
📌 Key Points
- ‘ధురంధర్ 2’ మూవీ: మూడు రోజుల్లోనే రూ.500 కోట్ల గ్రాస్ వసూళ్లు! రికార్డుల మోత!
- దర్శకుడు ఆదిత్య ధర్ సంచలన ప్రకటన: తప్పుడు ఉద్దేశంతో సినిమా తీస్తే ఇక సినిమాలు ఆపేస్తా!
- సినిమాను ‘ప్రాపగాండా’ అంటున్న విమర్శకులకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ఆదిత్య ధర్!
- భారతీయ ప్రేక్షకుల తీర్పు: ‘ధురంధర్ 2’కు బ్రహ్మరథం! ఆదిత్య ధర్ మాటల్లో నిజం!
‘ధురంధర్ 2’ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ ఆదిత్య ధర్ సంచలన ప్రకటన చేశారు. సినిమా విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!
‘ధురంధర్ 2’ కలెక్షన్ల సునామీ! రికార్డులు బ్రేక్
Aditya Dhar: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ధురంధర్ 2’ పేరు మారుమోగిపోతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీని సృష్టిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి, సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. అయితే, ఈ స్థాయి విజయం వెనుక కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
విమర్శకులకు ఆదిత్య ధర్ స్ట్రాంగ్ కౌంటర్!
ఈ చిత్రం ఒక సెపరేట్ అజెండాతో తీసిన ‘ప్రాపగాండా’ సినిమా అంటూ సోషల్ మీడియాలో కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, చిత్ర దర్శకుడు ఆదిత్య ధర్(Aditya Dhar) తాజాగా స్పందిస్తూ విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చారు. తమ సినిమాను ప్రాపగాండా అని పిలిచే వారి గురించి తాను అస్సలు పట్టించుకోనని ఆదిత్య ధర్ స్పష్టం చేశారు. “ఎవరైనా ఏదైనా అనవచ్చు, కానీ వాటన్నింటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. భారతీయ ప్రేక్షకులు చాలా తెలివైన వారు. ఏది మంచి సినిమా, ఏది ప్రచార చిత్రం అనేది వారికి స్పష్టంగా తెలుసు. అందుకే వారు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.
సినిమా ఆపేస్తా: ఆదిత్య ధర్ సంచలన నిర్ణయం
కేవలం సినిమా రికార్డుల కోసమో, వివాదాల కోసమో కాకుండా, ఒక సరైన ఉద్దేశంతోనే ఈ కథను తెరకెక్కించాను. దర్శకుడిగా నా బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తించానని, ఒకవేళ నా ఆలోచనల్లో గానీ, సినిమా తీసే పద్ధతిలో గానీ తప్పుడు ఉద్దేశం ఉందని భావిస్తే, ఆ రోజే నేను సినిమాలు చేయడం ఆపేస్తాను” అంటూ ఆదిత్య ధర సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆదిత్య ధర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


