|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: డెకాయిట్ హిట్ తో అడివి శేష్ రెమ్యునరేషన్ కుమ్మేసాడు! ఇకపై 25 కోట్లు?

Published: 13-04-2026, 11:05 AM
షాకింగ్: డెకాయిట్ హిట్ తో అడివి శేష్ రెమ్యునరేషన్ కుమ్మేసాడు! ఇకపై 25 కోట్లు?
  • డెకాయిట్ సక్సెస్‌తో అడివి శేష్ క్రేజ్ అమాంతం పెరిగింది, నిర్మాతల క్యూ!
  • ఒక్కో సినిమాకు రూ.25 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న అడివి శేష్ సంచలనం!
  • గూఢచారి 2 చిత్రం కోసం శేష్ లాభాల్లో వాటా తీసుకోవడానికి సిద్ధం!
  • రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లతో శేష్‌కు రూ.50 కోట్ల వరకు లాభాలు చేరే అవకాశం!

టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న అడివి శేష్.. డెకాయిట్ సక్సెస్‌తో రెమ్యునరేషన్ పెంచేశారా? ఆయన తదుపరి చిత్రాల గురించి వస్తున్న ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

డెకాయిట్ ఎఫెక్ట్: శేష్ రెమ్యునరేషన్ పెంపు!

Adivi Sesh: అడివి శేష్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రయాణాన్ని మొదలుపెట్టి, ఇప్పుడు టాలీవుడ్‌లో ఇండస్ట్రీలో మోస్ట్ బ్యాంకబుల్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు ఈ హీరో. క్షణం, గూఢచారి, మేజర్, హిట్-2 వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో ఆయన మార్కెట్ ఒక రేంజ్ లో పెరిగిపోయింది. ప్రస్తుతం ఆయన నటించిన ‘డెకాయిట్’ చిత్రం కూడా భారీ విజయాన్ని అందుకోవడంతో, శేష్ సినిమాలకు థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ కలిపి సుమారు రూ.70 కోట్ల రూపాయల వరకు జరుగుతోంది.

గూఢచారి 2: లాభాల్లో శేష్ వాటా!

ఈ క్రమంలోనే శేష్ తన తదుపరి చిత్రాలకు రెమ్యూనరేషన్ భారీగా పెంచినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం, అడివి శేష్(Adivi Sesh) ఇకపై ఒక్కో సినిమాకు రూ.20 నుండి రూ.25 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అడివి శేష్ త్వరలో సాయి మార్తాండ్ దర్శకత్వంలో చేయబోయే లవ్ స్టోరీ కోసం ఆయన సుమారు రూ.25 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. మరోవైపు, ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న ‘గూఢచారి 2’ దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది.

టాలీవుడ్‌లో శేష్ సరికొత్త రికార్డ్!

ఈ భారీ ప్రాజెక్ట్ కోసం ఆయన రెమ్యూనరేషన్ కాకుండా, ఏకంగా లాభాల్లో వాటాను తీసుకుంటున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ‘గూఢచారి 2’ భారీ హిట్ సాధించి రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా తోడైతే, వాటాల రూపంలో శేష్‌కు రూ.50 కోట్ల వరకు అందే అవకాశం ఉంది. కేవలం నటుడిగానే కాకుండా, తన సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ నిర్మాణ వ్యయం తగ్గించడంలోనూ ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. నటనతో పాటు ఇతర క్రాఫ్ట్స్‌లోనూ ఆయన చూపిస్తున్న ప్రతిభను బట్టి, ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకోవడంలో తప్పు లేదని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మున్ముందు అడివి శేష్ రెమ్యునరేషన్ మరింతగా పెరిగే అవకాశం ఉంది.

అడివి శేష్ రెమ్యునరేషన్ పెంపు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన రాబోయే చిత్రాలపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.