|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Akhanda 2 : బాలయ్యకు షాక్ ఇచ్చిన ఆడియన్స్.. అఖండ2కు రెస్పాన్స్ తగ్గడానికి కారణాలు ఇవే

Published: 12-12-2025, 12:48 AM
Akhanda 2 : బాలయ్యకు షాక్ ఇచ్చిన ఆడియన్స్.. అఖండ2కు రెస్పాన్స్ తగ్గడానికి కారణాలు ఇవే
  • బాలయ్య అఖండ 2 సినిమా థియేటర్లలోకి వచ్చి నిరాశపరిచిన స్పందన.
  • విడుదల తేదీపై స్పష్టత లేకపోవడం ప్రధాన కారణాల్లో ఒకటి.
  • తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత వల్ల మార్నింగ్ షోలకు ప్రేక్షకులు తగ్గారు.
  • తొలి రోజు వసూళ్లు తగ్గడంతో డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చెందుతున్నారు.

నందమూరి బాలయ్య నటించిన అఖండ 2 చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలైంది. అయితే సినిమాకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. విడుదల తేదీపై స్పష్టత లేకపోవడం, చలి తీవ్రత వంటి కారణాలతో తొలిరోజు వసూళ్లు మందగించాయి.

అఖండ 2 విడుదలకు ముందున్న గందరగోళం

Akhanda 2: నందమూరి అభిమానులు ఎప్పుడు ఎప్పుడు అని ఎదురుచూస్తున్న బాలయ్య అఖండ 2 మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. నిన్న ప్రీమియర్ షోలు పడ్డాయి. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో సినిమా భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చేసింది.. గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ అఖండ కు సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కింది.. డిసెంబర్ 5 న సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల సినిమా పోస్ట్ పోన్ అయ్యింది. మొత్తానికి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయింది.. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన సరే.. అఖండ 2 కు గండాలు వీడలేదు.. ముందు విడుదలకు అడ్డంకి ఏర్పడింది.. ఇప్పుడేమో ఆడియన్స్ వల్ల పెద్ద షాక్ తగిలింది. ఈ సినిమాకు థియేటర్లలో రెస్పాన్స్ దారుణంగా ఉందని తెలుస్తుంది.. అఖండ 2 కు రెస్పాన్స్ తగ్గడానికి ముఖ్యకారణాలు ఏవో ఒకసారి తెలుసుకుందాం..

నందమూరి హీరో బాలయ్య సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయంటే ఆ హంగామా వేరే లెవెల్ లో ఉంటుంది.. ఆయన అభిమానులతో పాటుగా, సినీ అభిమానులు సైతం సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. గతంలో వచ్చిన ప్రతి సినిమాకు మొదటి రోజు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. కానీ అఖండ 2 పరిస్థితి దారుణంగా మారింది. నిజానికి మొదటి రోజు రెస్పాన్స్ తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయని తెలుస్తుంది. అందులో ఒకటి ఏ తేదీన సినిమా రిలీజ్ అవుతుందో క్లారిటీ లేకపోవడం.. డిసెంబర్ 5 న వాయిదా పడిన తర్వాత సినిమా విడుదల తేదీ గురించి జనాలకు క్లారిటీ లేదు. దానివల్ల సినిమా థియేటర్లలోకి వచ్చిందని తెలియలేదు. మరొకటి తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన చలి తీవ్రత. దీనివల్ల ప్రీమియర్ షోలకు, మార్నింగ్ షోలకు జనాలు ఎక్కువగా రాలేకపోయారు. దాంతో నిన్న ప్రీమియర్స్ షోకు థియేటర్లు చాలా చోట్ల ఖాళీగానే ఉన్నట్లు సమాచారం. ఈ రెండు కారణాల వల్ల అఖండ 2 ఫస్ట్ కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉందని డిస్ట్రిబ్యూటర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే ఈ వీకెండ్ కలెక్షన్స్ భారీగా పెరగాలి.. వీకెండ్ ఈ సినిమా కలెక్షన్స్ ఏ మాత్రం పెరుగుతాయో చూడాలి..

రెస్పాన్స్ తగ్గడానికి ప్రధాన కారణాలు

వసూళ్లపై చలి ప్రభావం, డిస్ట్రిబ్యూటర్ల ఆవేదన

టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, నందమూరి బాలయ్య కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్గా నిలిచాయి. ఇప్పుడు వచ్చిన నాలుగవ సినిమా కూడా అంతకుమించి వసూళ్లను రాబడుతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సినిమాను ముందుగా అనుకున్న డేట్ కు రాకపోవడంతో చాలామంది అభిమానులు నిరాశ పడ్డారు. ఇవాళ థియేటర్లలోకి సినిమా వచ్చినా సరే.. ఈ డేట్ పై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వకపోవడంతో ఎక్కువ మంది సినిమాను మొదటి రోజు చూడలేకపోయారు.. దాంతో మొదటి రోజు 55 కోట్లు వసూలు చేస్తుందనే అంచనా తప్పేలా ఉంది. చాలా వరకు థియేటర్లు మొదటి రోజే ఖాళీగా ఉండడంతో నందమూరి అభిమానులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. మొదటిరోజు బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ని రీచ్ అవుతుందా లేదా అని టెన్షన్ పడుతున్నారు.. అయితే ఈ వీకెండ్ సినిమాకు కలెక్షన్లు పెరిగే అవకాశం ఉన్నట్లు సినీ ట్రేడ్ పంతులు అంచనా వేస్తున్నారు. మరి మొదటివారం ఏ మాత్రం కలెక్షన్స్ పెరుగుతాయో చూడాలి..

మొదటిరోజు నిరాశపరిచిన స్పందన తర్వాత, ఈ వీకెండ్ అఖండ 2 వసూళ్లు పుంజుకోవాలని డిస్ట్రిబ్యూటర్లు ఆశిస్తున్నారు. రానున్న రోజుల్లో సినిమా ప్రదర్శన ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.