|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నాకు తెలియకుండానే అఖండ-2 జీవో.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Published: 12-12-2025, 9:09 AM
నాకు తెలియకుండానే అఖండ-2 జీవో.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
  • మంత్రి కోమటిరెడ్డికి తెలియకుండానే ‘అఖండ-2’ టికెట్ల ధరల పెంపు జీవో విడుదలైంది.
  • ఇకపై సినిమా టికెట్ల ధరలు పెంచబోమని, పేదల కోసమే తమ నిర్ణయాలు అని మంత్రి స్పష్టం చేశారు.
  • టికెట్ల ధరల పెంపు జీవోను హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేయగా, డివిజన్ బెంచ్ స్టే విధించింది.
  • హీరోలకు వందల కోట్ల రెమ్యూనరేషన్లు ఎవరు ఇవ్వమన్నారని మంత్రి ప్రశ్నించారు.

నందమూరి బాలకృష్ణ ‘అఖండ-2’ సినిమా టికెట్ల ధరల పెంపు వివాదం తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. తనకు తెలియకుండానే జీవో వచ్చిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై టికెట్ల ధరలు పెంచేది లేదని స్పష్టం చేస్తూ, హైకోర్టులో ఈ జీవోపై విచారణ కొనసాగుతోంది.

మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

నందమూరి బాలకృష్ణ (Balakrishna) నటించిన ‘అఖండ-2: తాండవం’ (Akhanda 2) మూవీ టికెట్ల ధరల పెంపు, ప్రీమియర్ షోల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ సినిమా టికెట్ల ధరల పెంపుపై సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) తీవ్రంగా స్పందించారు. తనకు తెలియకుండానే టికెట్ల ధరలపెంపుకు సంబంధించిన జీవో విడుదలైందని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. టికెట్ల రేట్లు పెంచొద్దని గతంలోనే అనుకున్నామని ఈ విషయాన్ని అసెంబ్లీలోనే చెప్పామన్నారు. కానీ ఈసారి పొరపాటు జరిగిందన్నారు. ఇవాళ ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన మంత్రి.. గత రాత్రే హోం సెక్రటరీతో తాను మాట్లాడానని ఇకపై టికెట్ల ధరల పెంపు, ప్రీమియర్ షోల విషయంలో ఎలాంటి అప్లికేషన్లు తీసుకోవద్దని, నా దృష్టికి తీసుకురాకుండా ఎవరూ ధరలను పెంచవద్దని ఆదేశాలు ఇచ్చానన్నారు. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి సైతం తీసుకువెళ్లామన్నారు.

ఇకపై సినిమా టికెట్ల ధరలు పెంచేది లేదని నిర్మాతలు, డైరెక్టర్లు ఎవరూ టికెట్ల ధరలు పెంచాలని మా వద్దకు రావొద్దన్నారు. కుటుంబం సినిమాలు చూడాలంటే టికెట్ల ధరలు తగ్గాలని అన్నారు. ఇది ఇందిరమ్మ ప్రభుత్వం పేదల కోసమే మా నిర్ణయాలు ఉంటాన్నారు. హీరోలకు వందల కోట్ల రెమ్యూనరేషన్లు ఎవరు ఇవ్వమన్నారని ప్రశ్నించారు. అయితే అఖండ-2 సినిమా టికెట్ల ధరలు పెంపు, ప్రీమియర్ షోలకు అనుమతి ఇస్తు తెలంగాణ ప్రభుత్వం జీవో ఇచ్చింది. అయితే ఈ జీవోపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా దీనిపై విచారణ జరిపిన సింగిల్ బెంచ్ ధర్మాసనం ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. సింగిల్ బెంచ్ తీర్పుపై చిత్ర నిర్మాణ సంస్థ డివిజన్ బెంచ్‍కు అప్పీల్ చేసుకుంది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై ఈనెల 14 వరకు స్టే విధిస్తూ తదుపరి విచారణ ఈ నెల 15కు వాయిదా వేసింది.

టికెట్ల ధరల పెంపుపై ప్రభుత్వ ఆదేశాలు

అఖండ-2 జీవోపై హైకోర్టు విచారణ

మొత్తంగా, ‘అఖండ-2’ టికెట్ల ధరల వివాదంపై ప్రభుత్వం, న్యాయస్థానం మధ్య ఉత్కంఠ కొనసాగుతోంది. మంత్రి వ్యాఖ్యలతో భవిష్యత్తులో సినిమా టికెట్ల ధరల పెంపునకు కళ్లెం పడే అవకాశం ఉంది. ఈ అంశంపై తుది తీర్పు కోసం వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.