|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Akhanda 2 : ఇండస్ట్రీలోనే అఖండ 2 సినిమాకు నెగిటివిటీ, బయట వాళ్ళ పరిస్థితి ఇదే

Published: 12-12-2025, 11:08 AM
Akhanda 2 : ఇండస్ట్రీలోనే అఖండ 2 సినిమాకు నెగిటివిటీ, బయట వాళ్ళ పరిస్థితి ఇదే
  • అఖండ 2 సినిమాకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుండే మిశ్రమ స్పందన, నెగటివిటీ.
  • ప్రేక్షకులు సినిమాను ఇష్టపడుతున్నా, ఇండస్ట్రీలోని ప్రముఖులు మిశ్రమ స్పందన ఇస్తున్నారు.
  • నిర్మాత కూడా ఈ విషయంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
  • బోయపాటి శ్రీను సినిమాలు నమ్మశక్యం కాని వాటిని కూడా నమ్మించేలా ఉంటాయి.

అఖండ 2 సినిమాపై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి మిశ్రమ స్పందన, నెగటివిటీ వ్యక్తమవుతోంది. ప్రేక్షకులు సినిమాను ఇష్టపడుతున్నప్పటికీ, ఇండస్ట్రీ వర్గాలు, రివ్యూ రైటర్లు భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితిపై నిర్మాత కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

అఖండ 2కు ఇండస్ట్రీ నుండి మిశ్రమ స్పందన

Akhanda 2 : సమాజంలో కొన్ని సామెతలు నిత్యం వినిపిస్తూ ఉంటాయి. అందులో బాగా వినిపించే సామెత ఆడదానికి ఆడదే శత్రువు అనేది. కానీ ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితులు చూస్తే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తెలుగు సినిమాకి శత్రువుగా మారింది అని అర్థమవుతుంది. ప్రేక్షకులు అందరూ కూడా విపరీతంగా సినిమాను ఇష్టపడుతున్న కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని చాలామంది ప్రముఖులు, చాలామంది రివ్యూ రైటర్లు అఖండ సినిమాకి మిశ్రమ స్పందన ఇస్తున్నారు. ఈ విషయాన్ని కేవలం బిగ్ టివి మాత్రమే ప్రస్తావించకుండా ఏకంగా నిర్మాత ప్రస్తావించాడు అనే ఉద్దేశంతోనే చెబుతున్నాం.

ఈ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ అఖండ 2 సినిమా చిత్ర యూనిట్ నిర్వహించింది. కొన్ని సినిమాలకు మిశ్రమ స్పందన లభించడం అనేది కామన్ గా జరుగుతూ ఉంటుంది. అలానే ఈ సినిమాకి కూడా కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ మిక్స్డ్ టాక్ అనేది ఇండస్ట్రీ నుంచి రావడం కొంచెం ఆశ్చర్యంకరంగా అనిపిస్తుంది. ఇదే విషయాన్ని నిర్మాత కూడా వెల్లడించడం యాదృచ్ఛికం.

బోయపాటి శ్రీను సినిమాల గురించి ప్రత్యేకించి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. నమ్మశక్యం కానివి కూడా నమ్మించేలా చేయడమే అతని సినిమాలలో ఉన్న ప్రత్యేకత. అయితే అది అన్నిసార్లు కూడా వర్కౌట్ అవుతుంది అని చెప్పలేం. కొన్నిసార్లు ప్రేక్షకుడు ఎమోషన్ కు కనెక్ట్ అయినప్పుడు ఏదైనా నడుస్తుంది. ఒకసారి ఎమోషన్ కి కనెక్ట్ కాలేకపోతే ఏం చేసినా కూడా అతిగా అనిపిస్తుంది.

బోయపాటి శ్రీను సినిమాల శైలి

బోయపాటి శ్రీను సినిమాల్లో ఎక్కువగా ఇదే జరుగుతుంది. అయితే బోయపాటి శ్రీను బాలకృష్ణతో చేసే సినిమాలు కొంచెం ప్రత్యేక అనే చెప్పాలి. అఖండ సినిమా విషయానికొస్తే మిశ్రమ స్పందన కేవలం ఇండస్ట్రీ నుంచి మాత్రమే కాకుండా, సాధారణ ప్రేక్షకుల నుంచి కూడా లభిస్తుంది. ఇదివరకే వీళ్ళ కాంబినేషన్లో మూడు హిట్ సినిమాలు ఉండటం వలన అంచనాలు ఎక్కువగా పెరగడం వలన, ఈ సినిమా ఊహించిన స్థాయిలో లేకపోవడంతో కొంతమేరకు నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

సినిమా గురించి కొంతమేరకు అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే కొన్ని సినిమాల్లో లాజిక్స్ వెతుకుతూ ఉంటారు. కానీ ఒక్కసారిగా సినిమాకు కంప్లీట్ గా కనెక్ట్ అయిన తర్వాత లాజిక్స్ మర్చిపోయి సినిమాను ఎంజాయ్ చేయడం మొదలుపెడతారు. అఖండ సినిమా విషయంలో మాత్రం అదే జరిగింది.

ప్రేక్షకుల అంచనాలు – సినిమా రిజల్ట్

కొంత మేరకు ప్రేక్షకులకు ఈ సినిమా బాగానే వర్కౌట్ అయింది. కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన చాలామందికి ఈ సినిమా ఊహించిన స్థాయిలో హై ఇవ్వలేదు. దీనికి కారణం వాళ్ళు లాజిక్స్ కూడా వెతకడం కావచ్చు. అందుకే నిర్మాతలు కూడా దీనిని ఉద్దేశిస్తూ ఇండస్ట్రీ నుంచి మాత్రమే మిశ్రమ స్పందన లభిస్తుంది అనే కామెంట్ చేశారు. ఏదేమైనా గత మూడు సినిమాలకి వచ్చినంత యునానిమస్ పాజిటివ్ టాక్ మాత్రం ఏ సినిమాకి రాలేదు.

మొత్తంగా, అఖండ 2 సినిమాకు ఇండస్ట్రీ నుండి మిశ్రమ స్పందన లభించినా, కొంతమంది ప్రేక్షకులు మాత్రం సినిమాకు కనెక్ట్ అయ్యారు. భారీ అంచనాలకు తగ్గట్టు సినిమా లేకపోవడం కూడా నెగటివ్ కామెంట్స్‌కు ఒక కారణం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.