|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

20 ఏళ్లుగా స్టార్ డమ్ కోసం ఎదురుచూసి.. తెలుగులో కనిపించకుండా పోయిన హీరోయిన్ ఎవరో తెలుసా?

Published: 11-12-2025, 4:37 AM
20 ఏళ్లుగా స్టార్ డమ్ కోసం ఎదురుచూసి.. తెలుగులో కనిపించకుండా పోయిన హీరోయిన్ ఎవరో తెలుసా?
  • టాలీవుడ్‌లో 20 ఏళ్లుగా కొనసాగుతున్న రెజీనా కసాండ్రా స్టార్‌డమ్‌ను సాధించలేకపోయింది.
  • పెద్ద హీరోలతో నటించే అవకాశాలు రాకపోవడంతో ఆమె కెరీర్ కు ఆటంకం ఏర్పడింది.
  • ప్రస్తుతం కంటెంట్ ఆధారిత, లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో ఎక్కువగా నటిస్తోంది.
  • నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు, విలన్ రోల్స్ కూడా చేయడానికి సిద్ధపడింది.

ఫిల్మ్ ఇండస్ట్రీలో టాలెంట్ తో పాటు అదృష్టం కూడా అంతే ముఖ్యం. 20 ఏళ్లుగా పరిశ్రమలో కొనసాగుతూ, స్టార్‌డమ్‌ను అందుకోలేకపోయిన నటి రెజీనా కసాండ్రా ప్రస్థానం ఆసక్తికరంగా మారింది. ఆమె కెరీర్ మలుపులు, ప్రస్తుతం ఎంచుకుంటున్న పాత్రల గురించి తెలుసుకుందాం.

రెజీనా కసాండ్రా 20 ఏళ్ల కెరీర్

ఫిల్మ్ ఇండస్ట్రీలో టాలెంట్ ఎంత ముఖ్యమో, అదృష్టం కూడా అంతే ముఖ్యం. ఎంత టాలెంట్ ఉన్నా.. లక్కు కలిసి రాకపోతే.. అవకాశాలు రావు, స్టార్ డమ్ కూడా సాధించలేము. ఈ విషయాన్ని దివంగత నటుడు కోటా శ్రీనివాసరావు కొన్ని సందర్భాల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. చాలామంది నటీనటులు.. టాలీవుడ్ లో ఇదే పరిస్థితుల్లో ఉన్నారు. స్టార్ డమ్ కు అడుగు దూరంలోనే ఆగిపోతున్నారు. ఎంత కష్టపడ్డా.. సెకండ్ లైన్ లోనే ఆగిపోతున్నారు. కొందరు మాత్రం తెలివిగా కెరీర్ ఎంపికలు చేసుకుంటూ స్టార్‌డమ్‌ను అందుకుంటే, మరికొందరు మంచి సామర్థ్యం ఉన్నప్పటికీ సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల వెనకబడిపోతుంటారు. అలాంటి  హీరోయిన్‌లో రెజీనా కసాండ్రా ఒకరు.

దాదాపు 20 ఏళ్లుగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో, ముఖ్యంగా టాలీవుడ్‌లో కొనసాగుతున్న రెజీనా, 2005లో సినిమాల్లో అడుగుపెట్టింది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి ఇప్పటి వరకు 40కి పైగా సినిమాల్లో నటించిన ఆమె, మంచి పాత్రలు చేసిందన్నది నిజం. అయితే, ఇప్పటి వరకు స్టార్‌డమ్‌ను అందించే బ్లాక్‌బస్టర్ హిట్ మాత్రం ఆమె కెరీర్‌లో రాలేదు. కొన్ని హిట్ సినిమాలు ఉన్నప్పటికీ, స్టార్ హీరోయిన్‌గా నిలదొక్కుకునే స్థాయి గుర్తింపు మాత్రం దక్కలేదు.

స్టార్ హీరోల సరసన అవకాశం లేకపోవడంతో

రెజీనా కెరీర్‌లో ఆమెకు స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు రాకపోవడంతో స్టార్ డమ్ కు దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. తమన్నా, రకుల్ లాంటి హీరోయిన్ల కెరీర్ లు కూడా చిన్న హీరోలతోనే స్టార్ట్ అయ్యాయి. కానీ వారికి ఆతరువాత కాలంలో ఎన్టీఆర్, మహేష్, బన్నీ, చరణ్ లాంటి స్టార్స్ తో నటించే అవకాశం రావడంతో.. వారు స్టార్స్ అయ్యారు. రెజీనా మాత్రం సాయి ధరమ్ తేజ్, సందీప్ కిషన్, సుధీర్ బాబు,మంచు మనోజ్ లాంటి చిన్న హీరోలతోనే అవకాశాలు ఎక్కువగా వచ్చాయి.

కెరీర్ బిగినింగ్ లో.. గ్లామర్ రోల్స్‌కు వెనకడుగు వేయని ఈ బ్యూటీ, ఇప్పుడు మాత్రం పూర్తిగా కంటెంట్ ఆధారిత సినిమాలను ఎంచుకుంటోంది. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో ఎక్కువగా నటిస్తూ, యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్రలను ఎంచుకుంటున్నది. ఈ జర్నీలో రెజీనా.. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. లేడీ విలన్ గా ఆమె చేసిన సినిమాలకు మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది.

విభిన్న పాత్రల వైపు రెజీనా పయనం

టాలీవుడ్ హీరో సుధీర్ బాబు సరసన వచ్చిన శివ మనసులో శృతీ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయం అయిన రెజీనా, ఇప్పుడు విలన్ రోల్స్ వరకూ చేరుకుంది. 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో నిలబడి పోరాడిందిం రెజీనా. ఇంకా  పట్టుదలతో ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ నుంచి కనిపించకుండా పోయింది హీరోయిన్… 2024 లో తెలుగు ప్రాజెక్ట్ లు చేసిన రెజీనా.. ఈ ఏడాది టాలీవుడ్ లొ ఒక్క సినిమా కూడా చేయలేదు. తమిళంతో పాటు.. బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తోంది. కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా కనిపిస్తోంది.

రెజీనా కసాండ్రా కేవలం స్టార్‌డమ్ కోసం కాకుండా, వైవిధ్యమైన పాత్రలతో నటిగా తనను తాను నిరూపించుకోవాలని కృషి చేస్తోంది. భవిష్యత్తులో ఆమె ప్రయత్నాలు ఎలా ఫలిస్తాయో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.