
📌 Key Points
- ‘అఖండ 2’ డిసెంబర్ 12న రిలీజ్, బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్‌తో రన్ అవుతోంది.
- బాలకృష్ణ, బోయపాటికే ‘అఖండ 2’ విజయ క్రెడిట్ దక్కుతుందని థమన్ అభిప్రాయం.
- సనాతన ధర్మాన్ని కమర్షియల్‌గా చెప్పడం బాలయ్య, బోయపాటి గొప్పతనం.
- ‘అఖండ 2’ సంగీతం తన కెరీర్‌లోనే పెద్ద సవాలుగా నిలిచిందని థమన్ వెల్లడి.
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన ‘అఖండ 2’ ఘనవిజయం సాధించింది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మీడియాతో మాట్లాడుతూ, సినిమా బ్లాక్‌బస్టర్ క్రెడిట్ బాలయ్య, బోయపాటికే దక్కుతుందని స్పష్టం చేశారు. సంగీతం వెనుక తన కృషి, సవాళ్లను వివరించారు.
అఖండ 2 విజయం: థమన్ విశ్లేషణ
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను అఖండ భారత్ బ్లాక్ బస్టర్ ‘అఖండ 2: ది తాండవం. ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. ఎం తేజస్విని నందమూరి సమర్పించారు. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
కంగ్రాట్స్ తమన్ గారు నెలకో హిట్ కొడుతున్నారు.. 2025 ని చాలా గ్రాండ్ గా ముగిస్తున్నారు?
-థాంక్యూ అండి. సినిమా బాగుంటే అన్ని బాగుంటాయి. మ్యూజిక్ అనేది ఒక క్రాఫ్ట్. మన క్రాఫ్ట్ ని మనం బెస్ట్ గా చేయాలి. డాకు మహారాజ్, గేమ్ చేంజెర్, ఓజి.. అఖండ2.. రాబోతున్న రాజాసాబ్ ఇవన్నీ కూడా వరుసగా కలిసి వచ్చాయి.
అఖండ2 కి ఇంత పెద్ద విజయాన్ని మీరు ఊహించారా?
-మనం స్క్రిప్ట్ అనుకున్నప్పుడే కొన్ని హై మూమెంట్స్ అనుకుంటాం. బోయపాటి గారు ఆషామాసి డైరెక్టర్ కాదు. కమర్షియల్ సినిమా నమ్మించేలా తీయడం నిలబెట్టడం చాలా గొప్ప విషయం. అందులోనూ సనాతన ధర్మం కంటెంట్ గా తీసుకుని దాన్ని కమర్షియల్ గా చెప్పడం, అందులోనూ బాలయ్య గారి లాంటి సూపర్ మాస్ ఎనర్జిటిక్ స్టార్ తో చేయడం మామూలు విషయం కాదు.
బాలయ్య-బోయపాటిదే క్రెడిట్: థమన్ అభిప్రాయం
-అఖండపాత్ర అందరికీ సర్ప్రైజ్. నిజానికి అఖండలో అంత ఉంటుందని ఎవరూ అనుకోలేదు. సెకండ్ పార్ట్ కి వచ్చేసరికి మరింత -భారీ అంచనాలతో ప్రేక్షకులు వచ్చారు. సనాతన ధర్మాన్ని అద్భుతంగా చెప్పి కమర్షియల్ విజయాన్ని సాధించడం.. బాలయ్య గారికి, బోయపాటి గారికి ఆ క్రెడిట్ దక్కుతుంది.
మ్యూజికల్ గా మీకు ఛాలెంజింగ్ గా అనిపించింది ఏమిటి?
