
📌 Key Points
- అఖిల్ లెనిన్ సినిమా జూన్ 26న విడుదల కానుంది.
- ఈ చిత్రానికి మురళి కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహించారు.
- భాగ్యశ్రీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో సాగుతుంది.
- ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించిన ‘ఎట్టా ఎట్టా’ పాట విడుదలైంది.
అఖిల్ అక్కినేని నటించిన ‘లెనిన్’ చిత్రం జూన్ 26న విడుదల కానుంది. మురళి కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భాగ్యశ్రీ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుండి ‘ఎట్టా ఎట్టా’ అనే పాట విడుదలైంది.
లెనిన్ మూవీ విడుదల తేదీ ఖరారు
Lenin Movie: అఖిల్ అక్కినేని గత దశాబ్ద కాలం పైగా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నప్పటికీ ఇంతవరకు సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నారు. ఎన్నో విభిన్నమైన కథ చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ అఖిల్(Akhil) మాత్రం ఇండస్ట్రీలో సరైన సక్సెస్ లేక నిలదొక్కుకోలేకపోతున్నారు. చివరిగా ఏజెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఏ మాత్రం ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత లెనిన్(Lenin) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.
మురళి కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో అఖిల్, భాగ్యశ్రీ(Bhagya Shri) హీరో హీరోయిన్లతో ఈ సినిమా రాయలసీమ లవ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలవల్ల వాయిదా పడుతూ వస్తుంది. ఈ సినిమాని జూన్ 26వ తేదీ విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారకంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్లను కూడా మొదలుపెట్టారు. తాజాగా ఈ సినిమా నుంచి ఎట్టా ఎట్టా(Yetta Yetta Song) అంటూ సాగిపోయే పాటను విడుదల చేశారు. ఇదివరకే మొదటి పాట హే ఇన్నావా ఇన్నావా అంటూ సాగిపోయే పాటను విడుదల చేశారు.
‘ఎట్టా ఎట్టా’ పాట విడుదల చేసిన చిత్ర బృందం
మొదటి పాటకు ఎంతో మంచి ఆదరణ లభించిన నేపథ్యంలో తాజాగా రెండో పాటను విడుదల చేశారు. ఎస్ ఎస్ తమన్ సంగీత సారధ్యంలో భాస్కరభట్ల సాహిత్యం అందించిన ఈ పాట ఎంతో అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో భాగ్యశ్రీ పల్లెటూరి అమ్మాయి తరహాలో లంగా వోణీలో ఎంతో చూడముచ్చటగా కనిపించగా అఖిల్ మాస్ లుక్ మాత్రం అందరిని ఆకట్టుకుంటుంది.ఈ సినిమా మే 1వ తేదీని విడుదల కావాల్సి ఉండగా, ఏప్రిల్ 30వ తేదీ రామ్ చరణ్ పెద్ది సినిమా విడుదల కాబోతున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే పెద్ది కోసం అఖిల్ తన సినిమాని వాయిదా వేసుకుంటూ 26వ తేదీ విడుదలకు సిద్ధమయ్యారు.
ఇలా ఈ సినిమా విడుదల తేదీ వాయిదా వేసుకున్న తరువాత రామ్ చరణ్ పెద్ది సినిమా కూడా వాయిదా పడటం గమనార్హం. ఇక పెద్ది సినిమాని కూడా జూన్ నెలలోనే విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. మరి జూన్ నెలలో ఏ రోజున పెద్ది విడుదల కాబోతోంది అనేది తెలియాల్సింది. మరోసారి పెద్ది కారణంగా అయ్యగారు తప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయా? లేదంటే యధావిధిగా జూన్ 26వ తేదీ విడుదల కాబోతోందా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ అన్నపూర్ణ బ్యానర్లపై నాగ వంశీ, నాగార్జున నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు. అఖిల్ కు మంచి సక్సెస్ అందించడం కోసం నాగార్జున రంగంలోకి దిగి ఎలాంటి తప్పులు లేకుండా మంచి క్వాలిటీ కంటెంట్ ఉన్న సినిమాని ప్రేక్షకులకు అందించబోతున్నారని తెలుస్తోంది.
సినిమా విడుదల వాయిదాకు కారణాలు
మొత్తానికి, అఖిల్ లెనిన్ సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న వేళ, సినిమా ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో వేచి చూడాలి.


