|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్-త్రిష పెళ్లిపై బాలీవుడ్ క్వీన్ షాకింగ్ ఆఫర్: మెహందీలో డ్యాన్స్ చేస్తా!

Published: 09-05-2026, 6:30 PM
విజయ్-త్రిష పెళ్లిపై బాలీవుడ్ క్వీన్ షాకింగ్ ఆఫర్: మెహందీలో డ్యాన్స్ చేస్తా!
  • రాఖీ సావంత్ విజయ్-త్రిష పెళ్లి చేసుకుంటే మెహందీలో డ్యాన్స్ చేస్తానని ప్రకటించింది.
  • విజయ్, త్రిషల కాంబినేషన్ ‘గిల్లి’ నుండి ‘లియో’ వరకు కొనసాగింది.
  • వీరి మధ్య రియల్ లైఫ్ రిలేషన్‌షిప్ ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
  • రాఖీ వ్యాఖ్యలు, విజయ్ వ్యక్తిగత రూమర్స్‌తో కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.

విజయ్-త్రిష పెళ్లిపై బాలీవుడ్ క్వీన్ రాఖీ సావంత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. వారు వివాహం చేసుకుంటే మెహందీ వేడుకలో డ్యాన్స్ చేస్తానని ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. ఈ వార్త కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వారి రిలేషన్‌షిప్‌పై వస్తున్న ఊహాగానాలకు ఇది మరింత ఆజ్యం పోసింది.

రాఖీ సావంత్ సంచలన ఆఫర్

Vijay Trisha : సినిమాల్లో విజయ్ తో కలిసి స్టెప్పులేసే అవకాశం రాలేదు.కనీసం విజయ్ త్రిష పెళ్ళి చేసుకుంటే ఆ మొహందీ వేడుకల్లో అయినా డాన్స్ చేసి సంతోషపడతా అంటుంది బాలీవుడ్ డ్రామా క్వీన్ రాఖీ సావంత్.ఎప్పుడూ ఎదో ఒక సెన్సేషన్ కామెంట్ చేసే ఈ హాటీ బ్యూటీ ఫోకస్ ఇపుడు దళపతి విజయ్ మీద పడటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపొయింది.

విజయ్-త్రిషలు పెళ్లి చేసుకుంటే..

రాఖీ సావంత్, విజయ్-త్రిషల రిలేషన్ షిప్ గురించి మాట్లాడుతూ “త్రిష సినిమాలు మొదలెట్టినప్పటి నుండి నాకు తెలుసు. తను ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరింది,ఇక దళపతి విజయ్ అంటే నాకు ఎంతో ఇష్టం. ఆయనతో కలిసి ఒక్క పాటకైనా స్టెప్పులు వేయాలని ఎన్నో కలలు కన్నాను, కానీ ఆ అవకాశం రాలేదు. ఒకవేళ విజయ్-త్రిషలు పెళ్లి చేసుకుంటే.. ఆ మెహందీ వేడుకలో అయినా డ్యాన్స్ చేస్తాను. ఆ ఇద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో జంటగా చూడాలని ఉంది” అంటూ అసలు విషయం చెప్పుకొచ్చింది.

రీల్ లైఫ్ లోని ప్రేమాయణం రియల్ లైఫ్ లో కూడా

విజయ్-త్రిషల రీల్ టు రియల్ ప్రయాణం

ఇక విజయ్ – త్రిషల కాంబినేషన్ విషయానికి వస్తే గిల్లి (2004)తో మొదలైన వారి ప్రయాణం కురువి (2008)లియో (2023)సినిమాలతో కంటిన్యూ అయిన సంగతి తెల్సిందే.అలా రీల్ లైఫ్ లోని ప్రేమాయణం రియల్ లైఫ్ లో కూడా కంటిన్యూ అయిందని,ఇక వీరి మధ్య ఏదో ఉందంటూ నెట్టింట గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి.ఈ క్రమంలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే డాన్స్ చేస్తానంటూ ఎంట్రీ ఇచ్చింది రాఖీ సావంత్.

‘మొహబ్బత్ హై మిర్చి’ పాటతో ఓవర్ నైట్ స్టార్

ఇక రాఖీ సావంత్ సినిమాల విషయానికి వస్తే మెయిన్ హూ నా (2004)మస్తీ (2004)దిల్ బోలే హడిప్పా (2009)చురా లియా హై తుమ్నే (2003)సినిమాలతో మంచి పేరే తెచ్చుకుంది,ముఖ్యంగా ‘మొహబ్బత్ హై మిర్చి’ పాటతో ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది.క్రేజీ 4 (2008)లోని ‘దేఖ్తా హై తూ క్యా’ అనే పాపులర్ ఐటమ్ సాంగ్‌లో తళుక్కుమన్న రాఖీ ఈమధ్యే మస్త్ మే రహనే కా (2023)అనే సినిమాలో కనిపించిన సంగతి తెల్సిందే.

కోలీవుడ్‌లో హాట్ టాపిక్

ఇపుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్‌

అయితే విజయ్ సీయం సీటు ఎక్కేందుకు అష్టకష్టాలు పడుతుంటే ,రాఖీ సావంత్ మాత్రం విజయ్ – త్రిష లు పెళ్లి చేసుకుంటే డాన్స్ చేస్తానని కామెంట్స్ చేయడం ఇపుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారింది. అసలే విజయ్ తన భార్య సంగీతతో విడిపోయారనే రూమర్స్ తెగ సర్క్యులేట్ అవుతున్నాయ్.. దీనికి తోడు త్రిష తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫోటోలు ఈ రూమర్లకు మంచి బూస్టప్ ఇస్తున్నాయ్ .

చూడాలి మరి బిగ్ బాస్ వంటి షోలలో పాల్గొని, బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు అన్నింట్లో వేలు పెట్టే ఈ అమ్మడి కామెంట్స్ పై ఎవరైనా రియాక్ట్ అవుతారేమో !

రాఖీ సావంత్ వ్యాఖ్యలు విజయ్-త్రిషల బంధంపై చర్చను మరింత పెంచాయి. ఈ హాట్ టాపిక్ కోలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. వారి పెళ్లి వార్తలపై స్పష్టత కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.