|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Akhanda 2: అఖండ 2 లో శివుడి పాత్రలో నటించిన నటుడు ఎవరో తెలుసా?

Published: 13-12-2025, 4:48 AM
Akhanda 2: అఖండ 2 లో శివుడి పాత్రలో నటించిన నటుడు ఎవరో తెలుసా?
  • అఖండ 2 సినిమాలో శివుడి పాత్రలో బాలీవుడ్ నటుడు తరుణ్ కన్నా నటించారు.
  • తరుణ్ కన్నా గతంలో సుమారు నాలుగు ఐదు హిందీ టీవీ సీరియల్స్‌లో శివుడి పాత్రలు పోషించారు.
  • ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ఉత్తర భారత ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది.
  • అఖండ 2 చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.

బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో కీలకమైన శివుడి పాత్రలో ఎవరు నటించారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు తరుణ్ కన్నా ఈ పాత్రను పోషించి మెప్పించారు. ఆయన నటనకు మంచి స్పందన లభిస్తోంది.

అఖండ 2లో శివుడి పాత్రలో నటించినది ఎవరు?

Akhanda 2: బాలకృష్ణ (Balakrishna)హీరోగా నటించిన అఖండ 2(Akhanda 2) సినిమా ప్రస్తుతం థియేటర్లలో ప్రసారమవుతూ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. బోయపాటి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో శివుడి పాత్ర కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక ఈ సినిమా ప్రస్తుతం ప్రసారమవుతున్న నేపథ్యంలో శివుడి పాత్రలో నటించిన నటుడు ఎవరు అనే సందేహాలను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో శివుడి పాత్రలో నటించిన నటుడు ప్రముఖ బాలీవుడ్ నటుడు తరుణ్ కన్నా(Tarun Kanna) అని తెలుస్తుంది.

తరుణ్ కన్నా బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఈయన హిందీ సీరియల్స్ లో గతంలో శివుడి పాత్రలలో పోషించి మంచి ఆదరణ సొంతం చేసుకున్న నేపథ్యంలోనే అఖండ 2 సినిమాలో కూడా ఈయనని శివుడి పాత్ర కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. తరుణ్ కన్నా సంతోషిమా అనే సీరియల్ ల మొదటిసారి శివుడి పాత్రలో నటించారు. సుమారు నాలుగు ఐదు టీవీ సీరియల్స్ లో శివుడి పాత్రలో నటించిన నేపథ్యంలో ఈయన అఖండ 2 సినిమాలో శివుడి పాత్రను చాలా సునాయసంగా నటించారని, ఈయన నటన చూస్తుంటే సాక్షాత్తు ఆ పరమశివుడే వచ్చారేమో అనే భావన కూడా అభిమానులలో కలిగింది. అఖండ 2 సినిమాని బోయపాటి పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

తరుణ్ కన్నా బాలీవుడ్ నేపథ్యం

ఈ నేపథ్యంలోనే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలను కూడా ఈ సినిమాలో భాగం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో శివుడి పాత్రలో తరుణ్ కన్నా నటించడంతో నార్త్ ప్రేక్షకులకు ఈ సినిమా మరింత చేరువైనదని చెప్పాలి. ప్రస్తుతం ఈ సినిమా సౌత్ ఇండస్ట్రీతో పాటు నార్త్ ఇండస్ట్రీలో కూడా మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఈ సినిమా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టాయని తెలుస్తోంది. ప్రీమియర్ షోలతో పాటు మొదటి రోజు ఈ సినిమా ఏకంగా 59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టినట్టు చిత్ర బృందం అధికారక పోస్టర్ ద్వారా వెల్లడించారు.

అంచనాలను చేరుకోలేక పోయిన అఖండ 2?

పాన్ ఇండియా స్థాయిలో అఖండ 2 వసూళ్లు

ఇక ఈ సినిమాకు 14 ప్లస్ రీల్స్ బ్యానర్ పై రామ్ అచంట గోపి అచంట నిర్మాతలుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటించారు. ఒక పాత్రలో ఎమ్మెల్యేగా కనిపించగా మరొక పాత్రలో అఘోరాగా కనిపించారు. ఇలా బాలకృష్ణ అఘోరి పాత్ర ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటుంది అయితే ఈ పాత్ర నిడివి ఎక్కువ లేకపోయినా ప్రేక్షకులకు మాత్రం మంచి ఊపునిస్తుందని చెప్పాలి. అఖండ 2 బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో వచ్చిన నాలుగవ సినిమా కావటం విశేషం. అయితే ఇదివరకు సినిమాలతో పోలిస్తే ఈ సినిమాకు కలెక్షన్లు కాస్త తగ్గాయని తెలుస్తోంది. మరి మొదటి వీకెండ్ లో భాగంగా ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లను రాబడుతుందో తెలియాల్సి ఉంది.

తరుణ్ కన్నా నటన అఖండ 2 సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు భారీ వసూళ్లను సాధించి విజయపథంలో దూసుకుపోతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.