|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అడివి శేష్ రెమ్యునరేషన్ షాక్: ఒక్క సినిమాకు అన్ని కోట్లా? టాలీవుడ్లో హాట్ టాపిక్!

Published: 13-04-2026, 11:05 PM
అడివి శేష్ రెమ్యునరేషన్ షాక్: ఒక్క సినిమాకు అన్ని కోట్లా? టాలీవుడ్లో హాట్ టాపిక్!
  • అడివి శేష్ రెమ్యునరేషన్ పెంపు: ఒక్కో సినిమాకు రూ.20-25 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు టాలీవుడ్ టాక్!
  • సాయి మార్తాండ్ డైరెక్షన్లో లవ్ స్టోరీ కోసం అడివి శేష్ రూ.25 కోట్ల వరకు అడుగుతున్నాడని సమాచారం.
  • ‘గూఢచారి 2’ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది, దాదాపు రూ.100 కోట్లకు చేరినట్లు సమాచారం!
  • ‘గూఢచారి 2’ విజయం సాధిస్తే శేష్‌కు వాటాల రూపంలో రూ.50 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా.

టాలీవుడ్ సెన్సేషన్ అడివి శేష్ తన రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడని సమాచారం! దీనికి కారణం ఏమిటి? ఆయన కొత్త ప్రాజెక్టులు ఎలా ఉండబోతున్నాయి? పూర్తి వివరాల్లోకి వెళ్దాం!

రెమ్యునరేషన్ పెంచిన అడివి శేష్: కారణం ఇదేనా?

గెలుపోటములతో సంబంధం లేకుండా.. డిఫరెంట్ స్టోరీస్ తో, ప్రయోగాత్మక సినిమాలు చేసే హీరోలు టాలీవుడ్‌లో కొంత మంది మాత్రమే ఉన్నారు. అందులో అడివి శేష్ ముందు వరసలో ఉంటాడు. కమర్షియల్ సినిమాలే అయినా.. కథాబలం ఉన్న , కంటెంట్ ఆధారిత సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు శేష్. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఫిల్మ్ ఇండస్ట్రీలో తన జర్నీని స్టార్ట్ చేసి.. తరువాత హీరోగా మారాడు అడివి శేష్. మంచి సినిమాలతో వరుస విజయాలను చూస్తున్నాడు.

ఎక్కువెక్కువ సినిమాలు చేయకుండా.. గ్యాప్ తీసుకుని మంచి సినిమాలను మాత్రమే సెలక్ట్ చేసుకుంటున్నాడు శేష్. అంతే కాదు వరుస విజయాలతో తన మార్కెట్ ను కూడా పెంచుకుంటున్నాడు. ఈక్రమంలోనే ఆయన నటించిన ‘క్షణం’, ‘గూఢచారి’, ‘మేజర్’, ‘హిట్-2’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాయి. ఈ సినిమాల సక్సెస్ ప్రభావంతో అడివి శేష్ మూవీస్ కు ప్రస్తుతం థియేట్రికల్ , నాన్-థియేట్రికల్ బిజినెస్ కలిపి సుమారు రూ.70 కోట్ల వరకు జరుగుతున్నట్లు సమాచారం.

‘గూఢచారి 2’ బడ్జెట్ ఎంత? శేష్ ప్లాన్స్ ఏంటి?

ఇంత భారీ బిజినెస్ జరుగుతుండటం.. డెకాయిట్ సక్సెస్ తో మంచిఫామ్ లో ఉంటం.. ఇదే మంచి టైమ్ గా భావించి.. తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచాడట శేష్. ఈ విషయంపై టాలీవుడ్‌లో పెద్ద చర్చ జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఆయన ఇకపై ఒక్కో సినిమాకు రూ.20 కోట్ల నుండి రూ.25 కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై అఫీషియల్ గా ఆయన వెల్లడించకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ అవుతోంది.

ఇక సాయి మార్తాండ్‌ డైరెక్షన్ లో చేయబోయే లవ్ స్టోరీ ప్రాజెక్ట్ కోసం ఆయన రూ.25 కోట్ల వరకు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇదే సమయంలో, అడివి శేష్ భారీ ప్లానింగ్ తో  చేస్తున్న ‘గూఢచారి 2’ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.100 కోట్లకు చేరినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌లో అడివి శేష్ సాధారణ రెమ్యూనరేషన్ తీసుకోవడం కాకుండా, లాభాల్లో వాటాను కూడా పొందుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ‘గూఢచారి 2’ సినిమా భారీ విజయాన్ని సాధించి రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధిస్తే, నాన్-థియేట్రికల్ బిజినెస్‌తో కలిపి శేష్‌కు వాటాల రూపంలో సుమారు రూ.50 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సాయి మార్తాండ్ మూవీ కోసం అన్ని కోట్లు అడుగుతున్నాడా?

అడివి శేష్ కేవలం నటుడిగానే కాకుండా, తన సినిమాలకు కథ, స్క్రీన్‌ప్లే అందించడం ద్వారా నిర్మాణ వ్యయాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం పెద్ద విషయం కాదు. మొత్తానికి, తన కంటెంట్ సెలక్షన్, మల్టీ టాలెంట్ స్కిల్స్ తో ఇండస్ట్రీలో తన స్థాయితో పాటు రెమ్యునరేషన్ కూడా పెంచుకుంటూ వెళ్తున్నాడు అడివి శేష్.

అడివి శేష్ రెమ్యునరేషన్ పెంపు టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. గూఢచారి 2 చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.