|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అఖండ-2లో పెద్దయ్యాక బాలయ్య కూతురిగా నటించింది ఎవరో తెలుసా? ఈమెను గుర్తుపట్టారా?

Updated: 30-11-2025, 12:24 AM
అఖండ-2లో పెద్దయ్యాక బాలయ్య కూతురిగా నటించింది ఎవరో తెలుసా? ఈమెను గుర్తుపట్టారా?
  • అఖండ-2 చిత్రం డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
  • ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటీనటులు సందడి చేయగా, హర్షాలీ మల్హోత్రా ఆకట్టుకుంది.
  • బాలయ్య పెద్ద కూతురు పాత్రలో బాలీవుడ్ నటి హర్షాలీ మల్హోత్రా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.
  • హర్షాలీ ‘భజరంగి భాయ్ జాన్’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి గుర్తింపు పొందింది.

అఖండ-2 చిత్రం డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. బాలయ్య కూతురిగా నటించిన బాలీవుడ్ నటి హర్షాలీ మల్హోత్రా టాలీవుడ్‌కు పరిచయమవుతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆమె అందరినీ ఆకట్టుకుంది.

అఖండ-2: అంచనాలు, విడుదల తేదీ

అఖండ-2 తాండవం కోసం బాలయ్య అభిమానులు, నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రియులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. బోయపాటి శ్రీను డైరెక్షన్లో అఖండ సినిమాకు సీక్వెల్ గా రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. శుక్రవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా.. నటీనటులు సందడి చేశారు. అఖండ-2లో బాలయ్య సరసన సంయుక్త మీనన్ నటించినట్లు ట్రైలర్లో చూపించారు. అలాగే అఖండలో బాలయ్యకు కూతురు ఉండగా.. ఆమె పెద్దయ్యాక ఎలా ఉంటుందనేది కూడా ట్రైలర్లో చూపించారు. అయితే ఆ ముఖాన్ని ఇంతవరకూ తెలుగు ప్రేక్షకులు ఎక్కడా చూసింది లేదు.

అఖండ-2 తాండవంలో బాలయ్య కూతురిగా నటించింది హర్షాలీ మల్హోత్రా. ఈమె బాలీవుడ్ నటి. భజరంగి భాయ్ జాన్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన హర్షాలీ.. అఖండ-2తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో హర్షాలీ తన అందంతో, అమాయకమైన చూపులతో అందరినీ మైమరపించింది. ఇక సినిమా రిలీజయ్యాక మన తెలుగు కుర్రాళ్లంతా ఈ బాలీవుడ్ భామను వైరల్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

బాలీవుడ్ నుండి టాలీవుడ్ కు హర్షాలీ ప్రస్థానం

అఖండ-2తో టాలీవుడ్‌లో అడుగుపెడుతున్న హర్షాలీ మల్హోత్రా భవిష్యత్తుపై అంచనాలున్నాయి. ఆమె నటన, అందం సినిమాకు మరింత ఆకర్షణగా నిలవనున్నాయి. తెలుగు ప్రేక్షకులు ఈ కొత్త నటిని ఎలా ఆదరిస్తారో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.