
📌 Key Points
- బాహుబలి 2 సినిమాలో అజయ్ ఘోష్ నటించిన సీన్లు తొలగించబడ్డాయి.
- సినిమాలో కనిపించకపోయినా, బాహుబలి 2 ద్వారా అజయ్ ఘోష్ కు గుర్తింపు లభించింది.
- కోటా శ్రీనివాసరావు గారు తనకు స్ఫూర్తి అని అజయ్ ఘోష్ తెలిపారు.
- అజయ్ ఘోష్ అనేక స్టార్ హీరోల సినిమాలలో నటించారు.
నటుడు అజయ్ ఘోష్ బాహుబలి 2 సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సినిమాలో తన సీన్లు తొలగించినప్పటికీ, ఆ సినిమా ద్వారా తనకు మంచి గుర్తింపు వచ్చిందని ఆయన అన్నారు.
బాహుబలి 2 గురించి అజయ్ ఘోష్
Ajay Ghosh: అజయ్ ఘోష్ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విలన్ పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఈయన కేవలం విలన్ పాత్రలలో మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా కూడా నటిస్తూ ఎంతో మంచి ఆదరాభిమానాలను సొంతం చేసుకున్నారు. అజయ్ ఘోష్ (Ajay Ghosh)రంగస్థలం గుంటూరు కారం పుష్ప 2 వంటి స్టార్ హీరోల సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అజయ్ ఘోష్ బాహుబలి సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న మొట్టమొదటి సినిమాగా బాహుబలి సినిమా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.
ఈ సినిమాలో నటించిన నటీనటులందరికీ కూడా పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. అయితే నటుడు అజయ్ ఘోష్ సైతం బాహుబలి 2(Baahubali 2) సినిమాలో నటించానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సినిమాలో తాను నటిస్తున్నట్టు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడంతో బాగా వైరల్ అయిందని, అయితే తాను నిజంగానే ఈ సినిమాలో నటించానని తెలిపారు. అయితే సినిమా లెంత్ ఎక్కువ కావడంతో నా పాత్రకు సంబంధించిన సీన్లు అన్నింటిని డిలీట్ చేశారని తెలిపారు.
సీన్లు తొలగించినా గుర్తింపు
సాధారణంగా ఇలాంటి స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు రావాలని అందరూ కోరుకుంటారు. అయితే తనకు అవకాశం వచ్చినప్పటికీ తన పాత్రను మొత్తం తీసేసిన తానేమి బాధపడలేదు. ఎందుకంటే ఈ సినిమాలో నా పాత్ర లేకపోయినా నాకు ఎంతో మంచి గుర్తింపు లభించిందని తెలిపారు. మీరు బాహుబలి 2 లో నటిస్తున్నారా అంటూ చాలామంది నన్ను అడిగారు .ఇలా ఈ సినిమాలో నా పాత్ర కనిపించకపోయినా, నటించానని చాలామందికి తెలుసు తద్వారా నాకు మంచి గుర్తింపు లభించిందని అజయ్ ఘోష్ తెలియజేశారు. ఒక సినిమాలో అవకాశం కల్పించి సినిమా ప్రసారమయ్యే సమయానికి నా పాత్ర లేకపోతే నేను ఏమాత్రం బాధపడనని అజయ్ తెలిపారు.
కోటా శ్రీనివాసరావు గారు నాకు స్ఫూర్తి..
కోటా శ్రీనివాసరావు స్ఫూర్తి
సాధారణంగా ఎంతో మంది నటీనటులు నటించిన పాత్రలు కొన్ని సందర్భాలలో తప్పనిసరి పరిస్థితులలో ఎడిటింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తమకు గుర్తింపు లేకుండా పోతుందని ఆవేదన చెందుతుంటారు కానీ తనకు అలాంటి బాధలేదని అజయ్ ఘోష్ తెలిపారు. ఇక సినిమా ఇండస్ట్రీలో తనకు మాత్రం ఒక కల ఉందని అది నెరవేర్చుకోవాలని ఈయన తెలిపారు. కోటా శ్రీనివాసరావు గారు తనకు స్ఫూర్తి అని తెలిపారు. ఆయన సినిమాలో నటిస్తున్నారు అంటే ఆయన కనపడరని ఆయన నటిస్తున్న పాత్ర మాత్రమే కనపడుతుందని తెలిపారు. అలా నేను కూడా నటించాలని కోరుకుంటున్నాను అంటూ అజయ్ ఘోష్ ఈ సందర్భంగా బాహుబలి 2 సినిమాలో తన పాత్రను తొలగించడం గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అజయ్ ఘోష్ తన కెరీర్ గురించి, బాహుబలి 2 అనుభవం గురించి పంచుకున్నారు. ఆయన కోటా శ్రీనివాసరావు గారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.


