|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Akhanda 2 :కోర్టు ఉత్తర్వులంటే లెక్క లేదా… అఖండ 2 మూవీపై హైకోర్టు సీరియస్

Published: 12-12-2025, 4:08 AM
Akhanda 2 :కోర్టు ఉత్తర్వులంటే లెక్క లేదా… అఖండ 2 మూవీపై హైకోర్టు సీరియస్
  • అఖండ 2 సినిమా టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక షోలపై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
  • కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, ప్రీమియర్లు ప్రసారం, పెంచిన ధరలకు టికెట్ల విక్రయం జరిగింది.
  • బుక్ మై షోకు హైకోర్టు ప్రశ్నలు, కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదని హెచ్చరిక.
  • తెలంగాణ ప్రభుత్వం అనుమతించిన ధరల పెంపుపై కోర్టులో పిటిషన్ దాఖలు కావడం గమనార్హం.

అఖండ 2 సినిమా టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక షోల వివాదంపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. కోర్టు ఉత్తర్వులను ఖాతరు చేయకుండా సినిమా ప్రదర్శనలు, టికెట్ల విక్రయాలు కొనసాగడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. బుక్ మై షోకు నోటీసులు జారీ చేసింది.

అఖండ 2: హైకోర్టు ఆగ్రహానికి కారణం

Akhanda 2: అఖండ 2 సినిమా ఎన్నో అవంతరాలను దాటుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమస్య తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదల సమయంలో తెలంగాణ హైకోర్టులో సినిమా టికెట్ల ధరలపై న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం అనుమతి తెలిపిన విధంగా ఈ సినిమా టికెట్ల ధరలు పెంచకూడదని అలాగే ప్రత్యేక షోలను ప్రదర్శించకూడదు అంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా కోర్టు ఉత్తర్వులు వచ్చినప్పటికీ లెక్కచేయకుండా ఈ సినిమా ప్రీమియర్లు ప్రసారమయ్యాయి .అదే విధంగా పెంచిన టికెట్ ధరలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో హైకోర్టు సీరియస్ అయ్యారు.

ఈ నేపథ్యంలోనే కోర్టు ఉత్తర్వులు అంటే లెక్క లేదా ఆదేశాలు ఇచ్చినా కూడా ఎందుకు టికెట్లను ఆన్లైన్లో విక్రయిస్తున్నారు అంటూ బుక్ మై షోకు ప్రశ్నలు వేశారు. అయితే కోర్టు ఉత్తర్వులు అందేలోపే ప్రేక్షకుల్లో టికెట్లు కొనుగోలు చేశారని బుక్ మై షో తమ సమాధానాన్ని వెల్లడించారు. కోర్టు ఉత్తర్వులు వచ్చినప్పటికీ ప్రస్తుతం కూడా పెంచిన రేట్ల తోనే టికెట్లను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకువచ్చారా లేదా అంటూ కోర్టు ప్రశ్నించారు అలాగే కోర్టు ఉత్తర్వులు వచ్చినప్పటికీ పాటించని నేపథ్యంలో మీపై ఎందుకు కంటెంప్ట్ యాక్షన్ తీసుకోకూడదో చెప్పాలని హైకోర్టు ప్రశ్నలు వేశారు.

టికెట్ల ధరల పెంపుపై ప్రభుత్వ ఉత్తర్వులు

ఇక ఈ విచారణ మధ్యాహ్నానికి వాయిదా పడింది మరి తదుపరి విచారణలో ఏ విధమైనటువంటి తీర్పు వెల్లడిస్తుందో తెలియాల్సి ఉంది. ఇలా అఖండ సినిమా టికెట్ల రేట్ల విషయంలో తెలంగాణ హైకోర్టు కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పాలి. ఈ సినిమా టికెట్ల ధరలను తెలంగాణ ప్రభుత్వం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు .ప్రీమియర్లకు 600 రూపాయలు చొప్పున పెంచగా 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు మూడు రోజుల పాటు పెంచిన టికెట్ల ధరలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.

తెలంగాణలో ఈ సినిమాకు సింగిల్ స్క్రీన్ తియేటర్లకు 50 రూపాయలు మల్టీప్లెక్స్ థియేటర్లకు వంద రూపాయలు చొప్పున పెంచారు. ఈ పెంచిన టికెట్ల ధరలు వచ్చిన లాభాలలో 20 శాతం కార్మికుల సంక్షేమానికి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం చిత్ర బృందాన్ని కోరారు. ఇలా ప్రభుత్వం టికెట్ల ధరలకు అనుమతి లభించినప్పటికీ ఈ ధరలపై కోర్టులో పిటిషన్ వేయడంతో కోర్టు మాత్రం టికెట్ ధరలు పెంచడానికి వీలు లేదంటూ ఉత్తర్వులను జారీ చేశారు. ఇక ఈ సినిమా ప్రస్తుతం ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. సినిమా విడుదల ఆలస్యం అయినా ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగా సినిమా ఉన్న నేపథ్యంలో బాలయ్య అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

బుక్ మై షోకు హైకోర్టు ప్రశ్నలు

మొత్తంగా, అఖండ 2 సినిమా టికెట్ల ధరల విషయంలో తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణలో ఎలాంటి తీర్పు వస్తుందో వేచి చూడాలి. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పేలా లేవు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.