|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అడివి శేష్ ‘డెకాయిట్’: ఓవర్సీస్ కల నెరవేరుతుందా? ప్రీ రిలీజ్ బిజినెస్ టాక్!

Published: 01-04-2026, 12:05 PM
అడివి శేష్ 'డెకాయిట్': ఓవర్సీస్ కల నెరవేరుతుందా? ప్రీ రిలీజ్ బిజినెస్ టాక్!
  • డెకాయిట్ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది.
  • ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 30 కోట్లు దాటింది.
  • మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.
  • ఓవర్సీస్ హక్కులు కూడా భారీగా అమ్ముడయ్యాయి.

యంగ్ హీరో అడివి శేష్ నటించిన ‘డెకాయిట్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సినిమా ఓవర్సీస్ లో ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.

డెకాయిట్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు

Decoit:ప్రముఖ టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ (Adivi shesh) నుండి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం డెకాయిట్. ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా పలు కారణాలవల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఏప్రిల్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో అప్పుడే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి అడివి శేష్ డెకాయిట్ సినిమాకి అసలు పెద్దగా హైప్ లేకపోయినా ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం బాగా జరిగినట్లు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాకి విడుదలకు ముందే ఎలాంటి బిజినెస్ జరిగింది? అటు ఓవర్సీస్ సంగతేంటి? అనే విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

డెకాయిట్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. ఈ సినిమా సుమారుగా 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదు చేసినట్లు తెలుస్తోంది . కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలోనే ఈ సినిమా థియేట్రికల్ హక్కులను 20 కోట్లకు పైగా కొనుగోలు చేసినట్లు సమాచారం. అటు ఓవర్సీస్ తో కలిపి ఈ మైలు రాయిని అందుకుంది. మొత్తానికైతే ప్రీ రిలీజ్ బిజినెస్ లో ఏకంగా 30 కోట్లు రాబట్టి అంచనాలు పెంచేసింది ఈ సినిమా. ఇకపోతే ఈ సినిమా లాభాల బాట పట్టాలి అంటే కనీసం 50 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుంది. ఇందులో ప్రముఖ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఓవర్సీస్ లో డెకాయిట్ అంచనాలు

వాస్తవానికి అడివి శేష్ సినిమాలు అంటే కచ్చితంగా మినిమం గ్యారంటీ అనే నమ్మకాలు ఉంటాయి .పైగా ఆయన సినిమాలు వస్తున్నాయి అంటే కొంతవరకు ప్రమోషన్స్ లేదా సినిమాపై అంచనాలను పెంచడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ డెకాయిట్ సినిమా విడుదల దగ్గర పడుతున్నా.. ఈ సినిమాపై ఎటువంటి అంచనాలు కలగడం లేదు. పైగా ప్రేక్షకులలో ఆసక్తి కలిగించే అంశాలు ఏవి వదలకపోవడంతో అసలు ఈ సినిమా మంచి హిట్ అందుకుంటుందా? అడివి శేష్ సినిమాలంటే మినిమం గ్యారంటీ అనే ఫీట్ ను ఇది నిజం చేస్తుందా అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

ఇదిలా ఉండగా మరొకవైపు డెకాయిట్ సినిమాలో మొదట ప్రముఖ హీరోయిన్ శృతిహాసన్ హీరోయిన్గా ఎంపికైంది. కొంత భాగం షూటింగ్ కూడా నిర్వహించారు. కానీ అనూహ్యంగా శృతిహాసన్ ఈ సినిమా నుండి తప్పుకుంది. ఆ స్థానంలో మృణాల్ ఠాకూర్ ను హీరోయిన్ గా రంగంలోకి తీసుకొచ్చింది చిత్ర బృందం. పైగా ఈమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటు ఆక్షన్ పర్ఫామెన్స్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేసిన విషయం తెలిసిందే.ఇకపోతే ఈ సినిమా నుండి శృతిహాసన్ అనూహ్యంగా తప్పుకోవడంతో హీరో అడివి శేష్ తో ఈమెకు గొడవలు కావడం వల్ల ఆమె ఈ సినిమా నుండి తప్పుకుంది అనే వార్తలు రావడంతో.. ఈ విషయంపై హీరో అడివి శేష్ స్పందిస్తూ శృతిహాసన్ తన డేట్స్ కారణంగానే ఈ సినిమా నుంచి తప్పుకుందని , ఆమెను ఎవరు తప్పించలేదు అని క్లారిటీ ఇచ్చారు. ఏది ఏమైనా శృతిహాసన్ ఈ సినిమాలో నటించకపోయిన ఆమె స్థానంలో మృణాల్ అంతకుమించి పర్ఫామెన్స్ అందించబోతోంది అని ఆమె అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం

సినిమా హిట్ అవుతుందా?

‘డెకాయిట్’ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా మంచి ఫలితాలు సాధించింది. అయితే, సినిమా విడుదల తర్వాత ప్రేక్షకుల ఆదరణ ఎలా ఉంటుందో చూడాలి. అడివి శేష్ ఈ సినిమాతో హిట్ కొడతాడా అనేది వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.