
📌 Key Points
- అఖండ 2 సినిమా భారీ అంచనాలతో థియేటర్లలోకి విడుదలైంది.
- కొన్ని థియేటర్లలో అఖండ 2 బదులుగా ప్రభాస్ నటించిన రాజా సాబ్ ప్లే అయింది.
- పొరపాటున వేరే సినిమా ప్రదర్శితం కావడంతో బాలయ్య అభిమానులు థియేటర్లలో నిరసన తెలిపారు.
- గందరగోళం తర్వాత అఖండ 2 సినిమాను ప్రదర్శించినట్లు తెలుస్తుంది.
నందమూరి బాలయ్య నటించిన అఖండ 2 సినిమా భారీ అంచనాలతో విడుదలైంది. అయితే కొన్ని థియేటర్లలో ఊహించని సంఘటన జరిగింది. అఖండ 2 బదులుగా ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమా ప్లే కావడంతో ప్రేక్షకులు, ముఖ్యంగా బాలయ్య అభిమానులు షాకయ్యారు. ఈ సంఘటనతో థియేటర్లలో గందరగోళం నెలకొంది.
అఖండ 2 రిలీజ్, ఆడియన్స్ రెస్పాన్స్
Akhanda 2 Prabhas : టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలయ్య నటించిన అఖండ 2 మూవీ ఇవాళ భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చేసింది. గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో ఈ సినిమాపై చర్చలు జరుగుతున్నాయి.. అఖండ 2 ముందుగా డిసెంబర్ 5 న థియేటర్లలోకి రావాల్సి ఉంది.. కానీ ఫైనాన్షియల్ కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది. ఇవాళ గ్రాండ్గా థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చేసింది.. నందమూరి అభిమానులు ఈ సినిమాను చూసేందుకు థియేటర్ల వద్ద బారులు తీరారు. మొత్తానికి మొదటి షో బొమ్మ పడిపోయింది. పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. అయితే చాలా చోట్ల చలి కారణంగా థియేటర్లు ఖాళీగానే ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. అయితే ఇప్పుడు అఖండ 2 లో ప్రభాస్ కనిపించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదేంటి నిజమా అనే సందేహం కూడా కలుగుతుంది కదూ.. అవును మీరు విన్నది అక్షరాల నిజం.. అసలు మ్యాటర్ ఏంటో కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
బాలయ్య సినిమాలో వేరే హీరో ఉండటం ఏంటి? అందులోనూ ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరో ఈ సినిమాలో నటించాడా? డైరెక్టర్ ఎక్కడ ఈ విషయాన్ని చెప్పలేదే అనే ప్రశ్నలు మెదడును తొలిచివేస్తున్నాయి కదూ.. మీరు విన్నది నిజమే..? కానీ అబద్దం కూడా ఉంది. ఏంటి ఈ కన్ఫ్యూషన్ అనుకుంటున్నారా..? నిజానికి బాలయ్య సినిమాలో ప్రభాస్ నటించిన లేదు. అఖండ 2 సినిమాను చూసేందుకు థియేటర్లకు వెళ్లిన అభిమానులకు థియేటర్లలో ప్రభాస్ కనిపించాడు. దాంతో అంతా షాక్ అయ్యారు. అఖండ 2 కి బదులుగా ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ మూవీ అక్కడ స్క్రీన్ మీద కనిపించింది. దాంతో థియేటర్లలో నందమూరి బాలయ్య అభిమానులు రచ్చ రచ్చ చేశారు. అందుకు సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొత్తానికి జనాల గోలతో అఖండ 2 సినిమాను వేసినట్లు తెలుస్తుంది. అదన్నమాట అక్కడ జరిగింది.
ప్రభాస్ సర్ప్రైజ్ వెనుక అసలు కథ
థియేటర్లలో అభిమానుల ఆగ్రహం, గందరగోళం
బోయపాటి శ్రీను సినిమాలంటే జనాల్లో ఒక ఊపు వస్తుంది.. అందులోనూ బాలయ్య నటించిన సినిమా అంటే ఇక మాటల్లో చెప్పనక్కర్లేదు.. డైలాగులతో భారీ యాక్షన్ సీన్లతో థియేటర్లు దద్దరిల్లిపోతాయి. ఈ సినిమాకి కూడా అలాంటి రెస్పాన్స్ వస్తుంది.. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన అఖండ 2 మొదటి షోకి జనాలు ఎక్కువగా రాకపోయిన కూడా రెండో షోకి టికెట్స్ బుకింగ్ బాగానే జరిగినట్లు తెలుస్తుంది. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ కూడా మంచి రెస్పాన్స్ని అందుకోవడంతో సినిమాకు మౌత్ టాక్ కూడా బాగానే వినిపిస్తుంది.. దాంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. వీకెండ్ కావడంతో కలెక్షన్లు భారీగా వసూల్ అయ్యే అవకాశం కూడా ఉంది.. ఈ మూవీతో ఎలాంటి రికార్డులు బ్రేక్ చేస్తాడో చూడాలి.. ఇక ప్రభాస్ సినిమాలు విషయానికొస్తే.. ఆయన ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.. రాజాసాబ్ మూవీ వచ్చే ఏడాదికి సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది.
మొత్తంగా, అఖండ 2 రిలీజ్ రోజు ప్రభాస్ రాజా సాబ్ సినిమా ప్రదర్శనతో జరిగిన పొరపాటు అందరినీ ఆశ్చర్యపరిచింది. థియేటర్ల గందరగోళం తర్వాత సరైన సినిమా ప్రదర్శితమైనప్పటికీ, ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చనీయాంశంగా మారింది.