-నిజానికి అండ నాకు చాలా ఛాలెంజింగ్ గా అనిపించింది. బోయపాటి గారికి నాకు రెండు నెలలు సమయం కావాలని అడిగాను ఒక్క రీల్ చేసి చూపించాను. ఆయనకు చాలా నచ్చింది. అప్పుడు నాకున్న బడ్జెట్ ని మార్చి, నాకు మరింత సమయాన్ని ఇచ్చి ఎంతగానో సపోర్ట్ చేయించి చేసి మ్యూజిక్ చేయించారు. అఖండకి అయిన నాకు వెన్నుముకలాగా నిలిచారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టాలనే తాపత్రయంతో వర్క్ చేశాను. అఖండ మ్యూజిక్ అందరూ సర్ప్రైజింగ్ గా విన్నారు.
-ఇప్పుడు అఖండ2 లో ఇంకా ఎంత కొత్తగా చేయొచ్చు అని ఆలోచించా. అందులోనూ తాండవం అని పేరు పెట్టారు. ఆడియన్స్ ని ఎలా ట్రాన్స్ లోకి తీసుకువెళ్లాలి అని ఆలోచన చేస్తూ చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సినిమా చేశాం. ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయడానికి 73 రోజులు పట్టింది. అందులో ఒక 20 రోజులు శివుని మంత్రాలు ఎంత కొత్తగా చేయాలి అనే దానికి ఒక 20 రోజులు ఎక్సర్సైజ్ చేశాం. తర్వాత 40 రోజులు ఇన్స్ట్రుమెంట్, రికార్డింగ్ వర్క్ చేసాం.
-జాజికాయ సాంగ్ తప్పితే సినిమాలోని ఎనిమిది పాటలు కూడా ఆ 70 రోజుల్లో చేసినవే. అఖండ మ్యూజిక్ బ్రెయిన్ కి చాలా మంచి ఎక్సర్సైజ్. శివుడికి సినిమా చేస్తున్నప్పుడు మన మెదడు చాలా శుద్ధి అవుతుంది.
సంగీతానికి సవాళ్లు: థమన్ ప్రయాణం
-జనరల్ గా బోయపాటి గారి సినిమాలో ఇంటర్వెల్ క్లైమాక్స్ చేయడం చాలా కష్టం. మొదటి రీల్ నుంచి నాకు చాలెంజ్ మొదలైంది. అష్టసిద్ధి కుంభమేళా ఇంటర్వెల్, ఆది గారి ఎపిసోడ్, హనుమంతుడు ఎపిసోడ్ లాస్ట్ లో అవెంజర్స్ లాంటి క్లైమాక్స్ ఇవన్నీ చాలా హార్డ్ వర్క్ తో కూడుకున్నవి.
-బోయపాటి గారి సినిమాలన్నీ ఒక రీల్ కు మించి మరొకటి ఉంటుంది. ఆయన ఎనర్జీని పట్టుకోవడం చాలా కష్టం. మా టీం చాలా సపోర్ట్ చేశారు
– 14 రీల్స్ నిర్మాతలు బోయపాటి గారు అందరూ చాలా సపోర్ట్ చేశారు. ఇక బాలయ్య గారి సపోర్ట్ గురించి అడగక్కర్లేదు ఆయనను చూస్తే వేరే లెవెల్ ఎనర్జీ ఉంటుంది. ఆయన బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉంటాయి. ఒక్కొక్క రీల్ చేసి ఆయన్ని స్టూడియోకి తీసుకొచ్చి వినిపించడం చాలా అద్భుతంగా జరిగిన ప్రయాణం.
ఈ సినిమా కోసం ఎఐ టూల్స్ ని వాడడం జరిగిందా?
-లేదండి. మేము టెక్నాలజీని నమ్మలేదు. శివాలజిని నమ్మాం(నవ్వుతూ)
‘అఖండ 2’తో బాలయ్య-బోయపాటి మరోసారి తమ మార్క్ చూపించారు. తమన్ సంగీతం కూడా సినిమా విజయానికి కీలకమైందని, సనాతన ధర్మాన్ని కమర్షియల్‌గా అందించడంలో చిత్ర బృందం గొప్ప విజయం సాధించిందని చెప్పవచ్చు.


