|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మయోసైటిస్, రెండో పెళ్లి తర్వాత సమంత ధమాకా ఎంట్రీ: ‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ వచ్చేస్తోంది!

Published: 07-01-2026, 1:35 AM
మయోసైటిస్, రెండో పెళ్లి తర్వాత సమంత ధమాకా ఎంట్రీ: 'మా ఇంటి బంగారం' ట్రైలర్ వచ్చేస్తోంది!
  • సమంత మయోసైటిస్ తర్వాత, రెండో వివాహం అనంతరం సినిమాలకు రీఎంట్రీ ఇస్తున్నారు.
  • భర్త రాజ్ నిడిమోరుతో కలిసి ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని సహ-నిర్మిస్తున్నారు.
  • నందిని రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఒక యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోంది.
  • సంక్రాంతి కానుకగా జనవరి 9న ‘మా ఇంటి బంగారం’ టీజర్ ట్రైలర్ విడుదల కానుంది.

ప్రముఖ నటి సమంత తన రెండో పెళ్లి తర్వాత, మయోసైటిస్ నుంచి కోలుకొని సినిమాల్లోకి తిరిగి వస్తున్నారు. తన భర్తతో కలిసి నిర్మిస్తున్న “మా ఇంటి బంగారం” చిత్రంతో ఆమె రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ యాక్షన్ మూవీ ట్రైలర్ త్వరలో విడుదల కానుంది, ఇది అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతోంది.

సమంత కొత్త ప్రస్థానం: మయోసైటిస్ నుంచి సెకండ్ ఇన్నింగ్స్

Maa Inti Bangaram: ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. మొదటి భర్త నాగచైతన్యకి విడాకులు ఇచ్చిన తర్వాత మయోసైటిస్ వ్యాధి బారిన పడి కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైంది. మళ్లీ బాలీవుడ్ లో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈమె.. సిటాడెల్ హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది . ఈ వెబ్ సిరీస్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ప్రేమలో పడిన ఈమె.. గత ఏడాది డిసెంబర్ 1న ఈశా యోగ సెంటర్ సమీపంలో ఉన్న లింగ బైరవి సన్నిధిలో భూత శుద్ధ పద్ధతిలో వివాహం చేసుకుంది.

ఇకపోతే రెండవ వివాహం తర్వాత సమంత మళ్ళీ సినిమాలలోకి రీఎంట్రీ ఇచ్చింది. తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి సహనిర్మాతగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’ . నందిని రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యింది సమంత. ఇకపోతే తాజాగా ఈ సినిమా టీజర్ ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ.. సమంత లుక్ పోస్టర్ ను కూడా తాజాగా విడుదల చేశారు. సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన ఉదయం 10 గంటలకు ఈ సినిమా నుండి టీజర్ ట్రైలర్ను రిలీజ్ చేయబోతున్నట్లు సమంత అధికారికంగా ప్రకటించింది.

‘మా ఇంటి బంగారం’ వెనుక ఉన్న విశేషాలు

తాజాగా సమంత లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో సమంత యాక్షన్ లుక్ లో కనిపించింది. ముఖ్యంగా సమంత తొలిసారి తెలుగులో ఇలాంటి పాత్రలో కనిపించబోతోందని, ఈమె లుక్ చాలా అద్భుతంగా ఉంది అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ పోస్టర్ ను సమంత కూడా తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకుంటూ..” చూస్తూ ఉండండి.. మా ఇంటి బంగారం మీ అందరితో కలిసిపోతుంది” అంటూ క్యాప్షన్ కూడా జోడించింది. ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది .మరి యాక్షన్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టడానికి సిద్ధమవుతున్న సమంత కచ్చితంగా బ్లాక్ బాస్టర్ అందుకుంటుందని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రాన్ని తన నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై తన భర్తతో కలిసి నిర్మిస్తోంది సమంత.

ట్రైలర్ విడుదల: సమంత యాక్షన్ లుక్ వైరల్!

ఒకవైపు నిర్మాతగా కెరియర్ ను కొనసాగిస్తున్న ఈమె మరొకవైపు హీరోయిన్ గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. మరోవైపు రెండవ పెళ్లి చేసుకున్న ఈమె ఇప్పుడిప్పుడే సంతోషంగా తన వైవాహిక జీవితాన్ని గడిపే ప్రయత్నం చేస్తోంది. గత రెండు సంవత్సరాలుగా తీవ్రమైన ఇబ్బందులతో సతమతమైన సమంత ఈ కొత్త ఏడాది మరిన్ని సక్సెస్ లు అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

BIG TV తెలుగు వాట్సాప్ ఛానల్‌ని ఫాలో అవ్వండి Tags Actress Samantha raj nidamoru Share

సమంత మయోసైటిస్, విడాకుల వంటి సవాళ్లను అధిగమించి, కొత్త వివాహం అనంతరం తిరిగి తెరపైకి రావడం ఆమె అభిమానులకు ఆనందం కలిగిస్తోంది. “మా ఇంటి బంగారం” చిత్రం ఆమె కెరీర్‌లో ఒక మైలురాయి అవుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.