|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Akhil Akkineni: అఖిల్‌ అక్కినేని- జైనబ్‌ రిసెప్షన్‌: ఫోటోల్లో ఇది గమనించారా?

Published: 09-06-2025, 1:59 AM
Akhil Akkineni: అఖిల్‌ అక్కినేని- జైనబ్‌ రిసెప్షన్‌: ఫోటోల్లో ఇది గమనించారా?

అక్కినేని అఖిల్ మరియు జైనబ్ వివాహం తర్వాత గ్రాండ్‌గా జరిగిన రిసెప్షన్‌లో ఆసక్తికరమైన విషయం గమనించారు. అఖిల్ అన్ని ఫోటోల్లోనూ జైనబ్ చేతిని పట్టుకున్నాడు. ఈ జంట ప్రేమను చూసి అభిమానులు ఆనందిస్తున్నారు.

Key Points

1

అఖిల్-జైనబ్ రిసెప్షన్ ఘనంగా జరిగింది.

2

అన్ని ఫోటోల్లోనూ అఖిల్ జైనబ్ చేతిని పట్టుకున్నాడు.

4

జైనబ్ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె.

రిసెప్షన్‌ వైభవం

అక్కినేని ఇంట వరుస శుభకార్యాలు జరుగుతున్నాయి. గతేడాది చివర్లో నాగార్జున ( Nagarjuna Akkineni ) పెద్ద కుమారుడు నాగచైతన్య వివాహం శోభితతో జరిగింది. ఆరు నెలలు తిరిగేసరికి చిన్న కుమారుడు అఖిల్‌ పెళ్లి .. జైనబ్‌తో జరిపించాడు. ఈ రెండు కూడా ప్రేమ పెళ్లిళ్లు కావడం విశేషం. జూన్‌ 6న పెద్ద హడావుడి లేకుండా తన ఇంట్లోనే పెళ్లి జరిపించాడు నాగ్‌. కానీ రిసెప్షన్‌ మాత్రం గ్రాండ్‌గా ఏర్పాటు చేశాడు.

రెండు రోజుల గ్యాప్‌తో రిసెప్షన్‌ జూన్‌ 8న అన్నపూర్ణ స్టూడియోలో అంగరంగ వైభవంగా రిసెప్షన్‌ జరిగింది. మహేశ్‌బాబు, రామ్‌ చరణ్‌, నిఖిల్‌, సూర్య, యశ్‌, నాని, కిచ్చా సుదీప్‌, దిల్‌ రాజు, సుకుమార్‌, బుచ్చిబాబు.. ఇలా పలువురు సెలబ్రిటీలు ఈ ఫంక్షన్‌కు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే ఈ ఫోటోల్లో మీరో విషయం గమనించారా? అఖిల్‌ ( Akhil Akkineni ) దాదాపు అన్ని ఫోటోల్లోనూ జైనబ్‌ చేయి పట్టుకునే కనిపించాడు.

అఖిల్‌-జైనబ్ ప్రేమ

అన్ని ఫోటోల్లోనూ.. ఆమె చేతిని అస్సలు విడిచిపెట్టడం లేదు. సినీతారలే కాదు, సీఎం రేవంత్‌ రెడ్డి సహా పలువురు రాజకీయ నాయకులు వచ్చినప్పుడు కూడా భార్య చేతిని వదల్లేదు. అటు జైనబ్‌ కూడా అంతే..! ఇది చూసిన అభిమానులు ఈ కొత్త జంట జీవితాంతం సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తున్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆ చేయి వదలకూడదని చెప్తున్నారు. ఒక ఫోటోలో అయితే అఖిల్‌ అటు అత్త చేతిని, ఇటు భార్య చేతిని పట్టుకుని ఆనందంగా కనిపించాడు. డ్రెస్సింగ్‌ విషయానికి వస్తే కొట్టొచ్చినట్లు కనిపించే రంగుల జోలికి వెళ్లకుండా పెళ్లికి తెలుపు, రిసెప్షన్‌కు గోధుమ రంగు దుస్తులు ధరించారు.

ఎవరీ జైనబ్‌? ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రవ్జీ కూతురే జైనబ్‌. ఈమె సోదరుడు జైన్‌ రవ్జీ.. జెడ్‌ఆర్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి చైర్మన్‌గా, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నాడు. జైనబ్‌.. పెయింటింగ్‌ ఆర్టిస్ట్‌. అఖిల్‌ వయసు 31 ఏళ్లు కాగా ఈమె వయసు 39 ఏళ్లని తెలుస్తోంది.

హాజరైన ప్రముఖులు

అఖిల్ మరియు జైనబ్ జంట జీవితంలో సంతోషం, ప్రేమ నిండి ఉండాలని కోరుకుందాం. వారి చేతులు ఎప్పటికీ విడిపోకుండా ఉండాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.