
📌 Key Points
- విశాఖపట్నంలో ఇల్లు కొనుక్కోవాలని చూస్తున్న అడివి శేష్!
- సొంతూరు విశాఖపట్నంపై మనసు పారేసుకున్న టాలీవుడ్ హీరో
- వరుస హిట్స్ తో ఫుల్ జోష్ లో అడివి శేష్
- హైదరాబాద్, వైజాగ్ లలో సినిమాలు చేస్తూ గడపాలని ప్లాన్!
టాలీవుడ్ లో సంచలనం! యంగ్ హీరో అడివి శేష్ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నా సరే ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటి? ఎందుకు తీసుకున్నారో తెలుసుకుందామా!
సొంతూరిపై ప్రేమతో అడివి శేష్ ఎమోషనల్ కామెంట్స్
Tollywood Hero : ఈ టాలీవుడ్ హీరో సొంతూరికి వెళ్లిపోదామనుకుంటున్నాడట. తాజాగా ఓ ఈవెంట్లో డైరెక్ట్ గానే ఈ మాటలు చెప్పాడు. గతంలో తన సొంతూళ్లో సొంత ఇల్లు ఉంటే అది అమ్మేసారట. ఇప్పుడు మళ్ళీ ఆ ఇల్లు కొనాలని అనుకుంటున్నాడు ఈ హీరో.
ఆ యువ హీరో ఎవరో కాదు వరుస హిట్స్ తో దూసుకుపోతున్న అడివి శేష్. ఇటీవలే డెకాయిట్ సినిమాతో వచ్చి ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో మరింత ప్రమోషన్స్ చేస్తూ అన్ని ఊర్లకు తిరుగుతుంది మూవీ టీమ్. ఈ క్రమంలో ఇటీవల వైజాగ్ కూడా వెళ్లారు. అడివి శేష్ పేరెంట్స్ సొంతూరు వైజాగ్. శేష్ మూలాలు విశాఖపట్నంలోనే ఉన్నాయి. తాజాగా వైజాగ్ లో ఓ థియేటర్ విజిట్ కి వెళ్లిన అడివి శేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
వైజాగ్ లో పాత ఇల్లు కొంటానన్న హీరో
అడివి శేష్ మాట్లాడుతూ.. నా స్వస్థలం విశాఖపట్నం వచ్చేయాలని ఉంది. వైజాగ్ వచ్చిన ప్రతిసారి నాకు మంచి ఫీలింగ్ వస్తుంది. వైజాగ్ లో మా పాత ఇల్లుని అమ్మేసాం. నేను అర్జెంట్ గా వైజాగ్ లోని నా పాత ఇల్లు కొనుక్కొని మళ్లీ ఇక్కడకు వచ్చేస్తా. వైజాగ్ వచ్చినప్పుడు కలిగే ఫీలింగ్ నాకు ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్ లలో దొరకట్లేదు. వీలైతే వైజాగ్ వచ్చేస్తాను. హైదరాబాద్ లో ఉండి సినిమాలు తీసుకుంటూ, సినిమాలు లేనప్పుడల్లా వైజాగ్ లో ఉంటూ గడిపేయాలని ఉంది అని అన్నారు.
హైదరాబాద్, వైజాగ్.. రెండింటినీ బ్యాలెన్స్ చేయాలని ప్లాన్
దీంతో త్వరలోనే అడివి శేష్ వైజాగ్ లో ఇల్లు కొనుక్కొని సినిమాలు ఉన్నప్పుడు హైదరాబాద్ లో, లేనప్పుడు వైజాగ్ లో ఉంటారని తెలుస్తుంది.
అడివి శేష్ తీసుకున్న ఈ నిర్ణయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఈ న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి.


