్ట్ వైరల్ అయింది. ఆ పోస్ట్ లో ఆమె ఎవరినో వదిలిపెట్టనని పేర్కొంది.

త్రిష సినీ కెరీర్ విశేషాలు

Actress Trisha:ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi ), ప్రభాస్(Prabhas ) లాంటి స్టార్ హీరోల సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది చెన్నై ముద్దుగుమ్మ త్రిష(Trisha ). టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా గత రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీని ఏలిన ఈమె.. దక్షిణాది వెండితెర ఎవర్ గ్రీన్ గా పేరు దక్కించుకుంది. ముఖ్యంగా 20 సంవత్సరాల సినీ కెరియర్లో కూడా యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తూ వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.. అటు కోలీవుడ్లో విజయ్ సరసన పలు చిత్రాలు చేయడమే కాకుండా.. ఆయన సినిమాలలో తొలిసారి స్పెషల్ సాంగ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

అలాంటి త్రిష సినిమాల విషయం కాస్త పక్కన పెడితే.. వ్యక్తిగతంగా వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి (Vijay thalapathy) తో ఈమె ప్రేమలో ఉంది అంటూ ప్రచారం జరుగుతున్న సమయంలో తమిళనాడు రాష్ట్ర బిజెపి ఎంపీ నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత పెంచేసాయి . టీవీకే పార్టీని స్థాపించిన విజయ్ రాజకీయ భవిష్యత్తు గురించి మాట్లాడుతూ..” విజయ్ ముందుగా త్రిష ఇంటి నుండి బయటకు రావాలి” అంటూ వ్యక్తిగత విమర్శలు చేయడం సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి.దీంతో త్రిష తరఫు న్యాయవాది ఒక నోట్ కూడా విడుదల చేస్తూ.. “బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఒక మహిళ వ్యక్తిగత జీవితం పై అసభ్యంగా మాట్లాడడం సరికాదు” అంటూ పేర్కొన్నారు. ఇక దీంతో దిగివచ్చిన నాగేంద్రన్ క్షమాపణలు కూడా చెప్పిన విషయం తెలిసిందే.

విజయ్, త్రిషల మధ్య వివాదం

ఇకపోతే అటు త్రిష స్పందించడం.. ఇటు బిజెపి మంత్రి క్షమాపణలు చెప్పడంతో ఈ వివాదానికి కాస్త బ్రేక్ పడింది. అయితే ఇంతలోనే మళ్లీ త్రిష తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా పెట్టిన ఒక నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా మళ్లీ కొత్త అనుమానాలకు తెరలేపిందని చెప్పవచ్చు. తాజాగా త్రిష తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో.. “ఏం జరిగినా.. మనం ఎంత వ్యతిరేకత ఎదుర్కొన్నా.. ఆఖరికి ప్రపంచం మొత్తం నీకు వ్యతిరేకంగా నిలిచినా.. నేను మాత్రం నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టను” అంటూ ఆమె రాసుకొచ్చింది. ఈ పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే ఇది వైరల్ అవ్వడంతో వెంటనే త్రిష దానిని డిలీట్ చేసింది. అయితే ఆమె డిలీట్ చేసినా అప్పటికే స్క్రీన్ షాట్స్ తీసిన నెటిజన్స్ దీనిని విజయ్ ను ఉద్దేశించి చేసిందంటూ కామెంట్లు చేస్తున్నారు.

త్రిష విషయానికి వస్తే.. తన అద్భుతమైన నటనతో విలక్షణ నటిగా ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె వర్షం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకున్న త్రిష.. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ ఇప్పటికీ స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం ఈమె వయసు 42 సంవత్సరాలు.. ఇప్పటికీ వివాహం చేసుకోకుండా బ్యాచిలర్ గానే కొనసాగుతున్న త్రిష.. అటు విజయ్ తో రిలేషన్ లో ఉందనే వార్తలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి.

వైరల్ అవుతున్న త్రిష పోస్ట్

ఏది ఏమైనా త్రిష పెట్టిన ఈ ఒక్క పోస్ట్ సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలకు తావిస్తోంది. దీనిపై ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి. త్రిష త్వరలో విశ్వంభర సినిమాలో కనిపించనుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.