|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అదా శర్మలో దాగున్న టాలెంట్ చూస్తే షాక్ అవుతారు! ఒక్క ఊపిరిలో హనుమాన్ చాలీసా పఠనం!

Published: 02-04-2026, 7:05 AM
అదా శర్మలో దాగున్న టాలెంట్ చూస్తే షాక్ అవుతారు! ఒక్క ఊపిరిలో హనుమాన్ చాలీసా పఠనం!
  • అదా శర్మ హనుమాన్ చాలీసాను బ్రీత్ లెస్ గా పఠించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
  • ఆమె చాలీసా పఠిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
  • ది కేరళ స్టోరీ సినిమాతో అదా శర్మ సంచలనం సృష్టించింది.
  • అదా శర్మ టాలెంట్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ప్రముఖ నటి అదా శర్మ తన టాలెంట్ తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. హనుమాన్ జయంతి సందర్భంగా ఆమె బ్రీత్ లెస్ గా హనుమాన్ చాలీసా పఠించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

అదా శర్మ టాలెంట్ వైరల్

Adah Sharma:ప్రముఖ టాలీవుడ్ బ్యూటీ అదా శర్మ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె 2008లో తొలిసారి హిందీ హారర్ సినిమా 1920తో అరంగేట్రం చేసింది. ఈ సినిమా మంచి హిట్గా నిలవడమే కాకుండా ఈ సినిమాలో అదా శర్మ నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. పైగా ఈ సినిమాకి ఫిలింఫేర్ ఉత్తమ ఫిమేల్ డెబ్యూ పురస్కారం కూడా లభించింది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమెకు మళ్లీ హిందీలోనే అవకాశం లభించింది. అలా రెండు చిత్రాలు చేసిన తర్వాత 2014లో హార్ట్ ఎటాక్ సినిమాలో నితిన్ సరసన హయతి పాత్ర పోషించి కుర్రకారు క్రష్ గా మారిపోయింది.

ఇక తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, గరం, క్షణం, మీట్ క్యూట్ వంటి చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. ది కేరళ స్టోరీ సినిమాతో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే . ఎన్నో వివాదాల మధ్య వచ్చిన ఈ సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈమె టాలెంట్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అదాశర్మ లో ఇంత టాలెంట్ ఉందా అంటూ కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం.

హనుమాన్ చాలీసా పఠించిన అదా

అసలు విషయంలోకి వెళ్తే నేడు హనుమాన్ జయంతి. ఈ సందర్భంగా ప్రజలతోపాటు సెలబ్రిటీలు కూడా హనుమాన్ జయంతిని ఘనంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అదా శర్మ కూడా హనుమాన్ చాలీసా పఠించింది. ముఖ్యంగా ఇందుకు సంబంధించిన వీడియోని ఆమె తన ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. ఇందులో హనుమాన్ చాలీసా ను ఆమె గుక్క తిప్పుకోకుండా పఠించింది. పైగా బ్రీత్ లెస్ చాలీసాను హీరోయిన్ అదాశర్మ చదవడం ఇక్కడ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. పైగా ఈమె పక్కన ఉన్న ఒక బాలుడు నోటితో మ్యూజిక్ ఇచ్చాడు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన వీడియోని ఆమె పంచుకోవడమే కాకుండా తమ ప్రయత్నం హనుమంతుడిని మెప్పిస్తుందని అనుకుంటున్నట్లు అదాశర్మ తెలిపింది. ఇక ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవ్వడంతో ఈమె టాలెంట్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఏది ఏమైనా తన అభిమాన నటిలో ఇంత టాలెంట్ ఉందని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. నెటిజన్స్ హనుమంతుడి ఆశీర్వాదం మీపై ఖచ్చితంగా ఉంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

నెటిజన్ల ప్రశంసలు

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

అదా శర్మ తన టాలెంట్ తో అందరినీ ఆకట్టుకుంటోంది. హనుమాన్ చాలీసా పఠించిన వీడియో వైరల్ కావడంతో ఆమెకు మరింత మంది అభిమానులు ఏర్పడ్డారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.