|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అజయ్ దేవ్‌గణ్ ‘ధమాల్-4’ మూవీలో బోల్డ్ బ్యూటీ ఫిక్స్.. ఇక ఫుల్ మీల్స్ ఖాయం అంటున్న నెటిజన్లు

Published: 30-04-2025, 8:23 AM
అజయ్ దేవ్‌గణ్ ‘ధమాల్-4’ మూవీలో బోల్డ్ బ్యూటీ ఫిక్స్.. ఇక ఫుల్ మీల్స్ ఖాయం అంటున్న నెటిజన్లు

బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ నటిస్తున్న ‘ధమాల్-4’ చిత్రంలో ఈషా గుప్తా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘టోటల్ ధమాల్’ తర్వాత వీరిద్దరూ మరోసారి కలిసి నటించడం విశేషం. ఈ సినిమాపై నెటిజన్లు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Key Points

1

అజయ్ దేవ్‌గణ్ ‘ధమాల్-4’లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

2

బోల్డ్ బ్యూటీ ఈషా గుప్తా హీరోయిన్‌గా నటిస్తున్నారు.

4

నెటిజన్లు బోల్డ్ సీన్స్‌ను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ధమాల్-4 చిత్రం విశేషాలు

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఈషా గుప్తా(Esha Gupta) నటిగా, మోడల్‌గా ఫుల పాపులారిటీ దక్కించుకుంది. అంతేకాకుండా ఈ అమ్మడు మిస్ ఇండియా పోటీల్లో విన్నర్‌గా కూడా కప్ గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్శించింది. ‘జన్నత్’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ భామ పలు చిత్రాల్లో నటించి ఫేమ్ సొంతం చేసుకుంది. ఇక తెలుగులో ఈ అమ్మడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) మూవీలో నటించింది. ఆ తర్వాత మళ్లీ బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టి పలు చిత్రాలు చేసింది.

గత ఏడాది ‘టిప్ప్సీ(’Tipppsy) సినిమాతో ప్రేక్షకులను అలరించింది. తాజాగా, ఈషా గుప్తా ఓ బంపర్ ఆఫర్ అందుకున్నట్లు సమాచారం. అజయ్ దేవ్‌గణ్(Ajay Devgn) హీరోగా నటిస్తున్న ‘ధమాల్-4’లో నటిస్తున్నట్లు టాక్. ఇంద్ర కుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా ధమాల్-3కి సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. అయితే ఇందులో అర్షద్ వార్సీ, రితేష్ దేశ్‌ముఖ్, సంజీదా షేక్(Sanjeeda Sheikh), సంజయ్ మిశ్రా, జావేద్ జాఫేరి, అంజలి ఆనంద్, ఉపేంద్ర లిమాయే కీలక పాత్రలో కనిపించబోతున్నారు. దీనిని భూషణ్ కుమార్(Bhushan Kumar), కుమార్ మంగత్ పాఠక్, అశోక్ థాకేరియా నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.

ఈషా గుప్తా పాత్ర ప్రాధాన్యత

అయితే ఇందులో అజయ్ దేవ్‌గణ్ కఠినమైన ఐఆర్‌ఎస్ అధికారి అమయ్ పట్నాయక్ పాత్రలో నటిస్తుండగా.. ఈషా గుప్తా హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరు హిట్ ‘టోటల్ ధమాల్’ చిత్రంలో జోడీగా నటించారు. ఇక ఇప్పుడు అడ్వెంచర్ కామెడీ థ్రిల్లర్ ‘ధమాల్-4’ కోసం మరోసారి జతకట్టబోతున్నారు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు బోల్డ్ సీన్స్ ఫుల్లుగా ఉంటాయి ఫుల్ మీల్స్ ఖాయం అని కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఈషా గుప్తా సోషల్ మీడియాలోనూ చాలా మంది ఫాలోవర్స్‌ను దక్కించుకుంది. నిత్యం తన బోల్డ్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్రకారులు నిద్రలేకుండా చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది.

నెటిజన్ల అభిప్రాయాలు

A post shared by Esha Gupta (@egupta)

అజయ్ దేవ్‌గణ్ మరియు ఈషా గుప్తా జంట ‘ధమాల్-4’తో ప్రేక్షకులను మళ్ళీ అలరించడానికి సిద్ధమవుతున్నారు. నెటిజన్ల అంచనాలు, చిత్రం విడుదల తేదీపై కంటిపై కుదురుతున్నాయి.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.