
📌 Key Points
- నటుడు శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
- బిగ్ బాస్ ఫేమ్ దువ్వాడ మాధురి శివాజీ వ్యాఖ్యలను సమర్థిస్తూ సంచలనం సృష్టించారు.
- యాంకర్ అనసూయ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను మాధురి తీవ్రంగా ఖండించారు.
- అనసూయ బికినీలు, బట్టలు తనకు నచ్చవని, సనాతన ధర్మం గురించి ఆమెకు ఏం తెలుసని మాధురి ప్రశ్నించారు.
నటుడు శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ విషయంలో శివాజీకి బిగ్ బాస్ 9 ఫేమ్ దువ్వాడ మాధురి మద్దతుగా నిలిచారు. అనసూయ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. ఆమె సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత లేదని సంచలనం సృష్టించారు.
శివాజీ వ్యాఖ్యలకు మాధురి మద్దతు
టాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టంట్ శివాజీ ఇటీవల ఓ సినిమా ఈవెంట్లో హీరోయిన్ల డ్రస్సింగ్ పై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. దాదాపు ఇండస్ట్రీలో ఉన్నవారంతా ఆయన చేసిన కామెంట్స్ చాలా తప్పు అంటూ ఖండించారు. కొందరు మాత్రం శివాజీ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ 9 ఫేమ్ దువ్వాడ మాధురి.. శివాజీ చేసిన వ్యాఖ్యల్లో తప్పు లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. శివాజీ చెప్పిన దానిలో ఏ తప్పూ లేదని, అతను మాట్లాడే భాష తప్పని అన్నారు. సామాన్లు అనే పదం వాడకుండా.. చీరలు కట్టుకోమని మంచిగా కూడా చెప్పి ఉండొచ్చన్నారు. హీరోయిన్లకు చెప్పే బదులుగా డైరెక్టర్లు, నిర్మాతలకు ఈ విషయం చెప్పాలని, హీరోయిన్లు వాళ్లు ఎలా చెప్తే అలా నడుచుకుంటారన్నారు. తన దృష్టిలో ఆడవాళ్లకు చీరే అందమన్నారు. అయినా అతను చేసిన వ్యాఖ్యలకు సారీ చెప్పాడని, అంతటితో మ్యాటర్ క్లియర్ అయిందని అన్నారు.
కానీ.. ఈ విషయంపై యాంకర్ అనసూయ చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సరికాదని మాధురి ఫైరయ్యారు. ఆమె మాటలతో ఏకీభవించబోనన్నారు. ఆమె సనాతన ధర్మం, ఆలయాల కోసం మాట్లాడింది అంటే ఇక్కడ నమ్మేవారు ఎవరూ లేరన్నారు. ఆలయాల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడం మంచిదన్నారు. సనాతన ధర్మం గురించి ఆమెకి ఏం తెలుసని దువ్వాడ మాధురి ప్రశ్నించారు. ఆమె వేసుకునే బికినీలు, బట్టలు ఏవీ తనకు నచ్చవు అని, ఈ విషయంలో తనను ట్రోల్ చేసినా ఏం ఫర్వాలేదని, ట్రోలింగ్స్ తనకేం కొత్త కాదని అన్నారు.
అనసూయపై దువ్వాడ మాధురి ఫైర్
సనాతన ధర్మంపై మాధురి ప్రశ్నలు
శివాజీ వ్యాఖ్యలపై మొదలైన ఈ వివాదం అనసూయ, దువ్వాడ మాధురి మధ్య మాటల యుద్ధంగా మారింది. ఈ త్రిముఖ పోరు టాలీవుడ్‌లో కొత్త చర్చకు దారితీస్తోంది. దీనిపై ఎలాంటి పరిణామాలు ఉంటాయో చూడాలి.


